ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

WHAT IS IMPORTANCE OF KARPURA HARATHI IN GOD'S POOJA IN TEMPLES


దేవుడికి కర్పూర హారతి ఎందుకు ఇవాల్లి?

పూర్వం దేవాలయాల్లోని గర్భాలయాల్లో దీపారాధన వెలుగులో మాత్రమే మూలమూర్తి కనిపిస్తూ వుండేది. అందువలన దైవ దర్శనం కోసం వచ్చిన భక్తులకు మూలమూర్తి రూపం ... అలంకారం కనిపించాలనే ఉద్దేశంతో హారతి ఇచ్చేవారు. హారతిని మూలమూర్తికి దగ్గరగా ... ఎదురుగా వుంచి మూడుమార్లు శిరస్సు నుంచి పాదాల వరకూ గుండ్రంగా తిప్పడంలోని ఉద్దేశం ఇదే.

హారతి వెలుగులో దైవం యొక్క రూపాన్ని చూసి తరించిన భక్తులు, ఆ రూపాన్ని మనసులో ముద్రించుకుని తరిస్తుంటారు. ఇక కర్పూరానికి రూపం ... రంగు ... గుణం ... వంటివి వున్నాయి. అది ఆ రూపాన్ని ... రంగుని ... గుణాన్ని దైవసేవలో వదిలి ఆయనలో కలిసిపోతుంది. భగవంతుని సేవకి జీవితాన్ని అంకితం చేయాలనే విషయాన్ని సమస్త మానవాళికి చాటిచెబుతోంది.

అంతేకాదు కర్పూరానికి విశిష్ట లక్షణాలు ఏన్నో ఉన్నవి. కర్పూరం కృత్రిమంగా తయారవుతుంది అనుకుంటారు చాలామంది. కానీ కాదు. అది చెట్టు నుంచి వస్తుంది. కర్పూరం నుంచి వెలువడే పొగ, వాసన మానసిక అలజడులను, ఆందోళనల్ని తగ్గిస్తుంది. అందుకే దేవుడికి దానితో హారతి ఇస్తారు. ఎందుకంటే దేవుడిని ధ్యానించుకునేటప్పుడు మనసులో ఏ విధమైన ఇతర ఆలోచనలూ లేకుండా, ప్రశాంతంగా పవిత్రంగా ఉండాలని. అలాగే కర్పూరంలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. జలుబును తగ్గిస్తుంది. కంటిచూపును మెరుగుపరుస్తుంది. దాహాన్ని తగ్గిస్తుంది. అంటువ్యాధుల్ని ప్రబలకుండా చేస్తుంది. ఇంకా ఇలాంటి ఉపయోగాలెన్నో ఉండటం వల్ల కర్పూరాన్ని వాడటం ఎంతో మంచిదని శాస్త్రాలు చెబుతున్నాయి.