ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

WHAT SPECIAL IN PUDINA FOOD ITEMS FOR HEALTH



ఇంట్లో పుదీనా పచ్చడి, పుదీనా రైస్ చేస్తుంటారు... ఇందులో ఏముందసలు...?

పుదీనాను ఆహార పదార్థాలకు మంచి సువాసన ఇచ్చేందుకు వాడుతారని అనుకుంటారు. కానీ పుదీనాతో చాలా ప్రయోజనాలున్నాయి. పుదీనా టీ నేడు ఎంతో పాపులరన్న సంగతి తెలిసిందే. ఈ పుదీనాను ఐస్ క్రీమ్, టూత్ పేస్టులలోనూ ఉపయోగిస్తారు. దీనికి కారణం ఇందులో ఉన్న ఔషధ గుణమే. పుదీనా తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. 

ఉదర కండరాలను శుభ్రం చేసి పిత్తాశయం నుంచి వచ్చే జీర్ణరసాల ప్రభావం ఆహార పదార్థాల లోని కొవ్వుల మీద బాగా ఉండేలా చేస్తుంది. కడుపు ఉబ్బరం కలిగించనిది పుదీనా. గొంతులో ఏర్పడే ఇబ్బందులను కూడా ఇది తొలగిస్తుంది. కళ్లెను కరిగించి, దగ్గు నుంచి ఉపశమనమిస్తుంది. పుదీనా చర్మానికి పైపూతగా కూడా వాడవచ్చు. కీటకాలు కుడితే వచ్చే బాధను పుదీనా పసరుతో తగ్గించవచ్చు. చర్మంపై ఉన్న మచ్చలను తొలగించే శక్తి పుదీనాకు ఉంది.