ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

BRIEF INFORMATION ABOUT BRAHMESWARA SWAMY TEMPLE AT BRAHMA SAMEDYAM - PALLAMKURRU - KATRENIKONA MANDAL - EAST GODAVARI DISTRICT - ANDHRA PRADESH


బ్రహ్మ సమేధ్యం 

తూరుపు తీరంలో తూర్పు గోదావరి జిల్లా కాట్రేనికోన మడలంలోని చిట్టచివరి మత్స్యకార గ్రామం పల్లంకుర్రు. దీన్ని దాటి నాలుగు కిలోమీటర్ల దూరం మడ అడవుల మధ్యనుంచి పడవ ప్రయాణం చేస్తే వచ్చే ద్వీపం 'బ్రహ్మ సమేధ్యం'. ఆ దీవిలో ఒక గుడి. బ్రహ్మేశ్వర స్వామి, ధనలక్ష్మి, దుర్గ అమ్మవారు కొలువుదీరి ఉంటారు.

ఆ గుడిని నమ్ముకున్న పూజారి అయ్యలూరి జగన్మోహన భైరవస్వామి. ఆయనే ఉదయం, సాయంత్రపు వేళల్లో గుడిలో దీపం వెలిగిస్తాడు. తాను వండుకున్నదే దేవతలకు నైవేద్యం సమర్పిస్తాడు. బ్రహ్మ సమేధ్యంలో ఏడాదికొకసారి చొల్లంగి అమావాస్యనాడు జాతర జరుగుతుంది. అదీ రాత్రిపూట. ఆ సమయంలోనే భక్తులు కిక్కిరిసి కనిపిస్తారు. ఆ మర్నాటినుంచి మళ్ళీ బ్రహ్మేశ్వరుడు, ఆయనకుతోడుగా జగన్మోహన భైరవస్వామి ఒకరికొకరు తోడుగా ఉంటారు.