శ్రీ వైభవలక్ష్మి
లక్ష్మీ దేవి అమ్మవారు భృగు మహర్షి కూతురుగా జన్మిస్తుంది... భృగు మహర్షి శ్రీ మహావిష్ణువును అనుగ్రహం చేసుకుని అల్లుడిగా పొంది తరిస్తాడు.. ఒకానొక సమయంలో భృగు మహర్షి త్రిమూర్తులలో ఎవరు గొప్ప అనేదానిని తెలుసుకోవడం కోసం వైకుంఠం చేరుకుంటారు.. అప్పుడు పాచికలాటలో నిమగ్నమైఉన్న శ్రీరమా రమణులు మహర్షి రాక గమనించరు.. దానిని అవమానంగా భావించిన మహర్షి కోపం పట్టలేక శ్రీమహావిష్ణువు యొక్క వక్షస్థలాన్ని పాద తాడనం చేస్తాడు... తన్నింది తన తండ్రే అయినా... అవమానం పడింది తన భర్తే అయినా తట్టుకోలేక పోయింది శ్రీ మహాలక్ష్మి... అందుకే తన నివాస స్థానమైన భర్త వక్షస్థలాన్ని తన్నినందుకు.. దానిని భరించిన విష్ణుమూర్తి పై కినిసిందా మహాతల్లి.. (అందుకే లక్ష్మీదేవి పట్ల ఎప్పుడూ తక్కువ చేయకూడదు..)శ్రీమహావిష్ణువు తన భార్యకోసం అలమటించి.. ఘోర తపస్సు చేయగా... క్షీరసాగర మథనంలో తిరిగి జన్మిస్తానని తెలిపి..క్షీరసాగర మధన కాలంలొ లక్ష్మీదేవి అష్టలక్ష్మిగా ఆవిర్భవించింది. ఆదిలక్ష్మి, ధాన్య లక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజ యలక్ష్మి, విద్యా లక్ష్మీ, ధనలక్ష్మి, ఈ ధనలక్ష్మియే వైభవలక్ష్మి. ఇహపర లోకంలో సకలసంపదలను ప్రసాదించే అమ్మవారి స్వరూపమే శ్రీ వైభవ లక్ష్మిదేవిగా ఆవిర్భవించింది. ఈ తల్లి దయవల్ల మానవులు పొంద లేనిదేదీ ఉండదు అని సూతమహర్షి వివరించాడు.
పూర్వకాలమున అమృతము కొరకు దేవతలు, రాక్షసులు పాలసముద్రమును చిలుకు సమయమున ముందుగా లక్ష్మీదేవి పాలసముద్రము నుండి ఉద్భవించిన. అందుకే ఆమె క్షీరరాజతనయ అని పిలవబడుతున్నది. తరువాత కామధేనువు,కల్పవృక్షము హాలాహలము,చివరిగా అమృతము లభించినవి.ఈ విధంగా ఉద్భవించిన శ్రీమహవైభవలక్ష్మిని మనసారాపూజించిన సకల జనులకు ఈ జన్మమునసర్వసుఖములు పరమందు మోక్ష సిద్ధి కలుగుతాయి. కరుణావీక్షణము చేతనే సకల సౌఖ్యముల సమకూర్చగల శ్రీ వైభవలక్ష్మి వైకుంఠమున శ్రీమహావిష్ణువు పై కినుక వహించి, భూలోకమున అవతరించినది.తన హృదయాన్నే శ్రీకి నిలయం చేసుకున్న మహావిష్ణువు,ఆ తల్లిని విడచి వుండలేక తానునూ భూలోకమునకు విచ్చేసినారు.సర్వార్ధసిద్ధ ికి,సకల వరసిద్ధికి, కారణభూతులయిన వీరిరువురూ,భక్తి ప్రపత్తులు గల మానవకోటికి సిరిసంపదలు,సకల సౌఖ్యములను లభింపచేయుటకే,కారణములు కల్పించుకుని భూమిపై అవతరించిరి.అదే ఆ జగన్మోహనుల లీల,ఘటనాఘటన సమర్ధులు కనుక మానవాళికి సౌఖ్యములు ప్రసాదించుటకు సంకల్పించిరి.అహంకారము,తిరస ్కార భావములు కలవారికి మాత్రము వీరు అనుగ్రహము కలుగుట అసంభవము. ఇది నిస్సంశయము.
నీవు తప్ప నాకెవ్వరు దిక్కని స్తుతించిన వారికి అన్నిటా ఆవైభవలక్ష్మితోడై అండగా నిలుస్తుంది.
భాగ్యం కోసం ఆ తల్లిని ఆరాధించిన వారికి,ఆ మాత భోగభాగ్యములను ప్రసాదించే సకల వరప్రదాయిని అవుతుంది.
నిస్సంతులు పుజించినచో సంతానలక్ష్మిగా తన అనురాగమును సంతానమును కలిగించును.
విజయము కొరకు ప్రార్ధించిన జయలక్ష్మి అయి విజయాన్ని కలిగిస్తుంది.
పాండిత్యము కొరకు పూజించిన వారికివిద్యాలక్ష్మిగా సర్వశాస్త్ర పారంగతులను చేసే తల్లి.
ధనము కొరకు పూజించే వారికి ధనలక్ష్మి కోరికలు నెరవేర్చే కరుణామూర్తి.
పంటలు లేక బాధపడేవారు పూజించిన,ధాన్యమునిచ్చు ధాన్యలక్ష్మి.
పిరికితనము పొకొట్టు దైర్యలక్ష్మి నిత్యజీవితావసరాలను ఆశించి ప్యజించువారికి అండగా నిలిచి కాపాడే ఆదిలక్ష్మి.
ఆ తల్లి యెక్క అష్టరూపాలను ఎవరైతే భక్తిగా,శ్రద్ధగా నియమములతో పూజిస్తారో వారికి తప్పకుండా ఆ తల్లి యెక్క అనుగ్రహము లభిస్తూందనటలో సంశయము లేదు.అష్టలక్ష్మి పూజను చేసి లక్ష్మి పూజాకధను విని,ప్రసాదమును స్వీకరించిన వారి కోరికలు తప్పక నెరవేరగలవు.
అమ్మవారి అనుగ్రహ ప్రాప్తి రస్తుః
లక్ష్మీ దేవి అమ్మవారు భృగు మహర్షి కూతురుగా జన్మిస్తుంది... భృగు మహర్షి శ్రీ మహావిష్ణువును అనుగ్రహం చేసుకుని అల్లుడిగా పొంది తరిస్తాడు.. ఒకానొక సమయంలో భృగు మహర్షి త్రిమూర్తులలో ఎవరు గొప్ప అనేదానిని తెలుసుకోవడం కోసం వైకుంఠం చేరుకుంటారు.. అప్పుడు పాచికలాటలో నిమగ్నమైఉన్న శ్రీరమా రమణులు మహర్షి రాక గమనించరు.. దానిని అవమానంగా భావించిన మహర్షి కోపం పట్టలేక శ్రీమహావిష్ణువు యొక్క వక్షస్థలాన్ని పాద తాడనం చేస్తాడు... తన్నింది తన తండ్రే అయినా... అవమానం పడింది తన భర్తే అయినా తట్టుకోలేక పోయింది శ్రీ మహాలక్ష్మి... అందుకే తన నివాస స్థానమైన భర్త వక్షస్థలాన్ని తన్నినందుకు.. దానిని భరించిన విష్ణుమూర్తి పై కినిసిందా మహాతల్లి.. (అందుకే లక్ష్మీదేవి పట్ల ఎప్పుడూ తక్కువ చేయకూడదు..)శ్రీమహావిష్ణువు
పూర్వకాలమున అమృతము కొరకు దేవతలు, రాక్షసులు పాలసముద్రమును చిలుకు సమయమున ముందుగా లక్ష్మీదేవి పాలసముద్రము నుండి ఉద్భవించిన. అందుకే ఆమె క్షీరరాజతనయ అని పిలవబడుతున్నది. తరువాత కామధేనువు,కల్పవృక్షము హాలాహలము,చివరిగా అమృతము లభించినవి.ఈ విధంగా ఉద్భవించిన శ్రీమహవైభవలక్ష్మిని మనసారాపూజించిన సకల జనులకు ఈ జన్మమునసర్వసుఖములు పరమందు మోక్ష సిద్ధి కలుగుతాయి. కరుణావీక్షణము చేతనే సకల సౌఖ్యముల సమకూర్చగల శ్రీ వైభవలక్ష్మి వైకుంఠమున శ్రీమహావిష్ణువు పై కినుక వహించి, భూలోకమున అవతరించినది.తన హృదయాన్నే శ్రీకి నిలయం చేసుకున్న మహావిష్ణువు,ఆ తల్లిని విడచి వుండలేక తానునూ భూలోకమునకు విచ్చేసినారు.సర్వార్ధసిద్ధ