ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

BAMMERA POTHANA VARI BHAGAVATHAMU - KUCHELOPAKYANAMU


భాగవతము - పోతన - కుచేలోపాఖ్యానము 

కుచేలుడారాత్రి శ్రీకృష్ణ మందిరముననేక రుచికరమైన పదార్ధములతో భోజనము చేసి మెత్తని శయ్య పై పరుండి స్వర్గ సుఖములగు భోగములు అనుభవించి నటుల భావించి నిదురపోయను. మరునాడు ఉదయముననే లేచి కాలక్రుత్యాదులు జతపములు ముగించుకొని శ్రీకృష్ణుడు కొంతదూరము సాగానంపగా గృహోన్ముఖు డగుచు .....

నాపుణ్య మరయ నెట్టిదో యాపుణ్యనిధిం, బ్రశాంతు నచ్యుతు నఖిల 
వ్యాపకు భ్రహ్మణ్యుని జిద్రూపకు బురుషోత్తముని బరుం గను గొంటిన్
ఆ పురుషోత్తముని ఎన్ని విశేషణములతో కొనియాడుచున్నాడో. ప్రశాంత చిత్తుడు, పుణ్యనిధి, నచ్యుతుడు, సర్వము వ్యాపించినవాడు, బ్రాహ్మణుల మేలుకోరువాడు, అయిన శ్రీకృష్ణ పరమాత్మను చూచితిని. అని సంతోషించుచునే .......

శ్రీనిధి యిట్లు నన్ను బచరించి ఘనమ్ముగ విత్తమేమియు
న్నీనితెరంగు గానబడె నెన్న దరిద్రుడు సంపదంధుడై
కానక తన్ను జేరడని కాక శ్రితార్తిహరుండు సత్క్రుపాo
భోనిధి సర్వవస్తు పరిపూర్ణునిగా నను జేయకుండునే !
నేను నా దారిద్ర్యమును బాపుకోనుటకు అతనిని దర్శించితిని. నాకు వలయు ధనమునిచ్చుననియే కదా నా భార్య ఈ ప్రయాణము కట్టించినది. కాని ఆ పరమాత్య నాకు ఏమియునివ్వలేదు. కారణము, ఈ దరిద్రునకు సంపదలు కలిగిన, ఆ అంధకారములో పడి భగవంతుని విస్మరించును. పిదప నన్ను జేరలేడు. అని తలంచి యుండును అంతే కాని ఆశ్రితుల ఆర్తిని తొలగించు ఆ దయాసాగరుడు నాకు సంపద లీయ కుండునా ! దీని ఆంతర్యము ధనమదముతో ప్రస్తుత కాలమున కొందరు భగవంతుని విస్మరించి అంతా తమ ప్రతాపమే అను భావముననున్న వారిని చూచున్నాము అట్టి వారికి పరోక్షముగా నీ హెచ్చరిక చేయుచున్నాడు పోతన.