ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

PROBLEMS SOLVED WEARING LORD HANUMAN SINDHOOR DAILY - HINDU TRADITIONS AND BELIEFS IN TELUGU




సింధూర ధారణతో దాంపత్య సమస్యలు తొలగిపోతాయట!

సింధూరాన్ని హనుమంతునికి పూస్తారు. ఆ సింధూరాన్ని ప్రతిరోజూ నుదుటన ధరించే వారికి అన్ని రకాల దాంపత్య సమస్యలు తొలగిపోకాయని పురోహితులు చెబుతున్నారు. ఎవరింట్లో నిత్యం కలహాలు జరుగుతుంటాయో అటువంటి వారు రోజూ సింధూర ధారణ చేయాలి. అలాగే ప్రతి విషయానికి భయంతో వణికిపోతుండే వారికి సింధూరం పెడితే భయం తొలగిపోతుంది.

భార్య భర్తలు, పిల్లల మధ్య సఖ్యత లేని వారు సింధూరాన్నిపెట్టుకుంటే సుఖం, సంతోషం, ప్రశాంతత లభిస్తుంది. చిన్నపిల్లలకు బాలగ్రహ దోషాలు ఉంటే ఆ పిల్లలకు సింధూరాన్ని పెడితే భయం, రోగ బాధలు దరిచేరవు. ఇంకా ఆరోగ్యవంతులుగా ఉంటారు.

విద్యార్థులు ఆంజనేయస్వామి గుడికి వెళ్లి అంగారాన్ని పెట్టుకుంటే పరీక్ష సమయంలో చదివిన విషయాలన్నింటినీ మరిచిపోకుండా ఉంటారు. లో బీపీ, రక్త హీనతతో బాధపడేవారు ఆంజనేయస్వామి తీర్థాన్ని సేవించి సింధూరాన్ని నుదుటికి పెట్టుకుంటే ఆరోగ్య భాగ్యం సిద్ధిస్తుంది. గ్రహ బాధలు ఉన్నవారు ప్రతిరోజూ సింధూరాన్ని పెట్టుకుంటే గ్రహాల బాధ తొలగిపోతుంది.

ఇంట్లో ఆంజనేయ స్వామికి గంధాన్ని పూయదలచినవారు దేవుని చిత్రాన్ని దక్షిణం వైపు ఉంచి కొద్దిగా గంధాన్ని స్వామి కిరీటానికి పెట్టాలి. తర్వాత స్వామి వారి ప్రతిమ గంధం పూసుకుంటూ వచ్చి చివరిగా గంధాన్ని పాదం వద్ద పెట్టి పూజిస్తే తలచిన కార్యాలు నెరవేరుతాయి. ఆంజనేయ స్వామికి సింధూరాన్ని పెట్టి తర్వాత దానిని పాలల్లో లేదా నీటిలో కలిపి తాగుతూ ఉంటే దేహం వజ్రకాయమవుతుందని పండితులు చెబుతున్నారు.