ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

108 HOLES DIG BY LORD SRI RAMA IN VANAVASAM - TODAY NAMED AS RAMAGUNDAM ANDHRA PRADESH INDIA


శ్రీరాముడు అరణ్యవాసంలో 108 గుండాలు తవ్విన ప్రాతం ....
అరణ్యవాసంలోభాగంగా శ్రీరాముడు, సీత, లక్ష్మణుడితో కలిసి
గోదావరి తీరం వెంట వస్తూ అలసిపోయి ఈ గుట్ట ప్రాంతంలో
సేదదీరాడు. ఈప్రాంతం నచ్చి ఇక్కడే 108 రోజుల పాటు
నివాసముండి, నీటి కోసం 108 గుంటలు తవ్వాడు. ఈ గుంటలే
నేటి గుండాలు! అలా వీటికి రాముడి గుండాలు అనే పేరొచ్చింది.
దీని ఆధారంగానే సింగరేణి బొగ్గుగనులు విస్తరించిన ఈ
ప్రాంతానికి రామగుండం అనే పేరొచ్చిందని చెబుతారు.కొండపై
సుమారు 30ఎకరాల విస్తీర్ణంగల చదునైన ప్రదేశం ఉంది.
కరీంనగర్జిల్లాలోని రామగుండంలో ఉన్న ఈ రాముడి గుండాలు
ప్రకతి రమణీయప్రదేశం. కరీంనగర్ నుంచి గోదావరిఖని వెళ్లే దారిలో
రామగుండం బీ పవర్హౌజ్ గడ్డ వద్ద (తహశీల్ కార్యాలయం) దిగి,
ఆటోలో రెండు కిలోమీటర్లు ప్రయాణిస్తే ఇక్కడికి చేరుకోవచ్చు.
వర్షాకాలం నాలుగు నెలల్లో(జూన్ నుంచి నవంబర్వరకు)
సహజసిద్ధంగా పారే జలపాతం, 108 గుండాల్లోంచి ఈగుతూ
కిందకు దూకుతుంది. గుట్టపై గల బండ కొన్నిచోట్ల మెత్తటి
శిలాపదార్థంతో ఉండడం వల్లే ఈ గుండాలు ఏర్పడ్డాయని
భావిస్తున్నారు. నేరుగా పారే జలపాతం అకస్మాత్తుగా ఒక రంధ్రం
(గుండం)లోకి వెళ్లిపోయి ఇంకో రంధ్రం(గుండం)లోంచి
బయటకొస్తుంది. అంటే మాయమై మళ్లీ పుట్టినట్టు
అనిపిస్తుంది. ఇలాంటి వింత భారతదేశంలో ఈ ఒక్కచోటే
ఉన్నట్లు తెలుస్తోంది. ఈ 108 గుండాలను జీడిగుండం,
పాలగుండం, నేతి గుండం, అమతగుండం, మోక్షగుండం,
కాలగుండం, ధర్మగుండం, పసుపుగుండం,
యమగుండం.. అనే పేర్లతో పిలుస్తారు. సంరక్షణ లేక కొన్ని
గుండాలు దెబ్బతిన్నా మిగిలినవి మాత్రం కనువిందు చేస్తాయి.
ఇంకా రాముని పాదాలు, శంఖు చక్రం, శ్రీరామచంద్రమూర్తి,
గాయత్రి, భైరవస్వామి, శ్రీ సంతోషిమాత, వేంకటేశ్వర ఆలయాలు,
బోగందాని మఠం, మునులు తపస్సు చేసినట్లుగా భావించే
లోయలు ఇక్కడి దర్శనీయ స్థలాలు. గుట్టపై నుంచి చూస్తే
గోదావరినది, పంటపొలాలు, ఎన్టీపీసీ, సింగరేణి బొగ్గుగనుల
దశ్యాలు కట్టిపడేస్తాయి.