ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

HEALTH BENEFITS WITH MUNAGA - DRUMSTICKS IN TELUGU


మునగ తింటున్నారా!

రుచిలోనూ, పోషకాలను అందించడంలోనూ మునగే మేటి. దానిలోని మరిన్ని ప్రత్యేకతలు, ప్రయోజనాలను తెలుసుకుంటే ఇంకా ఇష్టంగా తినేయొచ్చు కదా! 

మహిళలు గర్భం దాల్చినప్పుడు మునగను తప్పనిసరిగా తీసుకోవాలి. దీనివల్ల ప్రసవానికి ముందు, తరవాత వచ్చే ఎన్నో సమస్యలు దూరంగా ఉంటాయి. పాలు బాగా పడతాయి. దీని ఆకులు, పూలకు యాంటీబ్యాక్టీరియల్‌ గుణాలున్నాయి. వీటిని ఆహారంగా తీసుకుంటే విటమిన్‌ సి అధికమోతాదులో శరీరానికి అందుతుంది. ఫలితంగా ఇన్ఫెక్షన్లు దరిచేరవు. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. నెలసరి సమయంలో వచ్చే నొప్పులు అదుపులో ఉంటాయి.

* ఆరోగ్యకరమైన ప్రొటీన్‌లు, ఖనిజాలు మునగలో అధిక మోతాదులో లభిస్తాయి. దీనిలోని క్యాల్షియం, ఐరన్‌, ఇతర విటమిన్‌లు ఎముకలు బలంగా మారేందుకు తోడ్పడతాయి. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల పిల్లల్లో ఎముక సాంద్రత పెరుగుతుంది.

* మునగాకు, కాయలు రక్త శుద్ధికి తోడ్పడే గుణాలను కలిగి ఉంటాయి. ముఖ్యంగా మధుమేహ బాధితులు మునగ ఆకులకు ఆహారంలో ప్రాధాన్యం ఇవ్వడం వల్ల రక్తంలోని గ్లూకోజ్‌ స్థాయులు నియంత్రణలో ఉంటాయి. పిత్తాశయం పనితీరు మెరుగుపడుతుంది.

* గొంతునొప్పీ, దగ్గూ, గొంతులో ఏదో అడ్డుపడ్డట్లు అనిపించడం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నప్పుడు వేడివేడిగా ఒక కప్పు మునగ సూప్‌ తాగి చూడండి. ఈ సమస్యలన్నీ ఇట్టే తొలగి పోతాయి. శ్వాసకోస ఇబ్బందులతో బాధపడేవారు మునగాకు, మునక్కాయలను తరచూ తీసుకుంటే మంచిది. మునగ శరీరంలోని వ్యర్థాలను శక్తిమంతంగా బయటకు పంపించగలుగుతుంది.