ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

TELUGU TRAVEL GUIDE / INFORMATION ABOUT ACHANTISWARALAYAM TEMPLE AT KODERU - INDIA


ఆచంటీశ్వరాలయం
ఆచంటీశ్వరాలయం దక్షిణ భారత దేశములో ఉన్న పుణ్య క్షేత్రములలో ఒకటి. ఈ క్షేత్రము వశిష్ట, గొదావరి నది తీరములో ఉన్న కోడేరు గ్రామానికి, ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్నంది. రాజకీయంగానూ, సాంస్కృతికంగాను ఎంతగానో పేరొందిన ఆచంట మండలంలో పుర మధ్యలో శ్రీరామచంద్ర మూర్తి చే ప్రతిష్ఠితుడై శ్రీ రామలింగేశ్వర మూర్తి ఉమా సమేతంగా వెలసి ఎంతో ఖ్యాతి పొంది యున్నాడు. దర్శనీయ స్థలంగానూ, పుణ్యక్షేత్రంగాను ఆచంట విరాజిల్లుతోంది. శివరాత్రి , కార్తీక పూర్ణిమ లాంటి, పర్వదినాలతోపాటు ప్రతి రోజూ తమిళనాదు, కర్ణాటక రాష్ట్రాలనుండి అనేక మంది భక్తులు వస్తూంటారు.

* ఆలయ చరిత్ర

ఈ ఆచంట గ్రామానికి పూర్వం మార్తాండపురమనే పేరు ఉంది. శ్రీ ఒడయనంబి-పరమనాచీమ అనే తమిల దంపతులతో స్వామి పూజింపబడ్డాడాని చరిత్రలొ చెప్పబడి ఉంది. ఒకయనంబి అపర శివభక్తుడు. తీర్థయాత్రలు నేయుచు- శివాజ్ఞ చే చివరికి మార్తాఅండపురం చేరుకొనెను. ప్రతీ రూజూ శివార్చనచే పవిత్రుడగుచుండెను. ఒక రోజు మేలుకొనే సరికి ప్రాతః సమయం దాటి సూర్యకిరణములు భూమిపై ప్రసరించు సరికి ఒడబనంబికి ఏమి చేయాలో శివారాథన ఎట్లు గావించాలో తెలియలేదు. అంతలో నిద్రావస్థలో ఉన్న తన సతీమణియైన పరమనాచీమ స్తనద్వయంబందు ఆత్మలింగ దర్శనం చేసుకొని పూజకావించెను. ఆ తరువాత తను తప్పు చేశానని విచారించుచుండ ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమై "నీవు పొరబాటు చేయలేదు. చిత్త శుద్ధితో చేసిన నీ పూజ నేనెరింగితిని." అని అంతర్ధానమయ్యెను. ఆ చనాగ్రంబున వెలసినందున ఆ పరమ శివుడు ఆచంటిశ్వరునిగా వినుతికెక్కెను.

* ఆలయ విశేషాలు

ఆచంటలోని రామేశ్వరాలయం లో క్రీ.శ 1152 - 1255 సంవత్సరాలలో చారిత్రక శాసనాలు అనేకం ఉన్నాయి. ప్రాచీన చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలిచే ఆచంటీశ్వర క్షేత్రాన్ని ప్రతి ఒక్కరూ చుసి తరిస్తారు. గర్భాలయంలో శివలింగతో పాటు ఉమాదేవి, ఆలయ ప్రాంగణంలో శ్రీ విఘ్నేశ్వరస్వామి, శ్రీ వీరభద్రుడు, శ్రీ విశ్వేశ్వర స్వామి, శ్రీ కమఠేశ్వరస్వామి, శ్రీ లక్ష్మణేస్వర స్వామి, శ్రీ కనకదుర్గ అమ్మవారు, శ్రీ ఆంజనేయస్వామి, శ్రీ సరస్వతీ దేవి, నవగ్రహములు, శ్రీ సూర్యనారాయణ స్వామి మొదలైన ఉపాలయాలతో పాటు సప్తమాతృకలచే నిర్మితమై ఉంది ఈ ఆలయం.

* ఆలయంలో జరుగు పూజా వేడుకలు

తొలి ఏకాదశమి

శ్రీరమా సత్యనారాయన (ఉపాలయం) స్వామి వారికి గ్రామోత్సవ పూజలు జరుగును.

కృష్ణాష్టమి

ఆలయంలో కృష్ణుని పూజలు జరిపు పాలకుండ కొట్టడం, పొన్నచెట్టు, గరుడవాహనాల, ఉత్సవ విగ్రహాల ఊరేగింపు జరుగును.

దసరా

అమ్మవారికి కుంకుమ పూజలు 9 రోజులు విశేషంగా జరుగును, చివరి రోజు గ్రామోత్సవం జరుపబడును.

కార్తీకమాసం

ఈ ఆచంటీశ్వరుని దేవాలయ్ంలో విశేషంగా ఈ మాసమంతా పూజలు జరుగును. దేవాలయానికి ప్రక్కనే ఉన్న రామగుండమందు భక్తులు కార్తీక మాస దీపాలు విడుస్తారు. ఈ రామగుండమందు ఒక సంవత్సరం పాటు క్రమం తప్పకుండా స్నానమాచరిస్తే కుష్టు కొదలైన భయంకర వ్యాధులనుండి విముక్తులవుతారని చరిత్రలో చెప్పబడింది. అంతే కాకుండా కార్తీక ద్వాదశి రోజున తెప్పోత్సవం రమాసత్య దెవూల్కు కనుల వైభవంగా జరిపు అనంతరం బాణా సంచా కాల్చుదురు. రాత్రివరకు విశేష అర్చనలు జరుగును. ఈ కార్తీక మాసంలో ఏటా 3 సోమవారాలు జ్యోతిర్లింగార్చన, ఏకవార రుద్రాభిషేకం, ప్రతివారం స్మార్త పండ్కితులచే లక్ష బిర్వార్చనలు జరుగును. కార్తీక పూర్ణిమ రోజున జ్వాలాతోరణం వెలిగించి రుద్రహోమం జరుగుతుంది.

కపర్థి పత్తి

కార్తీక పూర్ణిమ రోజున ఈ కపర్థ పత్తి వెలిగించడం జరుగుతుంది. ఈ పత్తి 90 రోజులు నిరాఘాటంగా వెలుగుతుంది. దీని కొరకు కిలోల ఆవునెయ్యి ఉపవాసం ఉండి పోస్తూంటారు. కార్తీక మాసంలో వెలిగించబడిన ఈ ఒత్తి శివరాత్రి వరకు దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటుంది. కాశీ తరువాత ఇటువంటి దీపం ఈ ఆచంటలో వెలిగించబడుట విశేషం. అందువల్ల దీనిని చిన్న కాశీ అని కూడ అంటారు. ఈ దీప దర్శనం జన్మాంతర పాప నాశనం అని చెప్పబడుతోంది.

మహా శివరాత్రి

శివరాత్రి సందర్భంగా 5 రోజులు విశేషంగా ఉత్సవం జరుపబడును. అందులో భాగంగా దశమి రోజున స్వామివారిని ఊరేగింపు, బాణాసంచా కొలువు, ఏకాదశి రోజు ఉమారామేశ్వరులకు కళ్యాణోత్సవం జరిపించబడును. మరునాదు ఉఅమ రామేశ్వరుల ఊరేగింపు గజ, సింహ,సర్ప, గరుఢ, వృషభ వాహనాల ఊరేగింపు , అనేక విధములైన నృత్య, గీత ప్రదర్శనలు జరుగును.

శివరాత్రి రూజున లింగోద్భవ కాలమందు విశేషంగా అభిషేకం జరుపబడును. అనంతరం భక్తుల అభిషేకములు, మధ్యాహ్నం కన్ను వైభోగంగా రథోత్సవం జరుగును. నాలుగవ రోజు స్వామివారికి తెప్పోత్సవం జరుపబడును. ఐదవ రొజున పుష్పోత్సవం, కుంకుమ భరిణలు, ప్రసాదాలు, భక్తులకు పంచిపెట్టబడును. శివరాత్రి ఐదు రోజులు స్వామివారి సత్రమందు భక్తులకు అన్నదాన మహోత్సవములు జరుగు. శివరాత్రి రోజున విశ్వేశ్వరుని కళ్యాణం జరుగును. శివరాత్రి ఉత్సవం సందర్భంగా ప్రభుత్వం వారు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులను, ఉచిత వైద్య సదుపాయాలను కల్పించడం జరుగుతుంది.