ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

SOLAR ECLIPSE ON 09-03-2016 - SURYA GRAHANAMU ON 09-03-2016


పాదాధిక గ్రాస్త సూర్యగ్రహణం :
స్వస్తి శ్రీ చాన్ద్రమాన మన్మధ నామ సంవత్సర మాఘ బహుళ అమావాస్య బుధవారం 09-03-2016 తేదిన పూర్వాభాద్ర నక్షత్ర ద్వితీయ పాదంలో కుంభ రాశియందు కేతుగ్రస్త పాదాధిక సూర్య గ్రహణం. ఈ గ్రహణం గుజరాత్, మహారాష్ట్రలో తప్ప భారత దేశం అంతటా కన్పించును.

ఈ గ్రహణము మనకు ఉదయం 04.49 ని. 02 సె. కు ప్రారంభమయి 10.05 ని. 42 సె. ల వరకు ఉంది.

హైదరాబాదులో గ్రహణ స్పర్శ కలం ఉదయం 6:29నిలకు గ్రహణ మోక్షకాలం ఉదయం 6:47నిలకు.

ఈ గ్రహణం సుమారు 28 ని.లు మాత్రమే కనిపించును.

ఈ గ్రహణాన్ని"గురు" సంబంధిత పునర్వసు , విశాఖ , పూర్వాభాద్ర నక్షత్రం వారు మరియు మిధున రాశి, తులారాశి, కుంభరాశి వారు చూడకూడదు. గ్రహణానంతరము యధావిధిగా కార్యక్రమములను జరుపుకోవచ్చు.

ఆబ్దికాలు పెట్టుకునే వారు 10.00 గంటల తరువాత వంట ప్రారంభించి '' ప్రత్యాబ్దికాలు" చేసుకోవచ్చు.

దేవాలయాలు ముందు రోజు సాయంత్రం 07.00 గం.ల నుండి మూసివేసి గ్రహణం తరువాత శుద్ధి చేసి నిత్యపూజాదికములు నిర్వర్తించుకోవాలి.