ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

ARTICLE ABOUT SRI NETTIKANTI ANJANEYASWAMY TEMPLE, KASAPURAM, GUNTHAKAL MANDAL, ANANTHAPUR DISTRICT - INDIA


శ్రీ నెట్టెకంటి ఆంజనేయస్వామి , కసాపురం,గుంతకల్ మండలం, అనంతపురం జిల్లా

క్రీ.శ. 16 వ శతాబ్దములో విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల వారిని కుహు యనుదుష్టగండమునుండి రక్షించు నిమిత్తమై శ్రీవ్యాసరాయలవారు కొన్ని ఘడియలు సింహాసన మధిష్టించి రాజ్యపాలనచేసి తర్వాత శ్రీకృష్ణదేవరాయలవారిని సింహాసనాధిష్టునిచేసి సంతృప్తి చెంది అనంతరం ధర్మప్రచారార్థమై దక్షిణదేశయాత్ర గావించారు. ప్రతిదినము తన ప్రాణపతియగు శ్రీ ఆంజనేయస్వామిని ఆరాధింపక నీరు కూడా ముట్టని శ్రీ వ్యాసరాయలవారు తాను సందర్శించిన ప్రతిగ్రామమునందు శ్రీఆంజనేయస్వామి విగ్రహమును ప్రతిష్టింప ఏర్పాటు గావించినారు.

శ్రీ వ్యాసరాయలవారు తన యాత్రలో నేటి చిప్పగిరి (శిల్పగిరి)లో మజిలీ గావించినప్పుడు శ్రీఆంజనేయస్వామి శ్రీవ్యాసరాయలవారికి కలలో సాక్షాత్కరించి సమీపమునగల నెట్టికల్లు గ్రామమున ఎండువేపపుల్ల చిగిర్చిన ప్రదేశము తనకు ప్రీతికరమైన స్థలమని చెప్పి ఆ ప్రదేశమున తన విగ్రహమును ప్రతిష్టించుమని ఆదేశించి అంతర్థానమయ్యాడట.. మర్నాడు శ్రీవ్యాసరాయలవారు ఆ ప్రదేశమును చూచి శ్రీ ఆంజనేయస్వామివారి విగ్రహాన్ని తన శిష్యబృందముతో కలిసి నలబైఒక్క దినములు ప్రాణ ప్రతిష్ట చేసి శ్రీ ఆంజనేయస్వామిని నెలకొల్పారని వినికిడి.

నెట్టికల్లు గ్రామమున వెలసియుండుటచే నెట్టికంటి ఆంజనేయస్వామిగా పిలువబడుచున్నారు. శ్రీవ్యాసరాయప్రతిష్టితమగు శ్రీఆంజనేయస్వామి యెడల భక్తులు అపారమైన భక్తివిశ్వాసము మరియు అభిమానము కలిగియున్నారు, మరియు తమకు పట్టుకున్న గ్రహబాదలను తొలగించుటకు అనారోగ్యమును పోగొట్టుకొని ఆరోగ్యమును పొందుటకు, సంతానప్రాప్తికి శ్రీస్వామివార్ని ప్రతినిత్యము ఉదయం సాయంకాలములందు నిష్టతో ప్రదక్షిణలు గావించి ఉపవాసము చేస్తూ సేవించే భక్తులు నేడు అధికంగా ఉన్నారు.

అనంతపురం జిల్లా గుంతకల్ మండలంలో కసాపురం ఉంది. శ్రీ స్వామివారిని సందర్శింఛే యాత్రికులు గుంతకల్ నుండి పత్తికొండ వెళ్ళు ఆర్డినరీ బస్ సర్వీసులో ప్రయాణం చేసి చేరుకోవచ్చు. పాతబస్టాండు నుంచి ప్రతి 5 నిమి.ఆటోలు కలవు గుంతకల్ నుండి 4 కి.మీ దూరంలో ఉంది.శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామిని దర్శించి ఆయన కృపాకటాక్షములకు పాత్రులగుదురుగాక.