మట్టి పాత్రలు గుర్తున్నాయా?
అల్యుమినియం ( సిల్వర్, సత్తు, ) పాత్రలతో వంట చేయడం మానండి మీ కుటుంబ ఆరోగ్యాన్ని కాపాడండి
లోహ పాత్రలో వంట మీకుటుంబ ఆరోగ్యానికి పెడుతుంది మంట
మీకు తెలుసా బ్రిటీషు ప్రభుత్వం వారు భారత దేశ స్వతంత్ర పోరాట యోధులను అనారోగ్యం పాలు చేయడానికి షుమారు వంద సం!! రాల క్రిందట ప్రప్రధమంగా జైళ్ళల్లో అల్యుమినియం పాత్రలను ప్రవేశ పెట్టారు ఈ పాత్రలలో వంట చేసినా, వండినదానిని నిలువ చేసినా, వీటిలో భోజనం చేసినా ఆ పదార్థాలు విష తుల్యం అవుతాయి, క్రమంగా వారికి బి పి షుగర్ కీళ్ళనొప్పులు కాలేయ సమస్యలు, రకరకాల కాన్సర్ లు మొదలవుతాయి ఆవిధంగా స్వతంత్ర సమరయోధులను నిర్వీర్యం చేయడానికి బ్రిటీషు పాలకులు కుట్ర పూరితంగా అల్యుమీనియం పాత్రలను తొలిసారిగా జైళ్లలో ప్రవేశ పెట్టారు, స్వాతంత్ర్యం వచ్చింది బ్రిటిషు వారు వెళ్ళిపోయారు కాని అల్యుమినియం జైళ్లలో నుంచి మన వంట గదులలోకి చేరింది. ఆ తరువాత కొన్ని సం!! రాలకే అంతవరకూ లేని కొత్త వ్యాదులు షుగర్, కీళ్ళ నొప్పులు, లివర్ వ్యాదులు, కిడ్ని సమస్యలు, గుండె సమస్యలు మన దేశంలో అనూహ్యంగా పెరిగిపోయాయి దీనికి కారణం కేవలం అల్యుమినియం పాత్రలలో వంట చేయడమే అన్న నిజం చాలా పరిశోధనల లో వెల్లడైంది కనుక అందరు ఇప్పటికైనా మేల్కొనండి
మనం ఏం చేయగలం ??? మీకు మట్టి పాత్రలు గుర్తున్నాయా? ఒక్క నిమిషం ఆగండి – మట్టి పాత్రలో వంటచేస్తే చాల రుచిగా ఉంటుంది, ఎక్కువ కాలం చెడిపోకుండా నిలువ ఉంటాయి. కావాలంటే మీ అమ్మమ్మనో, నానమ్మనో అడగండి చెపుతారు. అసలు మట్టిపాత్రలో ఏముందో చూద్దాం పాత్రలు తయారు చేసే బురద మట్టిని సిరామిక్ అంటారు ఈ సిరామిక్ కు వేడి తగలగానే ఇన్ ఫ్రా రెడ్ అనే కంటికికనిపించని కిరణాలు ( ఇన్ విజబుల్ రేస్ ) ఉత్పత్తి అవుతాయి ఈ కిరణాలు ప్రసరించిన ప్రాంతమంతా పూర్తి స్థాయిలో శుద్ధి చేయబడుతుంది, మీకు గుర్తుండే ఉంటుంది ఎవరైనా పిల్లలు బలహీనంగా, తక్కువ బరువుతోపుట్టినా, పుట్టుకతోనే పసిరికలు లేక ఏదైనా అనారోగ్యంతో పుడితే ఇంక్యుబేటర్ అనే పరికరం లో ( లైట్ కింద పెట్టారు అని అంటారు ) కొన్ని గంటలపాటు ఉంచుతారు ఆ పరికరం లో ఉండే లైట్ ద్వారా ఇన్ ఫ్రా రెడ్ కిరణాలను ప్రసరింపజేసి పుట్టిన పిల్లల శరీరాన్ని పూర్తిగా శుద్ధి చేస్తారు కేవలం కొద్ది గంటలలోనే పాపకు పూర్తి స్తాయిలో ఆరోగ్యాన్ని సరి చేయగల శక్తి ఈ కిరనణాలకే ఉంది. మరి మట్టి పాత్రలో రోజు వంట చేస్తే? పురుగు మందుల అవశేషాలను పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసి పదార్ధం లోని పోషక విలువలను ఏమాత్రం వృధా కాకుండా చేయడమేకాక పోషకాలకు అదనపు చురుకుదనం కలిగించి ఆహారాన్ని అమృతతుల్యంగా మారుస్తాయి అందుకే ఈ పాత్రలో చేసిన వంటకాలకు ఎక్కువ రుచి, ఎక్కువ నిలువ సామర్థ్యం చేకూరుతాయి, ప్రకృతి వైద్యం లో బురద స్నానం ( MUD BATH ) గురించి మీకు తెలిసే వుంటుంది శరీరం నిండా బురద పూసి ఎండలో ఉంచుతారు అందులో కూడా ఇవే కిరణాలు ఉత్పత్తి అయి రోగి శరీరాన్ని శుద్ధి చేయడం ద్వారా వ్యాది నుంచి విముక్తి లభిస్తుంది. మట్టి పాత్రలు వాడండి మీకుటుంబ ఆరోగ్యం కాపాడుకోండి