ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

ARTICLE ABOUT NEWEST WHEY PROTEIN HEALTH TIPS IN TELUGU


వే-ప్రొటీన్‌తో శరీరం పరిపుష్ఠం 

యుక్త వయసు వరకు పుట్టుకతో వచ్చిన శక్తి నిలువలతో శరీరర వ్యవస్థ కొనసాగుతుంది. ఆ తర్వాత ఎముకలు, కండరాల వ్యవస్థ సమర్థవంతంగా పనిచేయడానికి కాల్షియం, కండరాల వ్యవస్థను బలోపేతం చేసే ప్రొటీన్‌ను కూడా అదనంగా తీసుకోవాల్సి ఉంటుంది అందుకు పాలు లేదా పాల ఉత్పత్తుల అవసరం ఎంతో ఉంటుంది. అయితే ఇటీవల ఈ ఉత్పత్తుల ద్వారా ప్రధానంగా మీగడ ద్వారా తయారుచేసిన వే- ప్రొటీన్‌ అందుబాటులోకి వచ్చింది. ఇది ఈ వ్యవస్థల్ని పరిపుష్టం
చేయడంలో ఎంతో తోడ్పతుంది
అంటున్నారు నిపుణులు..
ప్రొటీన్‌ అనగానే మాంసాహారం మీదికే మనసు వెళుతుంది. భారీగా ప్రొటీన్‌ అందాలంటే, మాంసాహారం తప్ప మరో మార్గమే లేదనుకుంటారు చాలా మంది. కానీ, పాలు, పాల ఉత్పత్తుల ద్వారా అందే ప్రొటీన్‌ పరిమాణం కూడా తక్కువే మీ కాదు. శరీరానికి కావలసిన కాల్షియం, పాస్ఫరస్‌, ప్రొటీన్‌, పొటాషియం, రిబోఫ్లేవిన్‌, నియాసిన్‌, విటమిన్‌ బి-12, విటమిన్‌-ఇ, విటమిన్‌ ఏ ఇవన్నీ పాలు లేదా పాల ఉత్పత్తుల్లో లభిస్తాయి. ఇవన్నీ కావలసిన నిష్పత్తిలో లభించడానికి కొవ్వు లేని, లేదా కొవ్వు తక్కువగా ఉండే పాలు రోజుకు మూడు కప్పులు తాగడం అవసరం అంటున్నారు నిపుణులు. పాలు గానీ పాల ఉత్పత్తులు గానీ, ఎముకల దృఢతాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి రక్తపోటును క్రమబద్దం చేయడంలోనూ, శరీర బరువును నియంత్రణలో ఉంచడంలోనూ, దంత సమస్యలు తలెత్తకుండా చూడటంతో పాటు, ఉదర సంబంధ సమస్యలు ప్రత్యేకించి చిన్న, పెద్ద పేగుల్లో ఏ విధమైన రుగ్మతలూ తలెత్తకుండా కాపాడతాయి. పాలల్లో, పాల ఉత్పత్తుల్లో సమృద్ధిగా లభించే ప్రొటీన్‌ వల్ల కండరాల వ్యవస్థ పరిపుష్టమవుతుంది. ఆకలి తీరిన సంతృప్తి కలిగేలా కూడా ఇవి తోడ్పడతాయి. రోజూ మూడు గ్లాసులు పాలు తాగితే, పెద్దవారికి కావలసిన ప్రొటీన్‌లో అత్యధిక పరిమాణం అందుతుంది.

వే-ప్రొటీన్‌

ఇటీవలి కాలంలో ‘వే- ప్రొటీన్‌’ బాగా వాడుకలోకి వచ్చింది. ఈ ప్రొటీన్‌ను సహజమైన ఆవు పాలలోంచి, పాల మీగడలోంచి తయారు చేస్తారు. ఇది శరీర ఆరోగ్యం మీద ఎంతో సానుకూల ప్రభావాన్ని చూపడం వల్ల ఎక్కువ మంది దృష్టి ఈ ప్రొటీన్‌ మీదికి వెళుతోంది. వే ప్రొటీన్‌ పొడి రూపంలోనూ, కాన్‌సెంట్రేట్‌గానూ, ఐసొలేట్‌గానూ లభిస్తోంది. ఎంతో పౌష్టికరమైన ఈ ప్రొటీన్‌ అతి సులభంగా జీర్ణమైపోవడం ఇందులోని మరో విశేషం. శరీరంలో ప్రొటీన్‌ తయారు కావడానికి దోహదం చేసే అమినో ఆసిడ్స్‌ను కూడా వే-ప్రొటీన్‌ కావలసిన మోతాదులో అందచేస్తుంది. నిజానికి కూరగాయల్లోంచి లభించే ప్రొటీన్‌ శరీర అవసరాలకు సరిపోదు. దానికి కారణం, శరీరానికి అవసరమైన ఎసెన్షియల్‌ అమినో ఆసిడ్స్‌ అందులో లేకపోవడమే. అయితే శరీరానికి అవసరమైన పూర్తి స్థాయి ప్రయోజనం అందాలంటే, వే-ప్రొటీన్‌తో పాటు ఎగ్‌ ప్రొటీన్‌, సోయా ప్రొటీన్‌, వీట్‌ ప్రొటీన్‌ కూడా తీసుకోవలసి ఉంటుంది. అప్పుడే శరీరానికి సమగ్రపోషణ లభిస్తుంది. వే- ప్రొటీన్‌ సింథసి్‌సను పెంచడం వల్ల ఒక దశలో కండరాల్లో కొత్త కణజాలం పుట్టుకురావడానికి అది కారణమవుతుంది. శరీరం బరువును అనుసరించి 1 కె .జి శరీరం బరువుకు 1.2 వే ప్రొటీన్‌ తీసుకుంటే, మజుల్‌ మాస్‌ గణ నీయంగా పెరుగుతుంది. బెవరేజ్‌ సప్లిమెంటేషన్‌ ద్వారా లభించేదాని కన్నా ఇది ఎన్నో రెట్లు ఎక్కువ.

బాడీ బిల్డర్స్‌కే అని కాదు
విపరీతంగా వ్యాయామం చేసే వారే వే- ప్రొటీన్‌ తీసుకోవాలని కాదు. వయసు పైబడటం వల్ల జరిగే కండరాల క్షీణతను అరికట్టడంలోనూ ఈ వే- ప్రొటీన్‌ ఉపయోగపడుతుంది. ఇది వారిలోని కార్యదక్షతను పెంచుతుంది. ఎవరి మీదా ఆధారపడకుండా, ఒక ప్రామాణిక జీవితాన్ని గడపడానికి ఈ వే- ప్రొటీన్‌ తోడ్పడుతుంది.