ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

Bittergourd Health tips in Telugu


కాకర ఆకుకూరల్లో దివ్యౌషధం. 

ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కాకరలో ఎన్నో రోగాలను నయం చేసే ఆయుర్వేద గుణాలున్నాయి. కాకర జ్యూస్‌ను రోజూ ఒక గ్లాస్ తీసుకుంటూ వస్తే రక్తపోటు, హైబీపీ, అలర్జీలను దూరం చేసుకోవచ్చు. అలాగే రెండు స్పూన్ల కాకర రసంతో కాసింత నిమ్మరసం చేర్చి మూడు నుంచి ఆరు నెలల పాటు తీసుకుంటే రక్త సంబంధిత రోగాలకు చెక్ పెట్టవచ్చు.

ఇంకా కాకర ప్రారంభ దశలో ఉన్న కలరాను దూరం చేస్తుంది.ఇంకా కలరాతో ఏర్పడే వాంతులకు కూడా కాకర కళ్లెం వేస్తుంది. అలాగే కాకర డయాబెటిస్‌కు చెక్ పెడుతుంది. పండిన కాకర రక్తం, మూత్రంలో కలిసిన చక్కెర శాతాన్ని తగ్గిస్తుంది. ఎందుకంటే కాకర చెట్లలో ఇన్సులిన్ దాగివుండటంతో మధుమేహానికి చెక్ పెడుతుందిఇకపోతే కంటి సమస్యలనుకూడా కాకర నయం చేస్తుంది.

కాకర జ్యూస్‌ను క్రమం తప్పకుండా తీసుకుంటూ వస్తే కంటి సమస్యలు, దృష్టిలోపాలను దూరం చేసుకోవచ్చు. కాకర పండును తీసుకుంటే కంటి చూపు మెరుగుపడుతుంది. ఇంకా కాలేయ వ్యాధికి కూడా కాకర చెక్ పెడుతుంది.ఇంకా అలెర్జీ, చర్మ వ్యాధులు, సోరియాసిస్ వంటి వ్యాధుల్ని కూడా కాకర నయం చేస్తుంది. అలాగే శ్వాస సంబంధిత సమస్యలకు సైతం కాకర దివ్యౌషధంగా పనిచేస్తుంది.