ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

KITCHEN TIPS FOR GET RID OF OILY SKIN - TELUGU TIPS FOR FRESH FRAGNANCE OF SKIN - REMOVE OIL SKIN COMPLAINT WITH OATS ETC




జిడ్డు వేధిస్తుంటే...!

గుప్పెడు ఓట్స్‌లో కలబంద గుజ్జు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని వేళ్లతో తీసుకుని ముఖంపై సవ్య, అపసవ్య దిశ లో ఐదు నిమిషాల రుద్ది, పావుగంట తరవాత కడిగేయాలి. కలబంద మొటిమలు రాకుండా కాపాడుతుంది. ఈ వేసవిలో ఎండకు కమిలిన చర్మానికి తిరిగి రంగును తెచ్చేందుకు దోహదం చేస్తుంది.

* మూడు చెంచాల చొప్పున యాపిల్ గుజ్జూ, తేనె కలిపి ముఖానికి రాసుకోవాలి. ఇరవై నిమిషాల తర్వాత నీళ్లతో కడిగేయాలి. తేనె ముఖంపై పేరుకుపోయిన జిడ్డుని తొలగిస్తుంది.

* అరటిపండును బాగా చిదిమి అందులో చెంచా చొప్పున తేనె, నిమ్మరసం కలపాలి. దీన్ని ముఖానికి రాసి ఇరవై నిమిషాల తర్వాత మెత్తని వస్త్రంతో రుద్ది తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. నిమ్మరసం సహజ క్లెన్సర్‌గా పనిచేసి ఎండ తీవ్రతకు నల్లబడిన చర్మానికి నిగారింపునిస్తుంది.