ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

DONT EAT JUNK FOOD - IT WILL SPOILS HEALTH - EAT FRUITS AND FRESH VEGETABLES FOR GOOD HEALTH


జంక్ ఫుడ్ - ఆరోగ్యానికి హానికారి

1) జంక్ ఫుడ్ నుండి మనకు లభించేవి 100% LDL కొలెస్ట్రాల్ (అనవసరపు కొవ్వులు) (Unhealthy fat ) 

2) సాదారణంగా జంక్ ఫుడ్ లో ఎక్కువగా వాడే పదార్ధాలు జంతు సంబందిత నూనెలు , కొవ్వులు, అధిక మోతాదులో సోడియం (ముఖ్యంగా నూడుల్స్ లో అధిక మోతాదులో సోడియం ఉంటుంది), బేకింగ్ సోడా , నిమ్మ ఉప్పు., వాటికి తోడు రోడ్డు మీద దుమ్ము -దూళి తోడవుతుంది.ఇవి శరీరానికి హాని చేసి , కడుపులో అల్సర్లు కలుగచేస్తాయి.

3) చిన్నప్పటి నుండి జంక్ ఫుడ్ తినే పిల్లలో , వారికీ చిన్నప్పుడు ఇచ్చిన వాక్సిన్ పవర్ తగ్గి , వ్యాధినిరోధక శక్తి తగ్గిపోతుంది. యుక్త వయసు వచ్చే సరికి కాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ.

4) కాబట్టి చిన్న పిల్లల చిట్టి గుండె , చిన్ని లివర్ , చిన్న పొట్ట జంక్ ఫుడ్ గాడతను తట్టుకోలేవు, చిన్న వయసులోనే గ్యాస్ ప్రాబ్లం వస్తుంది. చిన్నపిల్లలకు జంక్ ఫుడ్ అలవాటు చేయకండి.వాళ్ళ భవిష్యత్తును నాశనం చేయకండి. ఎక్కువ fruits & dry fruits అలవాటు చేయండి , ఇంట్లోనే fruits తో వివిధ రకాలుగా ఫ్రూట్ సలాడ్స్ చేసి పెట్టండి.

5) చిన్న పిల్లలకే కాదు , పెద్దవాళ్ళకి కూడా జంక్ ఫుడ్ చాలా ప్రమాదం. ప్రతి రోజు జంక్ ఫుడ్ తీసుకొనే వాళ్ళల్లో కొంతకాలానికి అల్సర్లు , అసిడిటీ , ఫ్యాటి లివర్ , ఊభకాయం , షుగర్ , అరుగుదల శక్తి తగ్గిపోవడం , జ్ఞాపకశక్తి తగ్గడం , కంటిచూపు మందగించడం , బీపి పెరగడం , గుండె జబ్బులు , చివరికి కాన్సర్ వచ్చిన ఆశ్చర్యపోనవసరం లేదు.

6) కాబట్టి సాద్యమైనంత వరకు జంక్ ఫుడ్ కి దూరంగా ఉండండి , భవిష్యత్తుకు బాటలు వేసుకోండి.
రోజులో కనీస వ్యాయామం చేసుకొంటూ , తాజా కూరగాయలు , తాజా పండ్లు , తగినన్ని నీటిని తాగుతూ జీవితం చివరి గడియలు వరకు ఆరోగ్యమైన , ఆనందమైన జీవితం గడపండి.