ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

AVA NUNE OIL TIPS - HEALTH BENEFITS WITH OIL


ఆరోగ్యానికి ఆవ నూనె 

ఆవాలతో ఆరోగ్యపరమైన ప్రయోజనాలున్నాయి కాబట్టే వాటిని తాలింపులో విరివిగా వాడుతూ ఉంటాం. అలాంటి ఆవాల నుంచి తీసిన ఆవనూనెని వంటల్లో వాడటం వల్ల కలిగే ప్రయోజనం రెండింతలు ఉంటుంది. అందుకే ఉత్తర భారతదేశం, బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌లలో ఆవనూనె ఎక్కువగా వాడతారు. 

* న్యూట్రిషనల్‌ ఫ్యాక్ట్స్‌ 

ఆవనూనె - 100గ్రా, కెలోరీలు - 884
మొత్తం కొవ్వు - 153ు, దీన్లో శాచురేటెడ్‌ ఫ్యాట్‌ - 12గ్రా (60ు)
పాలీ శాచురేటెడ్‌ ఫ్యాట్‌ - 21గ్రా, మోనో శాచురేటెడ్‌ ఫ్యాట్‌ - 59గ్రా

• ఆవాల నుంచి 2 నూనెలు

ఆవాలను ఒత్తి వాటి నుంచి కొవ్వుతో కూడుకున్న ‘వెజిటబుల్‌ ఆయిల్‌’, నీళ్లతో కలిపి నూరి ‘ఎసెన్షియల్‌ ఆయిల్‌’- ఇలా రెండు రకాల నూనెలు తయారు చేస్తారు. మొదటిది వంటల్లోకి, రెండవది సౌందర్య సాధనాల్లోకి ఉపయోగిస్తారు. వెజిటబుల్‌ ఆయిల్‌ కాస్త ఘాటుగా ఉంటుంది. అందుకే అందరూ ఈ నూనెను వంటల్లో వాడటానికి ఇష్టపడరు. అయితే దీన్లోని ఒమేగాఆల్ఫా3, ఒమేగాఆల్ఫా6 ఫ్యాటీ యాసిడ్స్‌, విటమిన్‌ ఇ, యాంటిఆక్సిడెంట్స్‌ సమృద్ధిగా ఉంటాయి.

• ఆరోగ్యపరమైన ప్రయోజనాలు

వంటల్లో ఆవనూనె వాడకం వల్ల గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఈ నూనె వాడకం వల్ల బ్యాడ్‌ కొలెస్టరాల్‌ తగ్గి గుడ్‌ కొలెస్టరాల్‌ పెరుగుతుంది. అలాగే ట్రైగ్లిసరైడ్స్‌, రక్తంలోని కొవ్వు నిల్వలు కూడా తగ్గుతాయి. ఫలితంగా స్థూలకాయం దరి చేరదు.

ఆవనూనె వాడకం వల్ల మూత్రపిండాల సమస్యలకి దూరంగా ఉండొచ్చు.

ఈ నూనె వాడకం వల్ల హైపర్‌ థైరాయిడ్‌ రాకుండా ఉంటుంది.
ఆవనూనెను ఆహారంతో తీసుకుంటే ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు దరి చేరవు.

జీర్ణవ్యవస్థతో సంబంధం ఉన్న చిన్నపేగు, జీర్ణాశయం, పెద్ద పేగుల్లో బ్యాక్టీరియాలను హరిస్తుంది.

• వంటకాల్లో ఇలా వాడాలి

* ఈ నూనెను నేరుగా కాకుండా పొగలొచ్చేవరకూ వేడిచేసి చల్లార్చి వాడాలి. వేడి చేయటం ఇష్టంలేని వాళ్లు ఆవనూనెను నెయ్యి, వేరుశనగ నూనెలతో కలిపి కూడా వాడొచ్చు.

* కూరలు, పకోడీలాంటి వేపుళ్లు, పచ్చళ్ల తయారీకి ఉపయోగించొచ్చు.