ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

HEALTH WITH KAREVEPAKU


ఔషదగుణాల కరివేపాకు
^^^^^^^^^^^^^^^^^^^^^
మనం ఆహార పదార్ధాలలో ఉపయోగించే కరివేపాకును రుచికోసమే ఉపయోగిస్తుంటాం. కాని ఇందులో ఎన్నో ఔషద గుణాలు ఉన్నాయి. ఇది మానసిక ఒత్తిడిని తగ్గించి, మెదడుకు కాల్షియం సరఫరా చేసి ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది.
ఎముకల బలహీనత ఉన్నవారు, అస్ట్రియో పోరోసిస్‌ వ్యాధిగలవారు రీజూ ఆహారం ద్వారా కరివేపాకు తీసుకుంటే మంచిది. 
మధుమేహం ఉన్నవారు ప్రతిరోజూ పరగడుపున నాలుగైదు ఆకులు నమిలి మింగితే రక్తంలో షుగర్‌ శాతం తగ్గుతుంది.
కళ్ళనరాల బలహీనత ఉన్నవారు, కళ్ళకు ఎక్కువపని కల్పించేవారు లేత కరివేపాకును కళ్ళపై కాసేపుంచితే అలసటతగ్గి కంటిచూపు మెరుగవుతుంది.
కరివేపాకు వేళ్ళు కషాయం తయూరుచేసి ప్రతిరీజూ 30మి.టీ చొప్పున తీసుకుంటే మూత్ర పిండాలలో నొప్పి తగ్గి రాళ్ళు కూడా కరుగుతాయి.
కరివేపాకు మంచి కండీషనర్‌గా పనిచేస్తుంది. నూనెలో కరివేపాకు వేసి మరిగించి, చల్లార్చి వారానికి రెండు, మూడుసార్లు జుట్టుకు రాజుకుంటుంటే నిగనిగలాడుతూ ఆరోగ్యంగా ఉంటుంది.
ఇంతేకాకుండా కరివేపాకులో ప్రొటీన్లు, కాల్షియం, కార్బోహైడ్రేట్లు, ఫాస్పరస్‌, ఐరన్‌, విటమిన్‌-సి వంటి అనేక పోషక విలువలున్నాయి. మరి ఇన్ని ప్రయోజనాలున్న కరివేపాకును కూరలలో కనిపించగానే పారేయకుండా తినడం శ్రేయస్కరం.