ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

AMAZING ENGINEERING ARCHITECTURE - RAMASETHU CONSTRUCTION BY VANARAS IN RAMAYAN


రామ‌సేతు నిర్మాణం ఓ అబ్బురం

రాముడే లేడంటూ ప్రచారం జరుగుతున్న సమయంలో 2002 లో నాసా తమ ఉపగ్రహం ద్వారా తీసిన కొన్ని ఫోటోలను విడుదల చేసింది. భారత్-శ్రీలంకల మధ్య ఒక వారాధి/వంతెన ఉందన్న విషయాన్ని ప్రపంచానికి తెలియపరిచింది. శ్రీ రాముడు లంకను చేరి, రావణ సంహారం చేయడానికి, వానరసేన నిర్మించిన వంతెన అది. దాని పేరే రామ సేతువు.

భార‌త్‌,శ్రీ‌లంక‌ల మ‌ధ్య ఉన్న హిందూ మ‌హాస‌ముద్రంపై మాన‌వ నిర్మిత వార‌ధే ఈ రామ‌సేతు. త‌మిళ‌నాడులోని రామేశ్వ‌రం నుంచి శ్రీ‌లంక‌కు మ‌ధ్య‌గ‌ల స‌ముద్రంపై సుమారు 18 ల‌క్ష‌ల ఏళ్ల క్రితం ఈ సేతు నిర్మిత‌మైంద‌ట‌. నాసా ధ్రువ‌ప‌రిచిన ఉప‌గ్ర‌హ ఛాయాచిత్ర‌మే అందుకు ప్ర‌బ‌ల ఉదాహ‌ర‌ణ అనేది ప్ర‌పంచం న‌లుమూల‌లా గ‌ల హిందువుల అభిప్రాయం. అయితే ఈ రామ‌సేతు నిర్మాణం ఓ అబ్బుర‌మ‌న‌డం మాత్రం అంద‌రూ అంగీక‌రించద‌గ్గ‌ విష‌యం.ఎందుకంటే ఇప్ప‌టి ఏ ఆధునిక సాంకేతిక ప‌రిజ్ఞానం అందుబాటులోలేని ఆ కాలంలోనే ఏకంగా స‌ముద్రంపైనే వంతెన క‌ట్ట‌డం అంటే మాట‌లా మ‌రి.