ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

ARTICLE IN TELUGU ABOUT THE FAMOUS ANANTHADRI TEMPLE AT WARANGAL DISTRICT - INDIA


దొంగలను బండరాళ్లుగా మార్చిన క్షేత్రం

దేవుడి సొమ్మును ఆశగా చూడకూడదు ... ఆ సొమ్మును తాకకూడదు ... కలలో కూడా ఆ సొమ్మును కోరుకోకూడదని ధర్మశాస్త్రం చెబుతోంది. నిజానికి దేవుడికి ధనంతో పనిలేదు ... ఆ ధనంతో ఆయన తీర్చుకోవలసిన అవసరాలు లేవు. భక్తులు కానుకల రూపంలో ఆయనకి చెల్లించి ధనం, ఆలయ నిర్వహణకు ... ధర్మసంబంధమైన కార్యక్రమాలకు వినియోగిస్తూ వుంటారు.

అలాంటి ధనాన్ని కొందరు తమ స్వార్థం కోసం కాజేయడానికి ప్రయత్నం చేస్తే తగిన ఫలితాన్ని అనుభవించవలసి వుంటుంది. ఇందుకు అనేక ప్రాంతాల్లో జరిగిన అనేక సంఘటనలు మనకి ఉదాహరణలుగా కనిపిస్తూ వుంటాయి. ఆశ్చర్యచకితులను చేసే అలాంటి ఓ సంఘటనకు వరంగల్ జిల్లాలోని 'అనంతాద్రి' క్షేత్రం వేదికగా నిలుస్తోంది.

ఇక్కడి కొండగుహలో సుభద్ర - బలరాముడు - జగన్నాథుడు ఆవిర్భవించారు. ఇదే సన్నిధిలో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆవిర్భవించాడు. ఇక ఈ క్షేత్రానికి పాలకుడైన హనుమంతుడు కూడా స్వయంభువు కావడం ఇక్కడి విశేషం. ఇంతటి మహిమాన్వితమైన క్షేత్రం కనుకనే కొండ పాదభాగం నుంచి గుహాలయం వరకూ బహుళ అంతస్తులతో ఆలయాన్ని నిర్మించారు. ఆలయ నిర్మాణ శైలి ... ప్రాంగణంలో ఏర్పాటు చేయబడిన హనుమంతుడు - గరుత్మంతుడు విగ్రహాలు ఎంతగానో ఆకట్టుకుంటాయి.

పూర్వకాలంలోనే ఈ చుట్టుపక్కల గ్రామస్తులందరూ ఇక్కడి స్వామిని దర్శించుకుని కానుకలు ... మొక్కుబడులు చెల్లించేవారు. అలా చెల్లించిన సొమ్ము గుహలోని ఓ పెట్టెలో భద్రపరచబడేది. ఆ సొమ్ముపై కన్నేసిన కొందరు దొంగలు, ఓ రాత్రివేళ వాటిని కాజేశారు. దాంతో ఓ దివ్యమైన తేజస్సు వారిని వెంటాడటం ... దొంగలు పారిపోతూనే ఎక్కడివాళ్లు అక్కడ బండరాళ్లుగా మారిపోవడం జరిగిపోయాయి.

ఈ దృశ్యం చూసిన కొందరు మిగతా గ్రామస్తులకు చెప్పారు. ఆ బండరాళ్ల పక్కనే స్వామివారికి సంబంధించిన ఆభరణాలు కనిపించడంతో, జరిగిన సంఘటనని అందరూ విశ్వసించారు. ఆ రోజు నుంచి స్వామివారి సొమ్ముకు మరింత భద్రత కల్పించారు. ప్రశాంతమైన వాతావరణంలో పవిత్రత ఉట్టిపడుతూ కనిపించే ఈ ఆలయాన్ని దర్శించడం వలన శుభాలు చేకూరతాయని భక్తులు చెబుతుంటారు. మహిమాన్వితుడైన స్వామికి మనసారా పూజాదికాలు నిర్వహిస్తుంటారు.