ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

ARTICLE ABOUT AMAZING FACTS ABOUT LORD SRI VARADARAJA PERUMAL TEMPLE, KANCHIPURAM, INDIA


శ్రీవరదరాజ పెరుమాళ్ ఆలయం కాంచీపురం

కాంచీపురంలో శ్రీమహావిష్ణువు కొలువుదీరిన సుప్రసిద్ధ ఆలయాలలో శ్రీవరదరాజ పెరుమాళ్ ఆలయానికి విశిష్ట స్థానం ఉంది. ఈ ఆలయం దేవరాజ పెరుమాళ్ ఆలయం అని కూడా ప్రసిద్ధి. శ్రీవరదరాజ పెరుమాళ్ ఆలయాన్ని చోళ రాజులు నిర్మించారు. ఈ ఆలయాన్ని చోళ రాజులైన కుళోత్తుంగ చోళ మరియు విక్రమ చోళ కాలంలో విశేషంగా అభివృధ్ధి చేశారు.
శ్రీవైష్ణవులకు పరమపవిత్రమైన 108 దివ్యదేశాలలో, శ్రీవరదరాజ పెరుమాళ్ ఆలయం కూడా ఒకటి. పన్నిద్దరు ఆళ్వార్లు అయిన పొయ్‌గై ఆళ్వార్, పూదత్తాళ్వార్, పేయాళ్వార్, పెరియాళ్వార్, తిరుమళిశై ఆళ్వార్, కులశేఖరాళ్వార్, తిరుప్పాణాళ్వార్, తొండరడిప్పొడియాళ్వార్, తిరుమంగయాళ్వార్, మధురకవియాళ్వార్, ఆండాళ్, నమ్మాళ్వారులు శ్రీవరదరాజ పెరుమాళ్ ఆలయాన్ని సందర్శించారని ప్రతీతి.
ఈ ఆలయంలో భగవద్ రామానుజులు కొంతకాలం నివశించారని ప్రతీతి. ఈ ఆలయంలో శ్రీవరదరాజ పెరుమాళ్ పేరుందేవి తాయారు సహితంగా కొలువుదీరి ఉన్నారు.
శ్రీవరదరాజ పెరుమాళ్ ఆలయానికే హస్తిగిరి (హస్తి అంటే ఏనుగు, గిరి అంటే కొండ) అని కూడా పేరు. శ్రీవరదరాజ పెరుమాళ్ ఆలయం హస్తిగిరిపై నిర్మించారు. ఈ ఆలయంలో శ్రీవరదరాజ పెరుమాళ్ అర్చామూర్తి పశ్చిమ దిక్కుకు నిలబడి ఉంటాడు. శ్రీవరదరాజ పెరుమాళ్ చతుర్భుజాలతో శంఖచక్రాలుగధ ధరించి అభయ హస్తంతో నయనానందకరంగా దర్శనమిస్తారు. ఇక్కడ శ్రీమహాలక్ష్మి పేరుందేవి తాయారుగా కొలువుదీరి ఉంది. పేరుందేవి తాయారుకి మహాదేవి అని కూడా పేరు.
కృతయుగంలో చతుర్ముఖ బ్రహ్మ ,త్రేతాయుగంలో గజేంద్రుడు , ద్వాపరయుగంలో దేవగురువు బృహస్పతి, కలియుగంలో ఆదిశేషుడు శ్రీవరదరాజ పెరుమాళ్ ని సేవించారని ప్రతీతి.
ఈ ఆలయంలో కృష్ణ, రామ, వరాహ స్వామి, కరియమాణిక్య పెరుమాళ్, ఆండాళ్, ఆళ్వార్ల కొలువుదీరి ఉన్నారు.
ఇక్కడ ఉన్న మరో విశేషం ఆలయ పైకప్పు పై పీఠంపై సుందరంగా మలచిన బంగారు బల్లి మరియు వెండి బల్లి ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ బల్లులని స్ఫృశిస్తే పాపాలు తొలగి పోతాయని ప్రతీతి. ఈ బల్లుల పక్కనే వేరే పీఠంపై ఉన్న సూర్య, చంద్రుల రూపాలు ఆకర్షణీయంగా ఉంటాయి.
శ్రీవరదరాజ పెరుమాళ్ ఆలయంలో నూరు కాళ్ళ మండపలో స్థంభాలపై కొలుదీరిన వివిధ రూపాలలో మలచిన విగ్రహాలు కడు రమణీయంగా ఉంటాయి. ఇక్కడ ఏకశిలతో చెక్కిన రాతి గొలుసులు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.
చూస్తే భోగ్యమైనచి వరదుని గరుడ సేవ చూడాలి అనేటట్లు శ్రీవరదరాజ పెరుమాళ్ కి గరుడసేవ విశేషంగా జరుగుతుంది. ఈ బ్రహ్మోత్సవాలు వైశాఖ మాసంలో జరుగుతాయి. గరుఢారూడుడై శంకచక్రధారియై, అభయ వరద హస్తాలతో కంచి వరదుడు గరుడసేవ అంగరంగ వైభవంగా జరుగుతుంది. శ్రీవరదరాజ పెరుమాళ్ గరుడారూఢుడై పుర వీధులలో ఊరేగుతారు. ఇక్కడ శ్రీవరదరాజ పెరుమాళ్ స్వామి గరుడసేవలో అర్చకులు కొద్ది విఘడియలు స్వామి వారి ఉత్సవ మూర్తికి శ్వేత ఛత్రాలు అడ్డుగా పెడతారు. దొడ్డయాచార్య అనే భక్తుడు షోలింగూర్ నివసించేవాడు. దొడ్డయాచార్య ప్రతి సంవత్సరం కంచి వరదుని గరుడసేవ చూడటానికి వచ్చేవాడు. వయోవృధ్ధుడై అనారోగ్యంతో ఉన్న దొడ్డయాచార్య కంచి వరదుని గరుడ సేవ దర్శనానికి రాలేకపోయి, షోలింగూర్ లోనే ఉండి, కంచి వరదుని గరుడ సేవ దర్శించే భాగ్యం లేదు అని బాధపడతాడు.
భక్తుల పాలిట కల్పతరువైన కంచి వరదుడు తన ప్రియ భక్తుడికి దర్శనం యివ్వాలని తలచి, అర్చకులకు తనకు కొద్ది విఘడియలు శ్వేత ఛత్రాలు అడ్డుగా పెట్టమని చెప్పి, శ్రీవరదరాజ పెరుమాళ్ గరుడాళ్వార్ తో అదృశ్యమై షోలింగూర్లో దొడ్డయాచార్యకు దర్శనమిస్తారు. అప్పటినుంచి కంచి వరదుని గరుడసేవలో అర్చకులు వరదునికి కొద్ది విఘడియలు శ్వేత ఛత్రాలు అడ్డుగా పెడతారు అని ప్రతీతి.
శ్రీవరదరాజ పెరుమాళ్ అర్చారూపం అత్తి కలపతో మలిచారని ప్రతీతి. అయితే శ్రీవరదరాజ పెరుమాళ్ అర్చారూపాన్ని ఆలయ ప్రాంగణంలో ఉన్న కోనేరు నుంచి, ప్రతి 40 సంవత్సరాలకొకసారి కోనేరులో నుంచి తీసి 10 రోజులు దర్శనానికి అనుమతిస్తారు. 1979వ సంవత్సరంలో అత్తి శ్రీవరదరాజ పెరుమాళును కోనేరు నుంచి బయటకి తీసి దర్శనానికి అనుమతించారు.మళ్ళీ 2019వ సంవత్సరంలోనే అత్తి శ్రీవరదరాజ పెరుమాళును దర్శించగలం