ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

BRIEF INFORMATION ABOUT TEMPLE - SRI THIRUMURUGAN RAJA ALANKARAM, PALANI, INDIA


PALANI 

మన దేశంలో ఎన్నో ప్రాచీన దేవాలయాలు, పవిత్ర పుణ్యక్షేత్రాలు కొలువై వున్నాయి. అటువంటి వాటిలో ‘పళని’ క్షేత్రం ఒకటి! శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి క్షేత్రాలలో ప్రఖ్యాతి గాంచిన ఈ పళని క్షేత్రం... ఎంతో పురాతనమైంది. దీనిని క్రీస్తుశకం ఏడవ శతాబ్దంలో కేరళరాజు అయిన చీమన్ పెరామాళ్ ఎంతో వైభవంగా నిర్మించారు. ఆ తరువాత పాండ్యులు ఈ మందిరాన్ని అభివృద్ధి చేశారు. ఇది తమిళనాడులోని దిండిగుల్ జిల్లాలో పళని టౌన్ లో వుంది.

స్థలపురాణం :

పార్వతీ పరమేశ్వరులు తమ కుమారులైన బొజ్జ వినాయకుడు, చిన్న సుబ్రహ్మణ్యుడు ఇద్దరిలో విఘ్నాలకు ఎవరిని అధిపతి చేయాలనే ఆలోచనలో మునిగిపోతారు. ఈ నేపథ్యంలోనే ఒకనాడు పార్వతీపరమేశ్వరులు తమ కుమారులను పిలిచి ఒక పరీక్ష నిర్వహిస్తారు. ఆ పరీక్ష ఏమిటంటే... ‘ఈ భూలోకం మొత్తం చుట్టి, అన్ని పుణ్యనదులలో స్నానం చేసి, క్షేత్రాలను దర్శించి ఎవరైతే ముందుగా వస్తారో... వారిని విఘ్నాలకు అధిపతి చేస్తాం’’ అని శంకరుడు చెబుతాడు.

అప్పుడు చిన్నవాడైన సుబ్రహ్మణ్యుడు వెంటనే తన వాహనమైన నెమలిని తీసుకొని భూలోకం చుట్టిరావడానికి బయలుదేరుతాడు. కానీ పెద్దవాడైన వినాయకుడు మాత్రం.. తన తల్లిదండ్రులైన పార్వతీపరమేశ్వరుల చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణలు చేస్తాడు. ఇలా ప్రదక్షిణలు చేయడంవల్ల సకల నదులలో స్నానం చేసిన పుణ్యం వస్తుందనే సత్యాన్ని తెలుసుకుని, కైలాసంలోనే తన తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటాడు. అయితే భూలోకానికి చుట్టిరావడానికి బయలుదేరిన సుబ్రహ్మణ్యుడు ఏ క్షేత్రానికి వెళ్లినా.. అప్పటికే అక్కడ వినాయకుడు చేరుకుని వెనుతిరిగి వస్తున్నట్లు కనబడుతుంటాడు. చివరగా అతను భూలోకాన్ని చుట్టి తన తలిదండ్రులకు చేరుకోగా.. వినాయకుడు అప్పటికే విఘ్నాలకు అధిపతి అయినట్లు తెలుస్తోంది. దీంతో ఓడిపోయిన సుబ్రమణ్యుడు తీవ్ర ఆవేదనకు గురవుతాడు.

ఈ పోటీలో ఓడిపోయిన సుబ్రహ్మణ్యుడు తన తల్లిదండ్రులమీద అలకతో కైలాసం వదిలి, భూలోకంలోకి వచ్చి ఒక కొండ శిఖరం మీద నివాసం వుంటాడు. అప్పుడు శివపార్వతులు ఇద్దరూ అతనిని బుజ్జగించడం కోసం భూలోకంలో అతడు వున్న కొండశిఖరానికి చేరుకుంటారు. అక్కడ పరమశివుడు సుబ్రహ్మణ్యుడిని ఎత్తుకుని ‘‘నువ్వే సకలజ్ఞాన ఫలానివి’’ అని ఊరడిస్తారు. దీంతో ప్రసన్నుడైన సుబ్రహ్మణ్యుడు శాశ్వతంగా ఆ కొండమీదే కొలువు వుంటానని అభయం ఇస్తారు. (సకల జ్ఞాన ఫలంలో (తమిలంలో పలం), నీవు (తమిళంలో నీ) - ఈ రెండూ కలిపి పళని అయ్యింది