వ్యాయామం తర్వాత అతిగా తినకుండా ఉండాలంటే..!
శారీరక శ్రమతో కూడిన పని చేసినప్పుడు శరీరం శక్తిని కోల్పోవడం సహజం. అయితే ఇలా శక్తిని కోల్పోయినప్పుడు ఆకలి కూడా బాగానే వేస్తుంటుంది. ఈ సమయంలో వెనకా ముందూ ఆలోచించకుండా అందుబాటులో ఉన్న ఆహారం వెంటనే లాగించేస్తుంటాం. అలాగే వ్యాయామం చేసిన తర్వాత కూడా ఆకలి ఎక్కువగా వేస్తే చాలామంది అధిక మొత్తంలో ఆహారం తీసుకుంటుంటారు. దీనివల్ల వ్యాయామం చేసిన ఫలితం దక్కకపోగా మరింత బరువు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అలవాటును ఎంత వీలైతే అంత త్వరగా తగ్గించుకోవడం మంచిది.
• ఇందుకు ఉపకరించే కొన్ని సులువైన పద్ధతులు
ముందే...!
వ్యాయామం చేసిన తర్వాత ఆహారం ఎక్కువగా తినకుండా ఉండాలంటే.. వ్యాయామానికి ముందే తేలికపాటి స్నాక్స్ తీసుకోవడం మంచిది. ఇందులో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. బ్రెడ్-జామ్, శాండ్‌విచ్, గ్లాసు వెన్నలేని పాలు.. వంటి పదార్థాల్ని తీసుకోవడం వల్ల అటు వ్యాయామం చేయడానికి శరీరానికి శక్తి అందడంతో పాటు ఇటు వ్యాయామం తర్వాత ఆకలి వేయకుండా కూడా ఉంటుంది.
ఆస్వాదించాలి..!
ఏ పనైనా మనస్ఫూర్తిగా ఆస్వాదించి చేయగలిగితేనే అందులో ఉండే ఆనందం మన సొంతమవుతుంది. వ్యాయామం కూడా అంతే.. ఎవరైతే కష్టమనుకోకుండా ఇష్టపడి, ఎంజాయ్ చేస్తూ వ్యాయామం చేస్తారో.. వారు వ్యాయామం తర్వాత తక్కువగా తింటారని ఓ పరిశోధనలో వెల్లడైంది. తద్వారా ఆహారం ఎక్కువగా తీసుకోకుండా బరువును అదుపులో ఉంచుకోవచ్చు.. అలాగే వ్యాయామం చేసిన ఫలితమూ అందుతుంది.
మధ్యమధ్యలో..
వ్యాయామం చేసే క్రమంలో శరీరంలోని నీరు చెమట రూపంలో బయటికి వెళ్లిపోతుంది. తద్వారా శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది. కాబట్టి దీన్ని బ్యాలన్స్ చేయడానికి మధ్యమధ్యలో నీరు తాగడం మంచిది. అలాగే వ్యాయామం చేసిన తర్వాత వెంటనే ఆహారం తీసుకోవడం కాకుండా ముందు గ్లాసు నీరు తాగి కనీసం ఇరవై నిమిషాల పాటు ఆగడం మంచిది. ఎందుకంటే నీరు తాగితే కడుపు నిండుగా అనిపించి ఎక్కువగా ఆకలి వేయకుండా ఉండి.. తక్కువ తినే అవకాశం ఉంటుంది.
ఎక్కువ సేపా...?
శరీరంలోని క్యాలరీలు ఎక్కువగా కరిగించుకోవాలనే ఉద్దేశంతో కొంతమంది వ్యాయామానికి అవసరమైన దాని కంటే ఎక్కువ సమయం కేటాయిస్తుంటారు. ఇలా చేయడం వల్ల శరీరం ఎక్కువ శక్తిని కోల్పోతుంటుంది. దీంతో ఆకలి కూడా ఎక్కువగా వేస్తుంటుంది. తద్వారా వ్యాయామం ముగిసిన వెంటనే కడుపునిండా ఆహారం తీసుకోవాలనిపిస్తుంటుంది. కాబట్టి రోజూ వ్యాయామానికి ఒక నిర్దిష్ట సమయం కేటాయించడం మంచిది.
ప్లాన్ చేసుకోండి..
కొంతమంది వ్యాయామం చేసిన తర్వాత ఫాస్ట్ ఫుడ్, స్నాక్స్ తీసుకుంటుంటారు. దీనివల్ల శరీరంలో అనవసరమైన కొవ్వులు పేరుకుపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యాయామం చేసిన తర్వాత ఓ ఇరవై నిమిషాల పాటు విశ్రాంతి తీసుకుని తర్వాత నేరుగా భోజనం చేసేయొచ్చు. ఇలా చేయడం వల్ల ఫాస్ట్ ఫుడ్స్, స్నాక్స్ ఎక్కువగా తీసుకోకుండా ఉండడంతో పాటు మంచి పోషకాహారం తీసుకునే అవకాశం ఉంటుంది.
నిండుగా అనిపించేలా..
క్యాలరీలు తక్కువగా.. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాల్ని తీసుకోవడం మంచిది. ఎందుకంటే వీటివల్ల కడుపు నిండుగా అనిపించి ఎక్కువ సేపు ఆకలి వేయకుండా ఉంటుంది. ఇందులో భాగంగా కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు.. వంటివి రోజూ తీసుకునే ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటివల్ల శరీరానికి కావలసిన పోషకాలు కూడా అందుతాయి. అలాగే ఒకేసారి ఎక్కువగా కాకుండా.. కొద్ది మొత్తాల్లో ఎక్కువ సార్లు తినేలా ప్లాన్ చేసుకోవడం మంచిది.