ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

AYYAPPA DEEKSHA - HEALTH BENEFITS


అయ్యప్పదీక్షతో ఆరోగ్యం 

స్వామి అయ్యప్ప దీక్షలో ఆరోగ్య రహస్యాలెన్నో దాగి ఉన్నాయి. తెల్లవారు జామున బ్రాహ్మీముహూర్తంలో నిద్రలేచి, చన్నీటి తలస్నానం చేయడం వలన రాత్రివేళ చంద్రకిరణాలు, నక్షత్రకాంతి నీటికి సోకడం వలన నీరు స్వచ్చంగా పవిత్రంగా ఉండి ఉత్సాహాన్ని కలుగజేస్తుంది.

తెల్లవారుఝామున చేసే స్నానాన్ని దేవతా స్నానంగా పేర్కొంటారు. స్నానపు గదిలో స్నానం కన్నా నదీ స్నానం లేక బావివద్ద చేసే స్నానం శ్రేష్ఠం. ప్రవహించే నీరు శరీరాన్ని ఉత్తేజపరుస్తుంది.

తడిచేసిన విభూదిని నుదుటిపై అలంకరించు కోవడం వలన శరీరంలో విద్యుత్ ప్రవహించి నూతన శక్తి వస్తుంది. విభూది, చందనం, కుంకుమ ధరించడం వలన ముఖ వర్చస్సు పెరుగుతుంది. మనసు పవిత్రంగా నిర్మలంగా ఉండడానికి దోహదపడుతుంది.

ముఖక్షవరం చేసుకోకుండా గెడ్డాన్ని పెంచుకోవడం వలన శరీరంపై మమకారం తగ్గుతుంది.

అహంకారాన్ని దూరం చేస్తుంది. చెప్పులు లేకుండా నడవడం వల్ల శబరిమల యాత్రలో అడవులలో కొండలపై సులువుగా నడవడానికి పాదాలు మొద్దుబారి అలవాటు పడతాయి. పాదాలలో రాళ్ళు, రప్పలు వంటివి గుచ్చుకోవడం పాదాలలో వున్నా కొన్ని నాడులు (ఆక్యుప్రెషర్) ఉత్సాహాన్ని కలిగించి మనకు తెలియకుండానే భక్తి పారవశ్యానికి లోనవుతాము.

ప్రతిరోజూ రెండుపూటలా స్నానానంతరం దీపారాధన చేసి పూజ చేయడం వలన అయ్యప్పస్వామి శరణాలు ఉచ్చరించడం వల్ల ఆధ్యాత్మిక చింతన అలవడి భక్తి పారవశ్యాన్ని కలుగజేస్తుంది. తరచూ దేవాలయ సందర్శన, సంత్సంగం, భజనల వల్ల భక్తి భావం పెరిగి మనసంతా నిర్మల చిత్తంతో నిండిపోతుంది. ఉదయం వేళ, సాయంత్రం వేళ రోజూ దేవాలయాలకు, భజనలకు నడచి వెళ్లి రావడం వల్ల తెలియకుండా మార్నింగ్ వాక్, ఈవినింగ్ వాక్ చేసినట్లవుతుంది.

బ్రహ్మచర్య వ్రతం వల్ల బుద్ధిబలం, మనోబలం, దేహబలం పెరుగుతుంది. బ్రహ్మచర్యం వలనే దేహబలంతో ఆంజనేయుడు, బుద్ధిబలంతో నారదుడు మనకు ఆరాధ్యదైవాలయ్యారు. నేలమీద చాపపై నిద్రించడం వలన వెన్నుపూస, దేహము గట్టిపడి, శరీరం స్వాధీనంలో వుండి పర్వతారోహణ సులువుగా చేయడానికి దోహదపడుతుంది.

ఏకభుక్తము సాత్వికాహారము మితంగా భుజించడం వల్ల శరీరము తేలికగా వుండి ఉత్సాహంగా యాత్రలో నడవడానికి తోడ్పడుతుంది. మితంగా ఆహారము ఒక క్రమ పద్ధతిలో శుచి, శుభ్రత పాటించి సకాలంలో తినడం వల్ల ఎక్కడ పడితే అక్కడ బయట ఆహారాన్ని తినకపోవడం వలన ఆరోగ్యం బాగుంటుంది. మద్యమాంసాదుల జోలికి పోకుండా, పోగాగ్రాగడం, జూడమాడడం వంటి దుర్వ్యసనాలకు దూరంగా ఉండడం వల్ల రోగాలు దరికి చేరావు. దీక్షలో కొందరు కాఫీ, టీలు కూడా విసర్జించి పళ్ళు పాలు మాత్రమే స్వీకరించడం వల్ల ధృడంగా ఆరోగ్యవంతులుగా ఉంటారు.