ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

HAIR CARE TIPS IN TELUGU WITH EGGS KIRA DOSAKAYA OILIVE OIL ETC


జుట్టు పొడిబారడం, తెల్లబడటం, రాలిపోవడం తగ్గి, ఒత్తుగా ఉండటానికి చిట్కాలు.

ఒక కోడిగుడ్డు, కీరదోస కాయ, రెండు టీస్పూన్ల ఆలివ్ ఆలివ్ ఆయిల్ తీసుకుని మిక్సీలో వేసి బాగా మెత్తగా పేస్టులా చేసుకోవాలి. ఈ పేస్టును తలకు పట్టించి పదిహేను నిమిషాల తరువాత తలస్నానం చేయాలి. నెలకొక సారి ఇలా చేస్తూ ఉంటే జుట్టు ఆరోగ్యంగా, ధృడంగా ఉండటమే కాక ఒత్తుగా కూడా పెరుగుతుంది.

జుట్టు బాగా పొడిబారినట్లు అనిపిస్తే కొబ్బరి నూనెలో తేనె కలిపి రాసుకొని, కాసేపయ్యాక తలస్నానం చేయాలి.

జుట్టు రాలిపోతుంటే ఒక అర కప్పు పెరుగు తీసుకుని దానిలో కొంచెం మెంతి పొడి, టీ పొడి, రెండు టీ స్పూన్ల నిమ్మరసం వేసి బాగా కలిపి రాత్రంతా నానబెట్టి, ఉదయం తలకు పట్టించాలి. ఇలా వారానికోసారి చేయడం వలన జుట్టు రాలడం ఆగి పోవడమే కాదు, మెరుస్తూ ఉంటుంది.
జుట్టు ఆరోగ్యంగా, నల్లగా నిగనిగలాడాలంటే ఒక కప్పు చిక్కటి పెరుగులో, ఒక కప్పు గోరింటాకు పొడి, ఒక టీ స్పూన్ నిమ్మరసం కలిపి బాగా చిలికి జుట్టు కుదుళ్ళకు పట్టేలా పట్టించి ఒక అరగంట తరువాత తల స్నానం చేయాలి.

జుట్టు చివర్లు బాగా చిట్లినట్టు అనిపిస్తే చెంచా తేనె, చెంచా ఆముదం కలిపి జుట్టు చివర్లకు రాసి అరగంట తరువాత స్నానం చేయాలి.

ఒక టీ స్పూన్ తేనె, ఒక టీ స్పూన్ బాదం నూనె, గుడ్డులోని పచ్చ సొన కలిపి జుట్టు కుదుళ్ళకు బాగా పట్టించి అరగంటయ్యాక గోరు వెచ్చని నీటితో స్నానం చేస్తే జుట్టు కుదుళ్ల నుంచి చివర వరకు బలంగా పెరుగుతుంది.