ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

SKIN CARE WITH NEEM - BEAUTY TIPS WITH NEEM LEAVES



వేపతో చర్మానికి తేమ!

వేపాకు.. మనం కావాలనుకోవాలేగానీ.. ఎక్కడైనా దొరుకుతుంది. ఆకుల్లో ఉండే సుగుణాలు అన్నీ ఇన్నీ కాదు. 

* ఎలాంటి ఉపయోగాలు పొందొచ్చంటే....

ఈ కాలంలో.. చర్మం వూరికే తేమను కోల్పోతుంది. అలాంటప్పుడు వేపాకులను మరిగించిన నీళ్లతో ముఖం కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల చర్మానికి తేమ అందడమేకాదు... యాక్నె, ఇతర ఇన్‌ఫెక్షన్లు తగ్గుముఖం పడతాయి. వేపాకును ముద్దగా చేసి అందులో కొద్దిగా పసుపు చేర్చి ఒంటికి నలుగులా పెట్టుకుని స్నానం చేయడం ద్వారా వేసవిలో వచ్చే పొక్కులూ, చెమట కాయల బెడదను నివారించవచ్చు.

* మగ్గునీళ్లలో గుప్పెడు వేపాకులను వేసి బాగా మరిగించాలి. తరవాత ఆ నీళ్లని వడకట్టి.. సీసాలో తీసుకుని ఫ్రిజ్‌లో పెట్టాలి. ప్రతిరోజూ స్నానించే నీళ్లలో ఈ వేపకషాయాన్ని కాస్త కలపాలి. చెమట వాసన దూరం చేస్తుంది.

* చుండ్రు సమస్య ఇబ్బంది పెడుతుంటే.. వేపాకులు వేసి మరిగించిన నీళ్లని వడకట్టి.. కండిషనర్‌లా ఉపయోగిస్తే ఫలితం ఉంటుంది. వేప కషాయంలో ముంచిన దూదితో రోజూ ముఖాన్ని తుడుచుకుంటే పిగ్మెంటేషన్‌, బ్లాక్‌హెడ్స్‌ తొలగిపోతాయి.