కోహినూరు వజ్రము!
• కోహినూరు వజ్రము తెలుగువారి అమూల్య సంపదకూ, ఆంధ్రప్రదేశ్లో జరిగిన చారిత్రక ఘటనలకూ ఒక గీటురాయి.
• పారశీక భాషలో కోహినూరు అనగా కాంతి పర్వతము.
• ఆంధ్రదేశము లోని గోల్కొండ రాజ్యములో ఇది లభించింది.
• కోహినూరు వజ్రము ప్రపంచములోకెల్లా అతిపెద్ద వజ్రముగా పరిగణించబడే 105 కారట్ల (21.6 గ్రాములు)వజ్రము.
• ఈ వజ్రము చరిత్రలో పలువివాదాలకు కారణమై, హిందూదేశ పారశీక రాజుల మధ్య యుద్ధములకు దారితీసి చివరకు బ్రిటిష్ వారికి దక్కినది.
• 1877లో విక్టోరియా మహారాణి హిందూదేశ మహారాణిగా పట్టాభిషిక్తురాలయినపుడు ఆమె కిరీటములో ప్రధానమైన వజ్రముగా పొదగబడింది.
• గోల్కొండ రాజ్యములోని ఓ అసాధారణ వజ్రం కోహినూరు.
• కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు క్రీ. శ. 1310 లో ఢిల్లీ సుల్తాను పంపిన మాలిక్ కాఫుర్ తో సంధిచేసుకొని అపారమైన సంపదతో బాటు , కోహినూరు వజ్రము సమర్పించుకున్నాడు.
• ప్రపంచ ప్రసిద్ధి పొందిన ఈ కోహినూర్ వజ్రం మహబూబ్ నగర్ ప్రాంతంలో దొరికినట్లు చెబుతారు.
• ఈ అసాధారణ వజ్రం ఎన్నో రాజ్యాలను కూల్చింది.
• ఎందరో రాజులను మార్చింది.
• చివరికి బ్రిటిష్ రాణి తల మీద చోటు సంపాదించింది.
• ఇంత ఘన చరిత్ర కలిగిన ఆ వజ్రం పేరు 'కోహినూర్'.
• బాబర్ నామాలో మొఘల్ చక్రవర్తి బాబర్ కోహినూర్ ప్రాశస్త్యాన్ని వర్ణిస్తూ "ఇది ఎంత విలువైనదంటే దీని వెల యావత్ ప్రపంచం ఒక రోజు చేసే ఖర్చులో సగం ఉంటుంది' అన్నాడు.
• మాల్వా రాజు మహలక్ దేవ్ దీని తొలి యజమానిగా చరిత్రకెక్కాడు.
• తర్వాత మాల్వాను జయించిన ఢిల్లీ పాలకుడు అల్లావుద్దీన్ ఖిల్జీ దీన్ని సొంతం చేసుకున్నాడు.
• 1626వ సంవత్సరంలో కాంతులీనే ఈ అపురూప వజ్రం బాబర్ వశమై 'బాబర్ వజ్రం'గా పేరు పొందింది.
• క్రీ. శ. 1913వ సంవత్సరంలో తన వద్ద శరణు కోరి వచ్చిన పర్షియన్ రాజుల నుంచి పంజాబ్‌పాలకుడు మహారాజా రంజిత్ సింగ్‌దీన్ని సొంతం చేసుకున్నాడు.
• చివరికి చిన్నవయసులో పట్టాభిషిక్తుడైన దులీప్‌సింగ్ ద్వారా బ్రిటిష్ గవర్నర్ లార్డ్ డల్హౌసీ దీన్ని విక్టోరియా రాణికి బహుమతిగా ఇప్పించాడు.
• రాణి దానికి మళ్లీ సాన బెట్టించింది.
• సానపెడితే దాని కాంతి పెరగకపోగా నాణ్యత నూటా ఎనబై ఆరు క్యారెట్ల నుంచి నూటా తొమ్మిది క్యారెట్లకు తగ్గింది.
• దీన్ని కిరీటంలో తాపడం చేయించి ఆమె ధరించింది.
• తర్వాత అలెగ్జాండ్రా, మేరీ, ఎలిజబెత్ రాణులు దీన్ని ధరించారు.
• ప్రపంచంలోని వజ్రాలలోకెల్లా కాంతివంతమైన కోహినూర్‌ను తిరిగి ఇవ్వాల్సిందిగా 1947 మరియు 1953వ సంవత్సరంలలో భారత ప్రభుత్వం విజ్ఞప్తి చేసినప్పటికీ ఫలితం కనిపించలేదు..