ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

ARTICLE ON SANGHAMA KHSETRAM, WADEPALLI, DHAMARACHERLA MANDAL, MIRYALAGUDA TALUQ, NALGONDA DISTRICT, INDIA


సంగమ క్షేత్రం వాడపల్లి

నల్గొండ జిల్లా, మిర్యాలగూడ తాలూక, దామరచర్ల మండలంలో వున్నదీ వాడపల్లి క్షేత్రం . ఇక్కడ కృష్ణా ముచికుందా (మూసీ) నదీ సంగమతీరాన హరిహరులకు బేధంలేదని నిరూపిస్తూ శ్రీ లక్ష్మీనరసింహస్వామి, శ్రీ అగస్త్యేశ్వరుడు కొలువుతీరి వున్నారు . నల్గొండ అద్దంకి హై వే లో భీమవరం గుండా వాడపల్లికి చేరుకోవచ్చు.. ఈ రోడ్డులో వున్న ఇండియా సిమెంట్స్ కి ఎదురుగా వచ్చే రోడ్ లోకి తిరిగి అర కిలో మీటర్ వెళ్ళాక ఎడమ పక్క వచ్చే మట్టి రోడ్డు లో వెళ్తే ఈ ఆలయం వస్తుంది.వాడపల్లి గ్రామం కృష్ణా, మూసీ నదుల సంగమ ప్రదేశం లో ఉంది. జిల్లా కేంద్రమైన నల్గొండ వాడపల్లికి వాయువ్యదిశలో ఉంటుంది. మిర్యాలగూడ నుండి వాడపల్లికి 25 కి.మీ. దూరం.
12వ శతాబ్దంలో కాకతీయుల కాలంనాటి "మీనాక్షీ అగస్తేశ్వర స్వామి" మందిరం వాడపల్లిలో ప్రసిద్ధం. కృష్ణా నదికి 120 మీటర్ల ఎత్తులో ఉన్న శివలింగం చాలా ప్రసిద్ధము.
6000 సంవత్సరాలక్రితం అగస్త్య మహాముని తీర్ధయాత్రలు చేస్తూ ఈ ప్రాంతానికి వచ్చి, ఇక్కడ కృష్ణా, ముచికుందా నదీ సంగమంలో స్నానంచేసి, ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్టించారు. అగస్త్య మహామునిచే ప్రతిష్టింపబడిన లింగంగనుక అగస్త్యేశ్వరుడయ్యాడు. శివ కేశవులకు బేధములేదని అగస్త్య మహాముని ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామిని కూడా ప్రతిష్టించారు. తర్వాత కొంతకాలానికి రక్షణలేని కారణంగా విగ్రహాలచుట్టూ పుట్టలు లేచాయి.
రెడ్డిరాజులకాలంలో ఈ ప్రదేశంలో రెండు వైపుల నీరు, ఒక వైపే త్రోవ వున్నదని గుర్తించి, ఈ ప్రదేశంలో కోట, ఇళ్ళు కట్టుకుంటే సురక్షితంగా వుంటాయనే వుద్దేశ్యంతో బాగు చేస్తున్న సమయంలో లింగాన్ని చూసి, గుడి కట్టించి పూజించసాగారు. రెడ్డి రాజులిక్కడ కోటలు, ఊళ్ళూ నిర్మించుకుని చాలాకాలం పరిపాలించారు. 11వందల సంవత్సరాలు సురక్షితంగా వున్న ఈ పట్టణం నిజాం మేనల్లుడయిన వజీరు సుల్తాను ముట్టడిలో సర్వనాశనమైంది. వజీరు సుల్తాను గుళ్ళని మాత్రం ఏమీ చేయలేదు.
లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం, వాడపల్లి
దక్షిణ ముఖంగా వున్న ఈ ఆలయం చిన్నదయినా స్వామి భక్తుల అభీష్టాలను నెరవేర్చే స్వామిగా ప్రఖ్యాతి చెందారు. స్వామి తొడ మీద అమ్మవారు కూర్చుని వున్నట్లు వుంటుంది. గర్భ గుడి లో స్వామి ముఖం ఎదురుగా అదే ఎత్తులో ఒక దీపం, కింద ఇంకో దీపం వుంటాయి. కిందవున్న దీపం కదలదు. నిశ్చలంగా వుంటుంది. పైన స్వామి ముఖానికి ఎదురుగా వున్న దీపం చిరుగాలికి రెప రెపలాడుతున్నట్లుంటుంది. ఆ కదలికకి కారణం స్వామి వుఛ్ఛ్వాశ నిశ్వాసలని చెపుతారు.ఈ ఆలయంలో ఒక దండం లాంటి దానితో పూజారి భక్తుల వీపు మీద కొడతారు. దుష్టగ్రహ నివారణకోసం అలా చేస్తారుట.ఈ ఆలయం ఎదురుగా వున్న దోవ లో కొంత దూరం వెళ్తే మీనాక్షి అగస్తేశ్వరాలయం వస్తుంది.
మీనాక్షి అగస్త్యేశ్వరాలయం, వాడపల్లి:
ఈ ఆలయం తూర్పు దిక్కుగా, సంగమాభిముఖంగా వుంటుంది. గుళ్ళో శివుడి పానుపట్టం ఎత్తుగా వుంటుంది. దానిమీద లింగం ఇంకో రెండు అడుగుల ఎత్తు వున్నది. వెండి కళ్లు, వెండి నాగు పాము పడగ, అలంకరణ బాగుంది.
క్షేత్ర పురాణం: ఒక రోజు ఒక బోయవాడు పక్షి ని కొట్టబోతే ఆ పక్షి వచ్చి ఈ స్వామి వెనకాల దాక్కుందట. బోయవాడు వచ్చి పక్షిని ఇవ్వమని అడిగితే శివుడు నా దగ్గరకొచ్చిన పక్షిని ఇవ్వను అన్నాడుట. బోయవాడు మరి నాకు ఆకలిగా వున్నది ఎలాగ అంటే శివుడు కావాలంటే నా తలనుంచి కొంత మాంసం తీసుకోమన్నాడుట. అప్పుడు బోయవాడు రెండు చేతులతో స్వామి తల మీదనుంచి మాంసం తీసుకున్నాడుట. ఆ వేళ్ళ గుర్తులు స్వామి ఫాలభాగం పైన ఇప్పటికీ కనబడుతాయి. స్వామి శిరస్సున ఏర్పడ్డ గాయం కడగటానికి గంగమ్మ వచ్చిందిట. బోయ కండలు తీసిన చోట ఏర్పడిన గుంటలో ఎప్పుడూ నీళ్లు వుంటాయి. ఆ నీరు ఎక్కడనించి వస్తోందో తెలియదుగాని ఎంత తీసినా ఆ నీరు అలాగే వుంటుందట.ఒకసారి శంకరాచార్యులవారు ఆ బిలం లోతు ఎంత వుందో కనుక్కుందామని ఒక బంగారం ముక్కకి తాడు కట్టి ఆ బిలం లో వదిలారుట. ఎంత సమయమైనా ఆ తాడు అలా లోపలకి వెళ్ళటము చూసి పైకి తీసారుట. ఆ ముక్కకి రక్త మాంసాలు అంటుకున్నయిట గాని శివయ్య తల మీద గుంట లోతు తెలియలేదుట. శంకరాచార్యులవారు నిన్ను పరీక్షించటానికి నేనెంతవాడను, క్షమించమని వేడుకున్నాడుట.
నదీ సంగమం కనుక ఇక్కడ అస్తికలు నిమజ్జనం చెయ్యటం, కర్మకాండలు కూడా చేస్తుంటారు.రెండు నదుల సంగమంలో వున్న మహిమాన్వితమైన ఈ ఆలయ దర్శనానికి హైదరాబాదునుంచీ బస్సులున్నాయి. పిడుగురాళ్ళ వెళ్ళే బస్సులు వాడపల్లి మీదనుంచే వెళ్తాయి. రైలు మార్గం మిర్యాలగూడా వరకే. అక్కడనుంచీ బస్ లో వెళ్ళాలి.ఇక్కడ వసతికీ, భోజనానికి సౌకర్యాలు లేవు. ఒక పెద్ద హాల్ వుంది కాని దానిలో వేరే ఏర్పాట్లేమీ లేవు. వుండటం కొంచెం కష్టమే.
ఒడలు పులకరింపజేసే పుణ్యక్షేత్రం వాడపల్లి
నల్గొండ జిల్లా దామరచర్ల మండలంలోని కృష్ణాతీరంలో కొలువైన అతిసుందరమైన వాడపల్లి క్షేత్రం అది. అగస్థ్యేశ్వర మహాముని స్వయంగా ప్రతిష్టించిన శ్రీ మీనాక్షీ అగస్తేశ్యరస్వామి శివలింగం, శ్రీ లక్ష్మీనర్సింహ్మస్వామి విగ్రహం ఇక్కడి ప్రత్యేకతలు. ఒకప్పుడు రాచరిక పాలనలో ఒక వెలుగు వెలిగిన ఈ ప్రాంతం నేటికీ మహిమాన్వితంగా వెలుగొందుతోంది. కొలిచిన వారికి కొంగు బంగారమై మూల దేవతా మూర్తులతో ఈ పుణ్య క్షేత్రం మరో ‘దక్షిణకాశి’గా ప్రసిద్ధిగాంచింది. ‘కలియుగ భూకైలాస్’గానూ విరాజిల్లుతూ అశేష భక్తజనంతో నీరాజనాలు అందుకొంటోంది.
shiva
అగస్త్యుడు ప్రతిష్టించిన విగ్రహాలు
ఇక్కడి పౌరాణిక ప్రాశస్త్యం, చారివూతక ప్రాధాన్యాలను తెలుసుకున్న తర్వాత క్షేత్రం పట్ల సందర్శకుల్లో మరింత భక్తిభావం ఏర్పడుతుంది. వాడపల్లి పుణ్యక్షేత్రం చరివూతను శాసనాల ద్వారా గుర్తించారు. దీని ఆధారంగానే పెద్దలు స్థలపురాణాన్ని చెబుతారు. సుమారు 6000 సంవత్సరాల క్రితం నాటి కృతయుగంలో శ్రీ అగస్త్య మహామునికి దక్షిణ మండలంలో శివ-కేశవులను ప్రతిష్టించాలనే బృహత్ సంకల్పం కలిగింది. ఆయన దేవతామూర్తులను అన్నపూర్ణ కావడిలో తీసుకొని వెళుతుంటాడు. సరిగ్గా ఈ ప్రాంతానికి రాగానే సంధ్యా సమయం అవుతుంది. దాంతో పుణ్య స్నానం చేయాలనుకుంటాడు. పక్కనే పశువులు కాచే పిల్లవాన్ని పిలిచి ‘కృష్ణా మూసీ నదుల సంగమం వద్ద తాను స్నానం చేసి, సంధ్య వార్చుకొని వస్తానని, అంత వరకు కావడిని కింద పెట్టకుండా పట్టుకోవాలనీ’ కోరతాడు. కొద్ది సేపటి తరువాత ఆ పిల్లవాడు కావడి బరువు మోయలేక మునివర్యుణ్ని మూడుసార్లు పిలుస్తాడు. అయినా, మునీశ్వరుడు రాకపోవడంతో కావడిని కింద పెట్టి వెళ్లిపోతాడు. తర్వాత కాసేపటికి అగస్త్యుడు వచ్చి చూస్తాడు. కింద పెట్టిన కావడి కనిపిస్తుంది. ఖిన్నుడైపోతాడు. అయినా, ఒక ప్రయత్నం చేద్దామని ఆ మహాముని కావడిని ఎత్తుకొనేందుకు ప్రయత్నిస్తాడు. ఊహు... అది ఎంతకూ వీసమెత్తు కూడా లేవదు. ‘ఏమిటీ మాయ’ అనుకొని తన దివ్యదృష్టితో పరికిస్తాడు. అప్పుడు తెలుస్తుంది, ‘ఇది పవివూతమైన ప్రదేశం. శివ కేశవులు ఇక్కడే ఉండటానికి ఇష్టపడుతున్నారని’. కృష్ణా-మూసీ నదుల సంగమ తీరంలో వాటిని ప్రతిష్టించాలనీ ‘ఆకాశవాణి’ పలుకుతుంది. అగస్త్యుడు అలాగే శివకేశవులను ప్రతిష్టించాడన్నది స్థల పురాణం. నాటి నుండి ఆ శివకేశవులే శ్రీ మీనాక్షీ అగస్తేశ్వరస్వామి, శ్రీ లక్ష్మీనర్సింహ్మస్వామి వారలుగా ఇక్కడికి వచ్చే భక్తులకు దర్శనమిస్తూ, వారి కోరికలు తీరుస్తున్నారు. అలా ఇక్కడ రెండు ఆలయాలు వెలిశాయి.
gods
డ్డిరాజుల కాలంలోనే ఆలయాల నిర్మాణం
చరివూతకారుల అభివూపాయం ప్రకారం అగస్త్యుడు ప్రతిష్టించిన కొన్నేళ్లకు కాలక్షికమేణ శివ కేశవుల విగ్రహాలు మట్టిలో కూరుకొని పోయాయి. నాటి కాలంలో ఈ ప్రాంతాన్ని చోళులు, రెడ్డిరాజులు, శాతవాహనులు, కాకతీయులకు చెందిన అనేక మంది రాజులు పాలించారు. ఇక్కడ రెండు నదులు ఉండటం వల్ల రెండు రాజ్యాలకు ఇది సరిహద్దుగానూ ఉండేదంటారు. అంతేకాక, ఈ ప్రాంతం శత్రుదుర్భేద్యంగానూ ఉండేది. రెడ్డిరాజులకు చెందిన అనవేమాడ్డి, బీమాడ్డి రాజుల పాలనలో ఇక్కడ కట్టడాలు నిర్మిస్తుండగా మట్టిలో కూరుకొని పోయిన స్వామివార్ల మూలవిక్షిగహాలు బయటపడ్డాయి. దాంతో వారు కృష్ణానదీ తీరంలో శ్రీ మీనాక్షీ అగస్తేశ్వరస్వామి, మూసీనదికి అభిముఖంగా శ్రీ లక్ష్మీనర్సింహ్మస్వామి ఆలయాలను నిర్మించారని చరిత్ర చెబుతోంది. నాటి నుండి ఈ రెండు ఆలయాలు ‘నిత్యకల్యాణం పచ్చతోరణం’గా విలసిల్లుతున్నాయి. ఆలయాల పోషణకు రాజులు భూమిని కూడా కేటాయించినట్లు తెలుస్తోంది.

శివలింగంపై నిత్య గంగ
ఇక్కడి శ్రీ మీనాక్షీ అగస్తేశ్యర స్వామి ఆలయంలోని శివలింగం మహాద్భుతమైంది. శివలింగంపై పది వేళ్లు పట్టే రంధ్రాలున్నాయి. వాటిలోంచి నిత్యం ఎంత తోడితే అంత గంగ వస్తుంటుంది. శివలింగంపై గంగాజలాన్ని తీయక పోయినా, బయటకు ఉధ్భవించదు. ఇదే ఇక్కడి శివుని మహిమ. దీనిని దర్శించుకోవడానికి భక్తులకు రెండు కళ్లు చాలవు. ఈ వింత వెనుకా ఓ పురాణ కథ చెబుతారు. పూర్వం అడవిలో ఓ బోయవాడు ఒక పావురాన్ని వేటాడుతుండగా అది ఈ శివలింగం వెనుక ప్రాణభయంతో దాక్కుంటుంది. అతను దానిని పట్టుకొనే ప్రయత్నం చేస్తాడు. కానీ, వెంటనే పరమేశ్వరుడు ప్రత్యక్షమై ‘తనను శరుణు వేడిన పక్షిని వదిలి వేయాలని’ కోరతాడు. ప్రతిఫలంగా ఆ బోయవాడిని ‘కావల్సింది కోరుకో’మంటాడు. తనకు బాగా ఆకలిగా ఉన్నందున మాంసాహారం కావాలంటాడతను. శంకరుడు తన తల నుండి మాంసం తీసుకొమ్మని చెబుతాడు. బోయవాడు రెండు చేతులతో శివుని తలలోని మాంసాన్ని తీసుకున్నాడని అంటారు. ప్రసుత్తం శివలింగంపై పది వేళ్లు పట్టేలా రంధ్రాలతో ఉన్న బిలం ఇలా ఏర్పడిందేనని వారు చెబుతారు.
gudis
ఆదిశంకరుల ఆగమనం 
వాడపల్లి పుణ్యక్షేవూతానికి ఆదిశంకరాచార్యుల వారు స్వయంగా విచ్చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఆయన తన శిష్యగణంతో క్రీ.శ. 1524లో ఇక్కడి పవిత్ర కృష్ణా మూసీ నదుల్లో స్నానమాచరించినట్లు చరిత్ర చెబుతోంది. తర్వాత ఆయన అగస్తేశ్వర స్వామి వారి ఆలయంలోని శివలింగంపైన గల బిలాన్ని కూడా చూశాడు. దానికి కారణాన్ని, తత్ మహిమను తెలుసుకొంటాడు. అయినా, ఒకింత నమ్మకం కుదరక ఒక ఉద్ధరణికి దారం కట్టి బిలంలోకి వదిలాడు. అది అలా లోనికి వెళుతూనే ఉంది. ఎంత దూరం పోయినా అంతు తెలియక పోవడంతో ఉద్ధరిణిని పైకి లాగి చూస్తాడు. కానీ, దానికి చిత్రంగా రక్తపు మరకలు కనిపించాయిట. ‘దేవుని మహిమను పరీక్షించడం తగదని’ భావించిన శంకరాచార్యులు తాను చేసిన తప్పుకు ఆలయంలో రుద్రాభిషేకాలు నిర్వహించినట్లు చారివూతక ఆధారాలున్నాయి.

నర్సింహస్వామి జ్యోతుల మహిమ
ఇక, శ్రీ లక్ష్మీ నర్సింస్వామి ఆలయంలో స్వామి వారి మూల విగ్రహానికి ఎదురుగా రెండు జ్యోతులు ఉంటాయి. వాటి మహిమకు భక్తులు పరవశించిపోతారు. స్వామివారి ఎదుట గల ఆ రెండు జ్యోతులు నిత్యం వెలుగుతూనే ఉంటాయి. అందులో స్వామివారి ముఖభాగం ఎదురుగా ఉన్న జ్యోతి కదులుతూ వుంటే, కింద వున్న దీపం కదలకుండా నిశ్చలంగా ఉంటుంది. దీనిని స్వామి వారి ఉచ్ఛాస, నిశ్వాసలకు ప్రతీకగా స్థానికులు చెప్తారు. దీనిని నర్సింహస్వామి మహిమగానే భక్తులు నమ్ముతున్నారు. కృష్ణానది తీరాలలోని పంచనారసింహ క్షేత్రాలైన మట్టపల్లి, కేతవరం, వేదాద్రి, మంగళగిరిలతో పాటుగా వాడపల్లి ఆలయం కూడా ఒకటిగా ఉంది. ఈ ఆలయంలోని స్వామివారి చుట్టూ 11 ప్రదక్షణలు చేస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయనీ భక్తుల ప్రగాఢ నమ్మకం. అయితే, ఈ శ్రీ లక్ష్మీనర్సింహ స్వామి ఆలయం క్షేత్రాధిపతిగా శ్రీఆంజనేయ స్వామి ఉండడం విశేషం.
gudi
కోర్కెలు తీర్చే దేవతా వృక్షం
శ్రీ లక్ష్మీనర్సింస్వామి ఆలయ ప్రాంగణంలోనే ఉన్న దేవతా వృక్షం భక్తులు కోరిందే తడవుగా వారి కోర్కెలు తీరుస్తుందని ప్రజలు బలంగా నమ్ముతున్నారు. దీంతో సంతాన లేమితో బాధపడే వారు, వివాహం కాని వారు, ఇతర సమస్యలతో సతమతమవుతున్న వారు ఈ దేవతా వృక్షాన్ని దర్శించుకొని, ఆ మేరకు ప్రదక్షణలు చేస్తారు. అనంతరం కోర్కెల లేఖను వృక్షానికి కడితే స్వల్ప వ్యవధిలోనే సమస్యలు తీరతాయని స్థానికులు చెబుతున్నారు.కాగా, వాడపల్లి పుణ్యక్షేవూతంలో రెడ్డిరాజులు కోటను నిర్మించి పాలన సాగించారు. శత్రువుల దాడిని తిప్పి కొట్టేందుకు కృష్ణా- మూసీ నదులను కలుపుతూ 3 కిలోమీటర్ల మేర పటిష్టమైన కోటగోడ కట్టారు. రాజు కోట పక్కన శ్రీరామాలయం, సభా ప్రాంగణం, రాణి ప్రత్యేక విహార గదులు తదితరాలన్నీ ఇప్పుడు శిథిలావస్థకు చేరాయి. ఇవి ఆనాటి రాచరికపు వైభవానికి ఆనవాళ్లుగానే మిగిలాయి. ఈ పుణ్యక్షేవూతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తే చరివూతను చాటి చెప్పే మరిన్ని ఆనవాళ్లను కాపాడుకునే వీలుంటుందని స్థానికులు అంటున్నారు.

వైభవంగా ప్రత్యేక పూజలు
ఈ పుణ్యక్షేవూతంలో ముఖ్యంగా పర్వదినాలో ప్రత్యేక పూజలు వైభవంగా జరుగుతాయి. భక్తులు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వచ్చి, ఉత్సవాల్లో పాల్గొని, తమ భక్తి తత్పరతను చాటుకుంటారు. ప్రతి ఏడాది శివరాత్రి సందర్భంగా పెద్ద ఎత్తున తిరునాళ్లను జరుపుతారు. శివరాత్రి ముందు రోజు శ్రీ లక్ష్మీనర్సింస్వామి, శివరాత్రి పర్వదినాన శ్రీ మీనాక్షీ అగస్తేశ్వర స్వామి వార్ల కల్యాణ మహోత్సవాలు నిర్వహిస్తారు. శివరాత్రి సందర్భంగా చక్రతీర్థం, నంది, పర్వత, హనుమత్ వాహన సేవల ఊరేగింపు అత్యంత వైభవోపేతంగా జరుపుతారు. కార్తీక పౌర్ణమి, తొలి ఏకాదశి, నృసింహ జయంతి రోజుల్లో అయితే భక్తులు వేలాదిగా తరలి వస్తారు. పలు సాంస్కృతిక కార్యక్షికమాలు, కోలాటాలు, హరికథలు నిర్వహిస్తారు. దీంతోపాటుగా ప్రతి పన్నేండ్ల కోమారు కృష్ణా పుష్కరాలు ఇక్కడ కూడా ఘనంగా నిర్వహిస్తారు. 2004లో ఇక్కడ జరిగిన పుష్కర ముగింపు వేడుకలలో అప్పటి ముఖ్యమంత్రి దివంగత వైయస్ రాజశేఖరడ్డి పాల్గొన్నారు. నాడు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అశేషంగా భక్తజనం తరలి వచ్చారు. జిల్లాలోని మిగిలిన అన్ని పుణ్యక్షేవూతాల కంటే అత్యధికంగా సుమారు 11 లక్షలమంది భక్తులు వాడపల్లి పుష్కరాలకు ఆనాడు హాజరైనట్లు చెబుతున్నారు.