ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

LEARN FROM BHAGAWADHGEETHA - ARTICLE ABOUT IMPORTANCE OF BHAGAWADHGEETHA IN TELUGU


భగవద్గీత మనకేం చెబుతోంది ?

భగవద్గీత కేవలం బుద్ధితో అర్థం చేసుకుని దానితో ఆగిపోయే గ్రంథం కాదు. ఇది సాధనకు సంబంధించిన విషయం. ఇందులో చెప్పిన సాధనలు సాధకుడు స్వయంగా అభ్యాసం చేసి తనలో మార్పు తెచ్చుకోవడానికై ఉద్దేశించిన గ్రంథం. ఇతరులను కాదు, తనను తాను మార్చుకోవడానికి ఉద్దేశించినది. అందుకే భగవద్గీత మనకేం చెబుతోంది? 

భగవద్గీత అనాదిగా మనకు పారాయణ గ్రంథంగా వస్తున్నది. పరమంటే శ్రేష్టమైన, ఆయనం అంటే మార్గం. అంటే శ్రేష్టమైన మార్గం అనే భావనే పారాయణం. జీవితానికి సంబంధించిన గ్రంథం కనుక భగవద్గీతను మన పూర్వీకులు రోజూ పారాయణం చేసేవారు.
వేదవ్యాసుడు సంస్కృతంలో రచించిన మహాభారతంలోని భీష్మపర్వంలో భారత యుద్ధం ప్రారంభం కావడానికి ముందు కృష్ణుడికి, అర్జునుడికి మధ్య సంభాషణ రూపంలో భగవద్గీత కనిపిస్తుంది. కృష్ణుడు, అర్జునుడు ఇద్దరూ ధర్మశాస్త్ర నిపుణులే. అకస్మాత్తుగా అర్జునుడిలో తన ధర్మాన్ని గురించిన సందేహం మొలకెత్తింది. దానికి సమాధానం ఇవ్వడమే శ్రీకృష్ణుడు చేసిన పని. భగవద్గీతలో కృష్ణుడు హింసను ప్రేరేపించాడని, అర్జునుడిని యుద్ధానికి పురిగొల్పాడనీ అనడం సరైనది కాదు.

గీతాభాష్యంలో శంకరులు స్పష్టంగా “'న చ అత్ర యుద్ధ కర్తవ్యతా విధీయతే' అని రాశారు. అంటే ఇక్కడ యుద్ధం చేయమని పురిగొల్పడం లేదు. స్వధ ర్మాన్ని మరచి పరధర్మమైన భిక్షాటనాన్ని తీసుకుంటాననడం (భిక్షాటనమనేది బ్రాహ్మణుడి ధర్మం) తప్పు అని కృష్ణుడి భావమని శంకరులు వివరించారు. మంచికీ చెడుకూ మధ్య జరుగుతున్న సంఘర్షణ భారతయుద్ధం. అందులో ధర్మాన్ని నిలబెట్టడం క్షత్రి యుడి కర్తవ్యం. అందువల్లనే ఈ ఉపదేశం. భగవద్గీత కేవలం బుద్ధితో అర్థం చేసుకుని దానితో ఆగిపోయే గ్రంథం కాదు. ఇది సాధనకు సంబంధించిన విషయం. ఇందులో చెప్పిన సాధనలు సాధకుడు స్వయంగా అభ్యాసం చేసి తనలో మార్పు తెచ్చుకోవడానికై ఉద్దేశించిన గ్రంథం. ఇతరులను కాదు, తనను తాను మార్చు కోవడానికి ఉద్దేశించినది.

అందుకే భగవద్గీత మనకేం చెబుతోంది? అనే ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానమే ఈ వ్యాస పరంపర.

* అర్జున విషాదయోగం

అర్జునుడి విషాదాన్ని తెలుపుతుంది కాబట్టి ఈ అధ్యాయానికి అర్జున విషాదయోగం అని పేరు. ఈ అధ్యయాల పేర్లు వ్యాస భారంతో లేవు. తర్వాతి వ్యాఖ్యాతలు అధ్యాయంలోని విషయాన్ని పాఠకులకు సులభంగా తెలపడానికి పెట్టినపేర్లు.

ఈ అధ్యాయంలో 47 శ్లోకాలు ఉన్నాయి. అర్జునుడి విషాదానికి కారణం మనకు తెలిసిందే. కౌరవులు - పాండవులు అన్నదమ్ములపుత్రులు. పాండవులకు రావలసిన రాజ్యం వారికివ్వకుండాఅడ్డుకున్నాడు కౌర యువరాజు దుర్యోధనుడు. రాజ్యమివ్వడానికి శ్రీకృష్ణుడు చేసిన రాయబారము నిరుపయోగ మైంది. అందువల్ల రెండు పక్షాల వారు వారివారి మిత్రరాజుల సహకా రంతో సైన్యాన్ని ప్రోగు చేసుకున్నారు. అర్జునుడు, దుర్యోధనుడు స్వయంగా శ్రీకృష్ణుడి వద్దకు వెళ్లి యుద్ధంలో అతని సహాయాన్ని కోరడంతో శ్రీకృష్ణుడు తన సైన్యమంతా ఒకవైపు, యుద్ధం చేయకుండా ఊరక సలహా ఇచ్చు తాను మరొకవైపు అని విభజించి చెప్పాడు. దుర్యోధనుడు సంతోషంగా సైన్యాన్ని కోరుకుంటే అర్జు నుడు సంతోషంగా శ్రీకృష్ణుడిని కోరి తెచ్చుకున్నాడు. ఒకానొక నిర్ణీత సమయంలో యుద్ధానికి రెండు సేనలూ సర్వసన్నాహాలు చేసుకు న్నాయి. యుద్ధస్థలం పేరు కురుక్షేత్రం.పదిరోజుల భారతయుద్ధం తర్వాత భీష్ముడు అంపశయ్యపై వాలగా ఆ సమాచారాన్ని సంజయుడు ధృతరాష్ట్రుడికి తెలియజేస్తాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు అతణ్ణి పూర్తి వివరాలడుగుతాడు. ప్రారంభంనుండి జరిగిన విషయాలన్నీ సంజయుడు చెప్పడం ప్రారంభిస్తాడు. వ్యాస మహర్షి వరం వల్ల సంజయుడికి దివ్యదృష్టి కలగడంతో సంజయుడు పూసగుచ్చినట్లుగా యుద్ధభూమిలోని విషయాలను తన జ్ఞాననేత్రంతో దర్శించి తెలియజేయడం గీతా సన్నివేశం.

* మన బుద్ధియే కురుక్షేత్రం

ధర్మక్షేత్రే కురుక్షేత్రే అనే శ్లోకంలో ధృతరాష్ట్రుడి ప్రశ్నతో గీత ప్రథమాధ్యాయం ప్రారంభమవుతుంది. ధర్మక్షేత్రమైన కురు క్షేత్రంలో నావారూ, పాండవులు ఏమి చేశారని ప్రశ్న. నా వారు అన్న మాటతోనే పాండవులు నా వారు కారని చెప్పకనే చెప్పాడు ధృత రాష్ట్రుడు. కౌరవవంశ మూలపురుషుడైన కురు మహారాజు అనేక ధర్మకార్యాలు చేసిన పుణ్యస్థలం కురుక్షేత్రం. అక్కడ ధర్మానికే విజయం అనే మాట ధ్వనిస్తుంది. సంస్కృతంలో కృఞ్‌ అనే ధాతువుకి కర్మ చేయడమని అర్థం. కురు శబ్దం దీనినుంచి వచ్చినదే. కర్మకు క్షేత్రం శరీరమే. శరీరంలోని జీవుడు కర్మను ఆచరించేవాడు. మనస్సనేదే పగ్గం. బుద్ధి సారథి. జీవుణ్ణి బాహ్యవస్తువులవైపు పరుగులెత్తించే ఇంద్రియాలే గుఱ్ఱాలు. ఈ కల్పన మనం తెచ్చిపెట్టుకున్నది కాదు. కఠోపనిషత్తులో ఈ విషయం ఇంకా చక్కగా చెప్పబడింది.

ఆత్మానాం రథినం విద్ధి శరీరం రథమేవతు|
బుద్ధింతు సారథి విద్ధి మన: ప్రగ్రహమేవ చ|| (కఠోపనిషత్‌)

శరీరమే రథం. అందులో ఉండే రథస్వామి లేదా యజమాని జీవుడు. అతణ్ణి నడిపించే బుద్ధి సారధి. మనస్సే ప్రగ్రహం. అంటే పగ్గం. కన్ను, ముక్కు, చెవి మొదలైన ఐదు జ్ఞానేంద్రియాలే గుఱ్ఱాలు. ఇవి తాము గ్రహించే విషయాలవైపు మనిషిని లాగుతుంటాయి. వాటిని అదుపులో పెట్టాల్సింది మనస్సు. విజ్ఞానవంతమైన బుద్ధి రథికుణ్ణి అతని గమ్యానికి చేరుస్తుంది. దీనినే మరోమంత్రంలో వివరిస్తూ అలాంటి విజ్ఞానసార్థి గల రథస్వామి పరమపదం అంటే పరమాత్మ తత్త్వాన్ని పొందుతాడని చెబుతుంది ఉపనిషత్తు.

శ్రీకృష్ణుడికి నారాయణుడనీ, అర్జునుడికి నరుడనీ కూడా పేర్లున్నాయి. నరుడంటే జీవుడు. నారాయణుడు నరాణాం ఆయనం అంటే నరులకు గమ్యస్థానం. అదే జీవులు సాధించవలసిన మోక్షావస్థ. ఆత్మను తెలుసుకోవడమే మోక్షం. అది ఎక్కడో ఆకాశంలో పొందవలసిన స్థలం కాదు. ప్రతి వ్యక్తీ తన అంత:కరణను విశ్లేషించి తన కోరికలు రాగద్వేషాలు మొదలైన వాటిని పరిశీలించి ఈ మనస్సును, బుద్ధి ప్రవృత్తుల్నీ ప్రేరేపిస్తున్న చైతన్య శక్తి ఏమిటి? అని పరిశీలించడం, అంటే ఆత్మవిచారం చేయడం ముఖ్యం. గాయత్రీ మంత్రంలో ధియో యో న: ప్రచోదయాత్‌ అంటారు. అంటే మన బుద్ధి వృత్తుల్ని అంటే బుద్ధిలో మెదిలే ఆలోచనలను ప్రేరేపిస్తున్న చైతన్యశక్తి ఏదో అదే తన స్వరూపమని తెలుసుకొని రాగద్వేషాలకు అతీతుడిగా ఉండటమే మోక్షం.

ఈ జ్ఞానంలోనే నిలిచివుండి ప్రాపంచిక విషయాలకు దూరంగా ఉండే స్థితి సంన్యాసం. దీనిలో వ్యక్తి తనకున్న సమాజ బాధ్యతలనుండి పూర్తిగా తొలగిపోయి కేవలం బ్రహ్మజ్ఞానంలో నిలిచి ఉంటాడు. అలాంటివాడిని బ్రహ్మనిష్టుడు అంటారు. అంటే ఏవిధంగా ఎలాంటి సంగము లేకుండా జ్ఞానస్వరూపం వుంటుందో అలాంటి జ్ఞాన స్వరూపంలో బ్రహ్మగా ఉంటాడు అని అర్థం.

ఈ స్థితి సమాజంలో అందరికీ అనవసరం. సాధకులందరికీ లభించదు. ఈ జ్ఞానం స్వరూపాన్ని సైద్ధాంతికంగా తెలుసుకుని సమా జం తనకప్పగించిన బాధ్యత లను రాగద్వేషాలు లేకుండా నిర్వ హించ డం రెండవ స్థితి. అంటే కర్మ చేస్తూ ఉండటం. దీనినే కర్మ యోగం అంటారు. దీని గురించి 2, 3, 4, 5 అధ్యాయాల్లో వివరంగా తెలు స్తుంది.

* భారతంలో అర్జును డికి జ్ఞాన

స్వరూపాన్ని పూర్తిగా వివరి స్తాడు శ్రీకృష్ణుడు. కానీ అతను సంన్య సించాలనే ఉద్దె శంతో కాదు. తత్వ్తాన్ని సరిగా తెలుసు కొని తన కర్తవ్యాన్ని మరింత శ్రద్ధతో నిర్వ హించాలనే ఉద్దేశం. మనందరం అర్జునుడి స్థానంలో ఉన్నవాళ్లం. మనందరికీ ఉపదేశం.