ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

RAGI MALT HEALTH TIPS IN TELUGU


రాగులు బలవర్దకమయిన ధాన్యం. 

ఒకప్పుడు దీన్ని పొద్దున్నే జావగా చేసి పాలల్లో, మజ్జిగలో కలుపుకుని తాగేవారు. దీనిలోని కాల్షియం పిల్లల సక్రమ ఎదుగుదలకు తోడ్పడుతుంది. పిల్లలకే కాదు, పెద్దలు, వృద్దులు, మహిళలకు అమితపుష్టిని కలిగిస్తుంది. అందుకే రాగుల వల్ల మన శరీరానికి కలిగే ఉపయోగాలు ఏమిటో తెలుసుకుందాం...

రాగుల వల్ల జుట్టు ఒత్తుగానూ, పొడుగ్గానూ పెరుగుతుంది.

మధుమేహ వ్యాధికి రాగులతో చేసిన ఆహార పదార్థాలు, రాగుల గంజి, పాలల్లో కలిపిన రాగుల పానీయం చక్కని ఔషధంగా పనిచేస్తుంది.

రాగులు ఇతర ధాన్యాలకంటే బలవర్ధకమైనవి. శారీరక కష్టం అధికంగా చేసేవారు రాగుల పిండితో తయారు చేసిన పదార్థాలను తరచూ తిన్నట్లైతే వారికి నూతన శక్తి లభిస్తుంది.

రాగులలో అయోడిన్‌ పుష్కలంగా లభిస్తుంది. ఎదిగే పిల్లలకు ్ల వేయించి పొడిచేసిన రాగి పిండిని పాలలో కలిపి తాగించినట్లయితే వారి ఎదుగుదల ఆరోగ్యం ఉండి శక్తి లభిస్తుంది.

కడుపులో మంటను తగ్గించి, చలువ చేస్తుంది. పైత్యాన్ని తగ్గిస్తుంది. రాగుల పానీయం దప్పికను అరికడుతుంది.
వృద్దాప్యంలో వున్న వారు రాగులతో తయారు చేసిన ఆహార పదార్థాలను భుజించడం వల్ల శరీరానికి బలం, శక్తి చేకూరుతుంది.మహిళలు ఎముకల పటుత్వానికి రాగులతో తయారు చేసిన రాగి మాల్ట్‌ను తాగడం మంచిది. రాగి మాల్ట్‌ ఎముకల పటుత్వానికి ధాతువుల నిర్మాణానికి తోడ్పడుతుంది. మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడకుండా చేస్తుంది.సుగంధిపాలు కలిపిన రాగి మాల్టును తీసుకుంటే రక్తపోటు అరికట్టబడుతుంది