ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

VITAMIN-C PROVIDER THE GUAVA FRUIT - ARTICLE IN TELUGU ABOUT JAMA PANDU



జామలో విటమిన్‌ ' సి' మెండు

 కమలా, నారింజ వంటి సిట్రస్‌ పండ్లలో మాత్రమే విటమిన్‌ సి లభిస్తుందనుకుంటే పొరపాటే. చౌకగా లభించే ఒక్క జామ కాయలో 165 మిల్లీగ్రాముల విటమిన్‌ సి ఉంటుంది. అదే ఒక్క కమలా పండులో సిట్రస్‌ 69 మిల్లిగ్రాములు మాత్రమే లభిస్తుంది. బిటాకెరోటిన్‌, లికోపెస్‌, పొటాషియం, కరిగిపోగల పీచు జామకాయలో పుష్కలంగా లభిస్తాయి. రక్తపోటు, కొలెస్ట్రాల్‌లను నియంత్రణ చేస్తుంది. ఇంకా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీనిలోని పొటాషియం రక్తపోటును తగ్గించగలదు.
హార్ట్‌ బీట్స్‌ను స్థిరంగా వుంచేందుకు, శరీరంలోని మలినాల్ని బయటకునెట్టే క్రమంలో కిడ్నీలకు సహకరించేందుకు ఈ ఖనిజం అవసరం. జామలో లభించే విటమిన్‌ సి గుండె జబ్బుల్ని రానీయదు. ఇది మంచి హెచ్‌డిఎల్‌ కొలెస్ట్రాల్‌ స్థాయుల్ని పెంచి, చెడు ఎల్‌డిఎల్‌ కొలెస్ట్రాల్‌ను ఆక్సిడైజ్‌ కాకుండా, ఆర్టరీల్ని మూసివేసే పొరమాదిరి తయారుకాకుండా కాపాడుతుందని పరిశోధనలు పేర్కొంటున్నాయి. చిన్న రక్తనాళాలను ఆరోగ్యంగా వుంచేందుకు కూడా విటమిన్‌ సి సహకరిస్తుంది. జామలో లికొపెన్‌ సమృద్ధిగా లభిస్తుంది. చాలా శాకాహార పదార్థాలకు ఎరుపు గులాబీ రంగుల్నిచ్చే ఈ కెరొటనాయిడ్‌ క్యాన్సర్‌ నిరోధకంలో సహకరిస్తుంది

  1. Guava
    Fruit
  2. Guavas are common tropical fruits cultivated and enjoyed in many tropical and subtropical regions. Psidium guajava is a small tree in the Myrtle family, native to Mexico, Central America, and northern South America. 
  3. Nutrition Facts
    Guava
    Amount Per 100 grams
    Calories 68
  4. % Daily Value*
    Total Fat 1 g1%
    Saturated fat 0.3 g1%
    Polyunsaturated fat 0.4 g
    Monounsaturated fat 0.1 g
    Cholesterol 0 mg0%
    Sodium 2 mg0%
    Potassium 417 mg11%
    Total Carbohydrate 14 g4%
    Dietary fiber 5 g20%
    Sugar 9 g
    Protein 2.6 g5%
    Vitamin A12%Vitamin C380%
    Calcium1%Iron1%
    Vitamin D0%Vitamin B-65%
    Vitamin B-120%Magnesium5%
    *Per cent Daily Values are based on a 2,000 calorie diet. Your daily values may be higher or lower depending on your calorie needs.