ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

THROAT INFECTION HEALTH TIPS WITH HONEY - LIME JUICE - HERBAL GREEN TEA ETC


గొంతు నొప్పా

* అరగ్లాసు వేణ్నీళ్లలో చెంచా తేనె, చెంచా నిమ్మరసం వేసుకుని తాగాలి. వేడిగా ఉండగానే కొద్దికొద్దిగా తాగితే గొంతు నొప్పి తగ్గుతుంది. అరగ్లాసు పాలల్లో కొద్దిగా మిరియాల పొడి వేసి తాగితే గొంతునొప్పి అదుపులో ఉంటుంది. గొంతునొప్పితో పాటూ జలుబూ ఉంటే అరగ్లాసు పాలల్లో కొద్దిగా పసుపు వేసుకుని తాగాలి.

* ఇలాంటప్పుడు హెర్బల్‌ లేదా గ్రీన్‌టీ తీసుకోవడం మంచిది. దానివల్ల హాయిగా అనిపిస్తుంది. ఆ సమస్య నుంచి ఉపశమనం పొందడమూ సులువవుతుంది. సూప్‌ తీసుకోవడం కూడా మంచి పరిష్కారమే.

* లవంగాలు పంటి నొప్పినే కాదు, గొంతునొప్పినీ అదుపులో ఉంచుతాయి. యాంటీ బ్యాక్టీరియల్‌గానూ వ్యవహరిస్తాయి. అందుకే రెండుమూడు లవంగాలను బుగ్గన పెట్టుకుని వాటినుంచి వచ్చే రసాన్ని చప్పరించాలి. అవి మెత్తగా అయ్యాక నమిలి తినేయొచ్చు.