ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

HOW TO OVERCOME GENERAL SICKNESS TO ALL AGES - HEALTH TIPS IN TELUGU TO FIGHT AGAINST GENERAL SICKNESS


మీరు బాగా అలసిపోతున్నారా..? 
కొందరికి కొద్దిగా పని చేస్తే చాలు అలసట వచ్చేస్తుంది. చాలాసార్లు ఈ అలసట పనిఒత్తిడి, డిప్రెషన్‌ వంటి కారణాల వల్ల అనుకుంటారు. రక్తహీనత వల్ల కూడా అలసట వస్తుందనే విషయాన్ని పట్టించుకోరు. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మన దేశంలో ప్రతి ఐదుగురు మహిళలల్లోను ముగ్గురికి రక్తహీనత సమస్య ఉందని నిపుణుల అంచనా. గర్భిణిలలోను, పాలు ఇచ్చే తల్లుల్లోను, అప్పుడే రసజ్వల అయిన అమ్మాయిల్లోను రక్తహీనత సమస్య కనిపిస్తూ ఉంటుంది.

ఎలా కనుగొనాలి?

రక్తహీనత లక్షణాలను ఎలా అంచనా వేయాలనే విషయాన్ని తెలుసుకొనే ముందు- అసలు ఈ సమస్య మూలాలను తెలుసుకోవాలి. మన శరీరంలో కణాలు సక్రమంగా పనిచేయాలంటే వాటికి ఆక్సిజన్‌ అవసరం. ఎర్ర రక్తకణాలలో ఈ ఆక్సిజన్‌ను హిమోగ్లోబిన్‌ అనే ప్రొటీన్‌ తీసుకువెళ్తూ ఉంటుంది. దీనిలోనే ఐరన్‌ కూడా ఉంటుంది. ఈ హిమోగ్లోబిన్‌ శాతాన్ని జీఎంజ డీఎల్‌గా కొలుస్తారు. ఈ శాతం 13 కన్నా తక్కువ ఉంటే మన శరీరానికి తగినంత ఐరన్‌, ఆక్సిజన్‌లు అందవు. కొన్ని సందర్భాలలో ఆక్సిజన్‌ తక్కువ ఉండటం వల్ల- గుండెపై చాలా ఒత్తిడి పడుతుంది. అలాంటి సమయాల్లో గుండె నొప్పి కూడా వస్తుంది. హిమోగ్లోబిన్‌ శాతం 7జీఎం డీఎల్‌ కన్నా తక్కువ అయినప్పుడు- త్వరగా అలిసిపోవటం, తలనొప్పి, కళ్లు తిరగటం, ఏకాగ్రత లేకపోవటం మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. అలాంటి సమయాల్లో వెంటనే విటమిన్‌ బీ12, ఐరన్‌లను వృద్ధి చేసే మందులను తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే రక ్తమార్పిడి చేయాల్సిన అవసరం కూడా రావచ్చు. ఇక గర్భవతుల్లో- రక్తహీనత రకరకాల సమస్యలకు కారణమవుతుంది. ఇటీవల చేసిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం- గర్భవతుల మరణాలలో- ప్రతి ఐదింటిలో ఒకటి రక్తహీనత వల్లే జరుగుతోంది.

ఎలా ఎదుర్కోవాలి?

హిమోగ్లోబిన్‌ శాతం బాగా తక్కువుంటే మందులు వాడాలి. లేకపోతే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటే సరిపోతుంది. కాయగూరలు, ఆకుకూరలతో పాటుగా గుడ్లు, ఎర్రమాంసం, లివర్‌, రొయ్యలు, ఆయిస్టర్స్‌ వంటివి తింటే హిమోగ్లోబిన్‌ శాతం బాగా పెరుగుతుంది. సాధారణంగా పప్పుదినుసులు, ఆకుకూరలు, కాయగూరలలో ఐరన్‌ శాతం 2 నుంచి 10 శాతం దాకా ఉంటుంది. అదే మాంసాహారంలో ఇది 15-35 శాతం దాకా లభిస్తుంది. దీనితో పాటు ఇనుప మూకుడులలో ఆహారపదార్థాలను వండటం వల్ల కూడా ఐరన్‌ శాతం పెరుగుతుంది. ఆకుకూరలు, కాయగూరల్లో నిమ్మకాయ రసం పిండుకు తింటే- ఆ పదార్థాలలో ఉన్న ఐరన్‌ త్వరగా రక్తంలోకి ప్రవేశిస్తుంది. ప్రతి ఏడాదికి ఒక సారి మహిళలు హిమోగ్లోబిన్‌ శాతాన్ని పరీక్ష చేయించుకోవాలి.