పట్టులాంటి జుట్టు కోసం
వాల్‌నట్లు: ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు జుట్టుకు మేలు చేస్తాయి. ఇవి వాల్‌నట్లలో అధికం. అలానే బయోటిన్, విటమిన్ 'ఇ' కూడా లభిస్తాయి. ఇవి జుట్టును అతినీలలోహిత కిరణాల బారి నుంచి కాపాడతాయి. అలానే వీటిలో ఉండే కాపర్, మినరళ్లు జుట్టు తెల్లబడకుండా చూస్తాయి.
చిలగడ దుంపలు: వీటిలో యాంటీఆక్సిడెంట్లూ, బీటాకెరొటిన్ అధికంగా ఉంటాయి. మాడుకి తేమనూ, నూనె శాతాన్నీ అందిస్తాయి. దాంతో జుట్టు బలంగా ఎదుగుతుంది, రాలిపోవడం తగ్గుతుంది. శరీరానికి బీటాకెరొటిన్ అధికంగా అందాలంటే క్యారెట్లూ, గుమ్మడి, ఆప్రికాట్లు తీసుకుంటే మంచిది.
గుడ్లు: గుడ్లలో ప్రొటీన్లు అధికం. జింక్, సల్ఫర్, సెలీనియం, ఇనుమూ ఉంటాయి. ఇనుము తలలోని కణాలకు ఆక్సిజన్‌ను చేరవేస్తుంది. దీనివల్ల జుట్టు దృఢంగా మారుతుంది.
బీన్స్:వీటిలోని బయోటిన్ జుట్టు ఎదుగుదలలో కీలకపాత్ర పోషిస్తుందని అధ్యయనాలు తెలిపాయి.