ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

KNOW ABOUT THE LOST CITY OF INDIA - DWARAKA - BUILT BY LORD SRI KRISHNA IN TELUGU


మహాభారతం కేవలం కట్టుకధ కాదు అని చెప్పటానికి పురావస్తు ఆధారాలు, శాసనాలు దొరికాయి. వాటిలో ప్రధానమైనది ద్వారక. శ్రీ కృష్ణపరమాత్ముడి అద్భుత నగరం, 5000 ఏళ్ళ క్రితం భారత్‌లో ఉన్న నైపుణ్యానికి, సాంకేతికపరిజ్ఞానానికి నిలువుటద్దం.

1980వ దశకంలో గుజరాత్‌ సముద్ర తీరంలో జరిగిన పరిశోధనలు భారతీయ చారిత్రక నిర్మాణంలో అపూర్వ ఘట్టాన్ని ఆవిష్కరించాయి, కుట్రపూరిత బ్రిటీష్ చరిత్రకు సవాల్ విసిరాయి. శ్రీ కృష్ణుడి ఉనికి అబద్దమంటూ వస్తున్న ప్రచారాలకు గట్టి సమాధానం ఇచ్చాయి. భారత పురావస్తు పరిశోధనా సంస్థ, జాతీయ సముద్రగర్భ శాస్త్ర సంస్థల సంయుక్త పరిశోధన జరపాలని జడ్.డి.అన్సారీ, ఎమ్.ఎస్.మతే ప్రతిపాదించారు. దీని ద్వారా డాక్టర్ ఎస్.ఆర్.రావు ఆధ్వర్యంలో చెప్పుకోదగిన కృషిజరిగింది. ఆ పరిశోధనల్లో భాగాంగా గుజరాత్ పశ్చిమాన గోమతి నది అరేబియా సముద్రంలో కలిసే ప్రాంతంలో సాగర గర్భంలో ఒక మహానగరం బయటపడింది.. మహాభారత కాలాన్ని, శ్రీకృష్ణుడి ఉనికిని ఈ నగరం బయటి ప్రపంచానికి చాటి చెప్పింది.. ఇదే ఇవాళ మనం చెప్పుకుంటున్న ద్వారక.. .కృష్ణుడి ద్వారక.. విశ్వకర్మ నిర్మించిన ద్వారక..

192 కిలోమీటర్ల పొడవు …
192 కిలోమీటర్ల వెడల్పు..
36864 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం..
బారులు తీరిన వీధులు..
వీధుల వెంట బారులు తీరిన చెట్లు..
రాయల్‌ ప్యాలెస్‌లు..
రెసిడెన్షియల్‌ కాంప్లెక్స్‌లు..
కమర్షియల్‌ మాల్స్‌..
కమ్యూనిటీ హాల్స్‌..
వాటర్ ఫౌంటేయిన్లు ....
క్రీస్తుపూర్వం మూడు వేల సంవత్సరాల నాడే
అపూర్వ మహానగరం..
రత్నస్తంభాలు..
వజ్ర తోరణాలు..
సాటిలేని వాస్తు/శిల్ప కళా నైపుణ్యం..
సముద్రం మధ్యలో మహా నిర్మాణం..
జగన్నాథుడి జగదేక సృష్టి..
క్రీస్తుపూర్వం 3000 సంవత్సరాల నాటి
లెజెండ్‌ సిటీ…
ద్వారక..
ఇప్పుడు సాగర గర్భంలో..
మన నాగరికత..
మన సంస్కృతి..
మన హిందూ ప్రతిభకు పట్టం కట్టిన నాటి కాస్మోపాలిటన్‌ సిటీ..
ద్వారక

1983 నుంచి 1992 వరకు 12 సార్లు సాగరాన్ని మధించారు. ఫలితంగా నాటి ద్వారకకు చెందిన వస్తువులు సేకరించి ఫిజికల్ రిసెర్చి లేబొరేటరీకి పంపారు. అక్కడ థెర్మోలూమినెసెన్స్, కార్బన్ డేటింగ్ వంటి అత్యాధునికపరీక్షలు జరిగాయి. అవన్నీ ద్వారాకలో దొరికిన వస్తువులు ఖగోళశాస్త్రవేత్తలు లెక్కకట్టిన మహాభారత సమయానికి సరిగ్గా సరిపోతున్నాయి. ఏవో రెండు, మూడు వస్తువులు దొరికితే ఫర్వాలేదు, ఏకంగా ఒక మహానగరమే సాగర గర్భంలో దొరికింది.


#ద్వారక గురించి ఆంధ్రప్రభ పత్రికలో ప్రచురితమైన కధనం చూడండి - ద్వారక వెలికితీతలో భాగంగా పరిశోధకులు 100 నుంచి 140 కిలోల బరువైన బండరాళ్లు చాలా గుర్తించారు. ఇవి ప్రముఖ వ్యక్తుల ఇంటి గోడలకు ఉపయోగించిన బండరాళ్లుగా గుర్తించారు. పడవలకు పెద్దపెద్ద నౌకలకు ఉపయోగించిన కలప శిధిలాలు కూడా లభించాయి. ద్వారకనే పూర్వకాలంలో మంచి నౌకా తీరంగా సైతం వుండేదని శాస్త్రజ్ఞులు అంటున్నారు. ఇవే గాక వేలకొద్ది రాతి ఇటుకలు లభించాయి.

ఆ కాలంలో శత్రువులు దాడి చేసినపుడు తమను తాము రక్షించు కోవడానికి రాతి ఇటుకలను వాడేవారని డాక్టర్‌ ఎస్సార్‌రావు అంటున్నారు. ఈ నగరం గోమతి నది దాకా విస్తరించి ఉన్న పెద్ద నగరంగా ఉండేది. నీటిలో సైతం పూర్తిగా శిధిలం కాని కొన్ని రాతి గోడలు కలిగిన నిర్మాణాలు ఇళ్లూ బయటపడ్డాయి. ఇవేకాక వెండి కంచు ఇత్తడి పాత్రలు సైతం లభించాయి. సముద్ర జిల్లాల్లో ఇంకా క్రిందికి అంటే ఐదు మీటర్ల క్రింద జరిపిన తవ్వకాల్లో ఒక గొప్ప నిర్మాణాన్ని కనుగొన్నారు. దాదాపు అర ఎకరం స్థలంలో ఈ నిర్మాణం వుంది. లోపల ఎన్నో గదులు ఉన్నట్లు గుర్తుగా గోడలు కనుపించాయి. అందులో కంచు గంటలు విల్లుకు మధ్యన ఉపయోగించే వెండి పట్టాలు కనిపించాయి.

ద్వారరకు నాలుగు కిలోమీటర్ల పొడవైన నౌకాశ్రమం ఉండేది. నౌకాశ్రయం ఉన్న ట్లుగా భావిస్తున్న ప్రాంతంలో నలు వైపుల చిన్న చిన్న గృహ నిర్మాణాలు ఉన్నట్లు కనుగొన్నారు. నౌకలకు సంధించిన శ్రామికులు ఈ ఇళ్లలో నివసించేవారని ఊహిస్తు న్నారు. ఇంకా ఈ ద్వారక నగరం గురించిన పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. విలువైన ఆశ్చర్యం గొలిపే వస్తువులు లభించినా భద్రతా కారణాల వల్ల వాటి వివరాలు గోప్యంగా వుంచుతున్నారు. పదిమందిదాకా యువకులను ఎంపిక చేసి పురావస్తు పరిశోధనలో తర్ఫీదు ఇచ్చి సముద్రంలో రెండు గంటల పాటు నిరవధికంగా ఉండగలిగేటట్టుగా వీళ్లకి శిక్షణ ఇచ్చారు. సముద్ర జలాల్లో అవసరమైన ప్రాణవాయువును కొన్ని ప్రత్యేకమైన సిలిండర్లలొ నింపి వీరు తమతోపాటు తీసుకెళ్లే ఏర్పాటు చేస్తున్నారు. ద్వారక నగరంలోని#శ్రీకృష్ణుడు నివసించిన భవనాల కోసం అన్వేషణ ప్రారంభమైంది. ఒకానొక ప్రదేశంలో ఆధునిక మైన నిర్మాణాలతో ఒక కట్టడాన్ని కనుగొన్నారు. ఈ కట్టడం లోని శిధిలమైన రాతిగోడల మధ్య కిటికీలు ద్వార బంధాలు గడపలు కనుగొన్నారు. ఇందులోని కొన్ని శిధిల భాగాలను పైకి తెచ్చి వీటిపై కార్బన్‌ పరీక్షలు చేయడం ప్రారంభమైంది. దీనినే కార్బన్‌ డేటింగ్‌ టెక్నిక్‌ అంటారు. కిటికీలు చాలా పెద్ద విగా సముద్రపు గాలులు వీచేలాగా నిర్మాణాలు ఉన్నాయనీ ఇళ్లలోనే స్నానపు గదులను సైతం కనుగొన్నారని తెలియవస్తోంది. ఈ నగరం సౌరాష్ట్రకు ముఖ్య పట్టణంగా వుండేదనీ, మన పురాణాల్లో ప్రస్తావించబడిన శ్రీకృష్ణుడు ఈ ద్వారక వీధుల్లో సంచారించాడని పురావస్తు పరిశోధకులు భావిస్తున్నారు. శ్రీకృష్ణుడు ప్రతి శుక్రవారం పూజించే నారాయణదేవాలయాన్ని సైతం పరిశోధకులు కనుగొన్నారు. ఈ మూర్తిని మహాభారత కాలంలో సముద్ర నారాయణుడని అనేవారు.

శ్రీకృష్ణుడు ద్వారక నగరనిర్మాణం తర్వాత ఈ నగరంలో 36 సంవత్సరాలు నిర్మించాడు. మహాభారతయుద్ధ కాలంలో శ్రీకృష్ణు డూ అతని అంత:పురంలో రుక్మిణీ సత్యభామలతో సహా ఈ నగరం లోనే నివసించాడు. మా పరిశోధనలు సఫలమైతే శ్రీకృష్ణుడు తిరుగా డిన ద్వారకను ఆయన నివసించిన గృహాన్ని కనుగొనగలం అనే ఆశాభావాన్ని ఎస్సార్‌ రావు వ్యక్తం చేస్తున్నారు.

సముద్రగర్భంలో కనుగొన్న మహానగరం శ్రీకృష్ణపరమాత్ముడి ద్వారకానగరమే అని చెప్పటానికి కొన్ని నాణెలు కూడా లభించాయి. వాటిని కూడ పురావస్తు పరిశోధకులు పరిశీలించారు. జరాసంధుడి బారి నుంచి యాదవులను రక్షించటానికి సముద్రం మధ్యలో ద్వారక నిర్మించిన కృష్ణుడు, ద్వారకలో నివసించేవారికి గుర్తింపుచిహ్నలను ఇచ్చారు. ఈ రోజు ప్రజలకు Identity cards ఇస్తున్నట్టుగా. వాటి మీద 3 తలలు ఉన్న ఒక జంతువులు ఉండేదని మహాభారతం, హరివంశం మొదలైన అనేక గ్రంధాలు చెప్తున్నాయి. అచ్చం ఆ నాణెలను పోలిన వస్తువులే సాగరంగ్రభంలో దొరికాయి. వాటిని కార్బన్ డేటింగ్ చేసినప్పుడు మహాభారతానికి జ్యోతిష్యశాస్త్రం లెక్కకట్టిన తేదీలతో వాటి కాలం సరిపోతోంది.

సాగర గర్భంలో బయటపడిన #ద్వారక నగరం ఆషామాషీ నగరం కానే కాదు.. ఇవాళ మనకు తెలిసిన గొప్ప గొప్ప నగరాలకంటే వెయ్యి రెట్లు అడ్వాన్స్‌డ్‌ మెట్రోపాలిటన్‌ సిటీ అని చెప్పవచ్చు. శ్రీకృష్ణుడు పక్కా ప్రణాలికతో ద్వారక నిర్మాణానికి పూనుకున్నాడు.. విశ్వకర్మతో ఈ నగరాన్ని నిర్మించాడు.. గోమతి నది, సముద్రంలో కలిసే చోటును నగర నిర్మాణానికి ఎంచుకున్నాడు. అక్కడ సుమారు 36 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నగర నిర్మాణం జరిగింది.

ఈ నిర్మాణం కూడా సామాన్యమైన రీతిలో లేదు. ద్వారకలో తొమ్మిది లక్షలు.. అవును.. అక్షరాలా తొమ్మిది లక్షల రాజభవనాలు ఉండేవి..ఈ భవనాలన్నీ కూడా క్రిస్టల్స్‌, ఎమరాల్డ్‌, డైమండ్స్‌ వంటి అపురూప రత్నాలతో నిర్మించారు..ఒక్క మాటలో చెప్పాలంటే సిటీ ఆఫ్‌ గోల్డ్‌గా ద్వారకను చెప్పుకోవాలి.

పొడవైన అతి పెద్ద పెద్ద వీధులు.. వీధుల వెంట బారులు తీరిన చెట్లు.. మధ్యమధ్యలో ఉద్యానవనాలు.. వాటి మధ్యలో రాజభవనాలు.. ఏ వర్గానికి ఆ వర్గం ప్రత్యేకమైన నివాస గృహాలు.. వ్యవసాయ క్షేత్రాలు.. ఒక క్రమ పద్ధతి ప్రకారం ఒక నగరంలో ప్రజలందరికీ ఎలాంటి సౌకర్యాలు ఉండాలో.. అలాంటి సౌకర్యాలన్నింటితో నిర్మించిన ఏకైక నగరం ద్వారక..

#నగర నిర్మాణం ఇళ్లు, వీధుల నిర్మాణంతోనే అయిపోయిందనుకుంటే పొరపాటే.. హైదరాబాద్‌ మహానగరంలో ఎక్కడ కమర్షియల్‌ జోన్లు ఉండాలో, ఎక్కడ రెసిడెన్షియల్‌ జోన్లు ఉండాలో ఇప్పుడు మాస్టర్‌ ప్లాన్లు వేస్తున్నారు.. ఇప్పటికే కట్టిన నిర్మాణాలను ఎలా తొలగించాలో తెలియక సిగపట్లు పడుతున్నారు.. కానీ, ద్వారకలో ఆనాడే ఇవన్నీ ఉన్నాయి.. కమర్షియల్‌ జోన్లు, ప్లాజాలు, అవసరమైన ప్రతిచోటా ప్రజా సదుపాయాలు (public utilities), భారీ షాపింగ్‌ మాల్స్‌ అన్నీ ఉన్నాయి.. నగర నిర్మాణానికి ముందే మాస్టర్ ప్లాన్‌తో అత్యాధునికంగా, సంకేతికంగా, పర్యావరణహితంగా నిర్మించబడిన ఏకైక మహానగరం ద్వారక. వేల ఏళ్ళ భారతీయ చరిత్రకు సజీవసాక్ష్యం. హిందువులకు గర్వకారణం.