ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

BE HEALTHY AND STRONG WITH EATING GUAVA FRUIT REGULARLY - JAMA PANDU HEALTH BENEFITS


జామ పండ్లు ఎక్కువగా తినండి...మీ ఆరోగ్యాన్ని బలపరుచుకోండి

మనం మన ఆరోగ్యాన్ని బలపరుచుకోవటానికి ఎంతో శ్రమ పడతాం. ఏన్నో ఆరోగ్య సూత్రాలను పాటిస్తాం. అందులో ఒకటి పండ్లు తినడం. ఐతే ఏ పండు తింటే మనం ఆరోగ్యాన్ని బలపరుచుకోవచ్చో మనకు ఖచ్చితంగా తెలియదు. మనకు నచ్చిన పండునో, లేక బలానా పండు ఆరోగ్యానికి మంచిదని ఎవరో చెబితేనో, ఎక్కడో చదివితేనో ఆ పండ్లను ఎక్కువగా వాడతూ ఉంటాము.
ఇక మీదట అలా చేయ వలసిన పని లేదు. పండ్లలోనే జామ పండు మన ఆరోగ్యాన్ని బలపరచటానికి ఎక్కువగా ఉపయోగ పడుతుందని హైదరాబాద్ లోని నేషనల్ ఇన్స్ టి ట్యూట్ ఆఫ్ న్యూట్రీషన్ వారు పండ్ల మీద చేసిన పరిశోధనలో తెలిసింది.
ఎలాగంటే, మనం ఆరోగ్యంగా ఉండటానికి మనకు యాంటీ-ఆక్సిడెంట్స్ అతి ముఖ్యంగా కావలసి యున్నది. మన శరీరంలో యాంటీ-ఆక్సిడెంట్స్ ఎంత ఎక్కువగా ఉంటే మనం అంత ఆరోగ్యంగా ఉంటాము.ఎందుకంటే వయసు పెరిగిన కొద్దీ మనలో ఉన్న కొన్ని జీవ కణాలు కూడా పాడవుతూ ఉంటాయి. యాంటీ-ఆక్సిడెంట్స్ ఈ జీవ కణాలు పాడైపోకుండా కాపాడతుంది. ఇంతే కాకుండా వయసుతో పాటు మనకు ఏర్పడే డీ-జెనరేటివ్ వ్యాధులనూ, క్యాన్సర్ వ్యాధినీ మరియూ ముసలితనాన్ని(Early Aging) అరికట్టడంలో సహాయపడుతుంది. కనుక ఈ యాంటీ-ఆక్సిడెంట్స్ మనకు చాలా అవసరమన్నమాట. అదీ ప్రక్రుతి ఆకారంలో దొరికితే చాలా మంచిది.
జామ పండులో యాంటీ-ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగానూ, పైనాపిల్ పండులో అతి తక్కువగానూ ఉన్నట్లు పరిశోధనలో తెలిసింది.
ఇండియన్ ప్లం, మామిడి పండు, దానిమ్మ పండు, సీతాఫలం మరియూ ఆపిల్ పండ్లలో యాంటీ-ఆక్సిడంట్స్ ఎక్కువగా ఉన్నదని పైనాపిల్,అరటి పండు, బొప్పాయి, పుచ్చకాయ మరియూ ద్రాక్ష పండ్లలో తక్కువగా ఉన్నదని తెలిపేరు.
ఖరీదైన పండ్లు ఆరోగ్యానికి మంచిదని అనుకుంటాము. కానీ తక్కువ ఖరీదు గల జామ పండు ఆరోగ్యానికి అతి మంచిదని తెలిసింది. ఈ క్రింది పట్టీలో ఏ ఏ పండ్లలో ఎంత శాతం యాంటీ-ఆక్సిడంట్స్ ఉన్నదో తెలుపబడింది.(100 గ్రాముల పండులో ఎన్ని మిల్లిగ్రాముల యాంటీ-ఆక్సిడంట్స్ ఉన్నదో తెలుపబడింది).
జామ పండు....496.
ఇండియన్ ప్లం....330
సీతాఫలం....202
మామిడి పండు....170
దానిమ్మ పండు....135
ఆపిల్ పండు....123
ద్రాక్ష పండు... 85
బొప్పాయ పండు....50
అరటి పందు....30
ఆరెంజ్ పండు...24
పుచ్చకాయ...23
పైనాపిల్....22
కనుక ఇక మీదట మీకు పండు తినాలనిపిస్తే జామ పండుకు మొదటి చాయిస్ ఇవ్వండి. మీ ఆరోగ్యాన్ని బలపరుచుకోండి.