ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

IMPORTANT TIPS/ ITEMS / POINTS / INSTRUCTIONS TO BE REMEMBERED FOR VISING A HINDU TEMPLE


ఆలయానికి వెళ్తున్నారా..? అయితే ఇవన్నీ తప్పనిసరి!

01. ఆలయ ప్రదక్షిణలు చేసేటప్పుడు వేగం కూడదు.

02. అనవసరంగా మాట్లాడటం.. పరుషపదజాలం ఉపయోగించకూడదు

03. ఆవలింతలు, జుట్టు పీక్కోవడం, తల గీక్కోవడం, తమలపాకులు వేయకూడదు.

04. జననం, మరణం సంబంధించిన విషయాలపై మాట్లాడకూడదు.

05. టోపీలు, తలకు వస్త్రాలు కట్టుకోవడం చేయకూడదు.

06. ధ్వజస్తంభం, బలిపీఠం, గోపుర స్థలాలను తొక్క కూడదు.

07. ఆకర్షణీయ దుస్తులను ధరించకూడదు.

08. నందీశ్వరుడు, శివలింగానికి మధ్యలో వెళ్ళకూడదు.

09. దర్శనం పూర్తయ్యాక వెనకవైపు కాస్త దూరం నడిచి, తర్వాత తిరగాలి.

10. ఒక చేత్తో దర్శనం చేయకూడదు.

11. భుజాలపై టవల్స్ వేసుకుని దర్శనం చేయకూడదు.

12. ఆలయంలో భుజించడం, నిద్రించడం చేయకూడదు.

13. ఆలయంలో ఎత్తైన ప్రాంతంలో కూర్చోకూడదు.

14. బలిపీఠంలో ఉన్న సన్నిధిని మ్రొక్కకూడదు.

15. ఆలయ ఆస్తులను అపహరించకూడదు.

16. అష్టమి, నవమి, అమావాస్య, పౌర్ణమి, మాస ప్రారంభం, సోమవారం, ప్రదోషం, 

చతుర్థి రోజుల్లో బిల్వ దళాలను తుంచకూడదు.

17. ఆలయంలో స్నానం చేయకుండా ప్రవేశించకూడదు.

18. మూల విరాట్‌ వద్ద దీపం లేకుండా దర్శనం చేయకూడదు
.
19. ఆలయానికి వెళ్లొచ్చిన వెంటే కాళ్లను కడగకూడదు. కాసేపు కూర్చున్న తర్వాతే ఇవన్నీ చేయాలి.

20. ఆలయంలోకి ప్రవేశించి, తిరిగి వచ్చేంతవరకు నిదానం ప్రదానంగా ఉండాలి.

21. గోపుర దర్శనం తప్పక చేయాలి.

22. ఆలయంలోని మర్రి చెట్టును సాయంత్రం 6గంటల తర్వాత ప్రదక్షిణలు చేయకూడదు.

23. ఆలయంలోపల గట్టిగా మాట్లాడకూడదు.

24. మన మాటలు, చేష్ఠలు ఇతరులకు ఆటంకంగా ఉండకూడదు.