ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

BRIEF HISTORY AND PARTICULARS OF SRI RAMASWAMY TEMPLE - SRIRAMA THIRDHAM - VIJAYANAGARAM DISTRICT - ANDHRA PRADESH - INDIA


శ్రీ రామస్వామి వారి దేవస్థానం

శ్రీరామతీర్థం, విజయనగరం జిల్లా, ఫోన్‌ : 08922-244036

విజయనగరం పట్టణానికి ఈశాన్యంగా 12 కి.మీ. దూరంలో చంపావతీ నదీ సమీపంలో శ్రీరామతీర్థం వుంది. ఈ క్షేత్రంలో భక్తుల పాలిట కల్పతరువై, భక్తజనులను అమృతహస్తాలతో ఆదుకొనే దివ్యమంగళ స్వరూపులైన శ్రీ సీతాలూణ సమేతులైన శ్రీరామచంద్ర ప్రభువుల దేవాలయం నిర్మించబడింది. ఇక్కడ గల శ్రీ స్వామివారు నీటి మడుగులో అంటే 'తీర్థం' నందు లభించుట వలన ఈ క్షేత్రానికి 'రామతీర్థం' అని పేరు వచ్చింది.

* శ్రీరామతీర్థ క్షేత్ర మాహాత్యం

ద్వాపరయుగంలో పాండవులు ఈ ప్రాంతంలో అరణ్యవాసం చేసినపుడు, శ్రీకృష్ణుిని తోడు రమ్మనగా, అందుకు శ్రీకృష్ణ పరమాత్మ సున్నితంగా తిరస్కరిస్తూ, మేము రామావతార సమయమున ఈ దండ కారణ్య ప్రాంతంలోనే సంచరించామనీ, మీరు కూడ సంచరించండి అని నాటి వనవాసమూర్తులైన సీతాలక్ష ్మణ సమేత మచంద్రుని విగ్రహ ప్రతిమలను తన భగవత్‌ లీలచే సృష్టించి పాండవులకు అంద జేస్తూ, పూజించుకోమని చెప్పాడు. ఆవిధంగా పాండవులు కొంతకాలం ఆరాధన చేసుకొని, వారు వేరే ప్రాంతానికి వెళ్తా, 'వేదగర్భు' అగు శ్రీవైష్ణవునకు ఆ విగ్రహాలను అప్పగించి, నిత్యం పూజాదికాలు నిర్వ హించమని చెప్పి వెళ్ళిపోయారు.

ఆ తర్వాత వేదగర్భు కొంతకాలం అర్చన చేసుకొన్న అనం తరం ఈ ప్రాంతంలో బ∫ద్ధుల ప్రాబల్యం పెరిగి, వారు విగ్రహా రాధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుండం వలన, వేదగర్భు శ్రీ సీతారామలక్ష ్మణుల విగ్రహాలను భూమిలోపల భద్రపరచి వేరేప్రాంతా నికి వెళ్లిపోయాడు. విజయనగర సంస్థానాధీశులైన పూసపాటి వంశీయులు ఈ ప్రాంతమునందు గల 'కుంభిళాపురము' (నేటి కుమిలి గ్రామం) ను రాజధానిగా చేసుకొని పరిపాలించేవారు. పూసపాటి సీతారామచంద్ర మహారాజుగారి పాలనలో ధర్మరక్షణ గావించబడుచూ దేశం సుభిక్షంగా ఉండేది. ఆ రాజ్య ప్రజలు దండకారణ్యంగా వున్న ఈ ప్రాంతంలో వంటచెరకు, కందమూలాదులు, ఫలజాతులు సేకరించుటకు ప్రతిరో వచ్చేవారు.

ఒకరోజు సాయంత్రం పుట్టు మూగది అయిన ఒక ముదుసలి అక్కడకు రాగా కుంభవృష్టిగా వాన వచ్చింది. మహావృక్షాలు కూడ ఫెళఫెళ ధ్వనులతో నేలకొరుగుతుండగా ఆ బీభత్సానికి భీతిల్లిన జంతు వుల నలుదిక్కులకూ పరిగెత్తసాగాయి. అరణ్యానికి వచ్చిన ప్రజలు కూడ కకావికలురయ్యారు. ఎటూ పాలుపోని ఆ ముదుసలి ఒక చెట్టు తొర్రలో తలదాచుకొని ఏడుస్తుండగా ఆ రాత్రి సమయాన శ్రీరామచంద్ర ప్రభువు సాక్షాత్కరించి దర్శనమిచ్చారు.

ఆమె ఆనందంతో ఉబ్బితబ్బిబ్బై సంజ్ఞలతోనే ప్రార్థించగా, శ్రీరామ చంద్రుడు ఆమె నాలుకపై దర్భకొనతో బీజాక్షరాలు వ్రాయగా, ఆమెకు మాటలు వచ్చాయి. ఆమె ఆనందపరవశురాలై, తనది కుంభిళా పురమనీ, తమను పాలించువారు పూసపాటి సీతారామచంద్ర మహా రాజులనీ వివరించింది. తమ విగ్రహాలు భూగర్భంలో ఉన్నాయనీ, మీ రాజావారికి వివరించి, ఈ స్థలములో దేవాలయము నిర్మించమని చెప్పమనీ ఆజ్ఞాపించి, అంతర్థానమయ్యెను. అదే సమయానికి మహా రాజావారికి, కలలో భగవంతుడు సాక్షాత్కరించి ముదుసలి చెప్పిన విధంగా చేయమని ఆజ్ఞాపించారు.

తెల్లవారేసరికి ముదుసలి గ్రామానికి వెళ్ళేసరికి, మహారాజావారు ఆమెను ఆస్థానానికి రమ్మనమని కబురుపంపారు. ఆమె వెళ్లి భగవత్‌ సాక్షాత్కారం అయిందనీ, శ్రీరామచంద్ర ప్రభువు ఆలయాన్ని నిర్మించమని ఆజ్ఞాపించినట్లుగా చెప్పింది. వెనువెంటనే మహారాజావారు ఈ అరణ్యప్రాంతానికి వచ్చి, వెతికించగా ఒక ప్రాంతంలోని నీటి మడుగున సీతారామలక్ష ్మణుల విగ్రహ ప్రతిమలు లభించాయి. అప్పుడు వాటిని ఆనందంతో వెలికితీసి, దేవాలయాన్ని నిర్మించి, మాఘ శుద్ధ ఏకాదశి (భీష్మ ఏకాదశి) నాడు ప్రతిషిసం చం జరిగింది. నాటినుండి రామతీర్థం విజయనగరం జిల్లాలోనే కాక మన రాష్ట్రంలోని ప్రముఖ దివ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది.