ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

BHAKTHI MARGALU - DIFFERENT WAYS TO PRAY THE ETERNAL GOD


 భక్తి కి మార్గాలు

మానవులు జీవించుటకు అన్నిప్రాణుల పట్ల సమ ప్రేమభావం, అహంకారము వదలి మమకారముతో సద్బావం, సుఖదు:ఖాలను సమభావంతో స్వీకరించే స్వభావం ఉండాలి , సంతృప్తి , ఆత్మనిగ్రహము,దృడ నిత్యయముతో ఉన్నవారికి పెరుగును భక్తి భావం

1. " భాగావంతునిపై మనకు గల అంకిత భావమే భక్తి " 
అన్నారు వ్యాస మహర్షి

2. " నేను అనే అహాన్ని వదలి అంతా భగవంతుడే అన్న భావమే
భక్తి " అన్నారు శాండిల్యముని.

3. " సమస్తం ఆ సర్వేశ్వరునికి అర్పించడం అనేది భక్తి " అన్నారు
నారద మహర్షి

4. " ధ్యానం ద్వారా మోక్షం, భక్తి భావం పెరుగును " అన్నారు
ఆది శంకరాచార్యులు

భగవద్గీతలో శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చన, వందనం, ధ్యానం, శక్యం, ఆత్మనివేదనం, అంటూ తొమ్మిది భక్తీ మార్గాలు.

పరమాత్మ సాక్షా త్కారానికి భక్తులు భక్తి మార్గాన్ని ఎన్నుకుంటారు.

1. వేదా ధ్యయనం చేసిన పండితులు, జ్ఞానులు పరబ్రహ్మము
ను ఉపాసించడమే " పర భక్తి".
2. ఇష్ట దేవతలను ఉపాసించడం " అపర భక్తి " .
3. యాత్రలు చేసి, దేవతా స్వరూపాలను ఆరాధించటం " భయ
భక్తి "
4. ఇష్ట దేవుని ప్రతిరూపాన్ని ఆరాధించడం " అన్వయ భక్తి "
5. ఎల్లాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా దేవుని ప్రేమించడం
"ఏకాంత భక్తి "
6. ఎల్లాంటి ఉద్వేగాలకు పోకుండా ప్రశాంతమైన ప్రార్ధన "
శాంత భావ భక్తి "
7. నేను నీకు దాసుడను అనే చేసే ప్రార్ధనను " దాస్య
భావ భక్తి "
8. దేవుణ్ణి ప్రియమిత్రునిగా భావించి చేసే ప్రార్ధనను " సఖ్య
భావ భక్తి "
9. భక్తులు భగవంతున్ని బిడ్డలుగా భావించి చేసే ప్రార్ధనను "
వాత్సల్య భావ భక్తి "
10. భర్తే దేవునిగా భావించి చేసే ప్రార్ధనను " కాంత భావ భక్తి "
11. మనస్సును పూర్తిగా అర్పించి చేసే ప్రార్ధనను " మాధుర్య
భావ భక్తి "
12. భగవన్నామస్మరణను
నిరంతరం ఒక పద్దతి ప్రకారం
చేయడం" అబ్యాస భక్తి"
13. మంచి చెడులు వ్యత్యాసాలను గమనించి చేసే ప్రార్ధనను
"వివేక భక్తి"
14. భగవంతుని దూషింస్తూ చేసే స్మరణను " విముఖ భక్తి "
15. ఎల్లప్పుడూ సత్యమార్గాన్న చేసే ప్రార్ధనను " సత్య భక్తి "
16. దేవుని కళ్యాణాలు చేస్తూ ప్రర్దిమ్చడమే " కల్యాణ భక్తి "
17. ప్రాణుల పట్ల అహింసను ప్రదర్సిస్తూ పరమను చూపే
భక్తిని " అహింస భక్తి "
18. సమాజానికి చేతనైనంత దానం చేయటమే "దాన భక్తి "

ప్రతి ఒక్కరు భక్తి మార్గములో నడుస్తూ సమాజానికి, దేశానికి భారం కాకుండ, మనుష్యులు " బ్రతికి- బ్రతికించుకుంటు" జీవించడమే " నిజమైన భక్తి "