కాజూ తినండి రోజు..
మితాహారం ఆరోగ్యానికి అందమైన సూత్రం. జిహ్వ చాపల్యం పక్కన పెడితే.. ప్రకృతి ప్రసాదించిన ప్రతి పదార్థం ఆరోగ్య ప్రదాతే. జీడిపప్పు కూడా అదే కోవలోకి వస్తుంది. చాలా మంది అధిక కేలరీలు ఉండే కాజూ తింటే ఒళ్లు వచ్చేస్తుందని భయపెడుతుంటారు. కానీ, జీడిపప్పు చేసే మేలు గురించి చెబితే ఆ మాటను వెనక్కి తీసుకోవాల్సిందే.
మానవ శరీరానికి అన్ని రకాల పోషక విలువలు కావాలి. జీడిపప్పులో ఆరోగ్యానికి మేలు చేసే కొవ్వు పదార్థం ఉంటుంది. ఇది శరీరానికి కావాల్సిన శక్తినిస్తుంది. తరుచూ వీటిని తీసుకోవడం వల్ల గుండె కూడా పదిలంగా ఉంటుంది.
మానవ శరీరానికి రోజుకు 300 నుంచి 750 మిల్లీగ్రాముల మెగ్నిషియం అవసరం అవుతుంది. జీడిపప్పులో 29 శాతం మెగ్నిషియం ఉంటుంది. ఇది ఎముకలకు, కండరాలకు పటుత్వం కలిగించడంతో పాటు కీళ్ల నొప్పులను అరికడుతుంది.
జీడిపప్పులో సోడియం తక్కువగా ఉంటుంది. పొటాషియం ఎక్కువగా ఉంటుంది. కాజు ద్వారా ఒంట్లోకి చేరిన పొటాషియం రక్తప్రసరణపై అనుకూలమైన ప్రభావం చూపుతుంది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది.
క్యాన్సర్‌ను ఎదిరించే స్వభావం కూడా జీడిపప్పులో ఉంది. వీటిలో ఉండే సిలీనియమ్, విటమిన్-ఇ వంటి యాంటీ ఆక్సిడెంట్లు రాడికల్ ఆక్సిడేషన్‌కు విరుగుడుగా పనిచేస్తాయి. క్యాన్సర్ రాకుండా కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి. జీడిపప్పులో లభించే జింక్.. ఇన్‌ఫెక్షన్లపై పోరాడుతుంది.
జీడిపప్పులో కాపర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది ఎంజైమ్‌ల పనితీరులో కీలకంగా వ్యవహరిస్తుంది. మెదడు చురుకుగా ఉండటంలోనూ సాయపడుతుంది. హార్మోన్ల ఉత్పత్తిని బ్యాలెన్స్ చేయటంతోపాటు.. అనీమియా వ్యాధి రాకుండా ప్రివెన్షన్ మెడిసిన్‌గా
పని చేస్తుంది.
జీడిపప్పు మేలు చేస్తుందని అదేపనిగా తినేయకండి. రోజులో 4 నుంచి 8 కాజులు, అదీ ఒకేసారిగా కాకుండా నాలుగైదుసార్లు తినడం వల్ల మీ శరీరానికి కొత్త శక్తి వస్తుంది. స్వీట్ల రూపంలో కూడా కాజూను తీసుకోవచ్చు. అయితే అది కూడా మితంగానే.