ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

SRI VEERA VENKATA SATYANARAYANA SWAMY TEMPLE WHERE LORD BRAHMA, VISHNU AND MAHESWARA RESIDES IN ONE PLACE - ANNAVARAM - SANKAVARAM MANDAL - EAST GODAVARI DISTRICT - ANDHRA PRADESH - INDIA


శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి దేవాలయం 

బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురూ కొలువైన త్రిమూర్తి నిలయం అన్నవరం. ఈ ఆలయం రెండు అంతస్థులలో నిర్మింపబడింది. క్రింది భాగంలో యంత్రం, పై అంతస్థులో స్వామి విగ్రహాలు ఉన్నాయి. స్వామి విగ్రహం 4 మీటర్ల ఎత్తు ఉంది. క్రింద గర్భగుడి ఉన్న భాగాన్ని విష్ణు మూర్తి గా అర్చిస్తారు, మధ్యభాగంలో ఉన్నదానిని శివునిగా పూజిస్తారు. మూలవిరాట్టు అంతా ఏక విగ్రహంగా ఉండి త్రిమూర్తులుగా పూజింప బడడం ఇక్కడి విశేషం. త్రిపాద విభూతి నారాయణ ఉపనిషత్తులో వర్ణింపబడిన యంత్రం ఇక్కడ ఉన్నది. అలా త్రిమూర్తులు వెలసిన ఈ అరుదైన ఆలయానికి యుగాల చరిత్ర ఉందంటారు భక్తులు.

తూర్పు గోదావరి జిల్లా శంఖవరం మండలో అన్నవరం ఉంది . అన్నవరం కలకత్తా - మద్రాసు జాతీయ రహదారి పై రాజమండ్రి నుండి దాదాపుగా 70 కి.మీ, కాకినాడ కి 45 కి.మి. దూరంలో ఉంది. ఈ గ్రామంలోని అన్నవరం రైల్వే స్టేషన్ విశాఖపట్టణం-విజయవాడ రైలుమార్గంలో వస్తుంది.