ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

AMAZING BENEFITS OF DRINKING HOT WATER


వేణ్నీళ్లతో మేలెంతో....!

చల్లగా ఉన్నప్పటికంటే నీళ్లు కాస్త వేడిగా ఉన్నప్పుడు తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చంటున్నారు నిపుణులు...

* బరువు తగ్గాలనుకునేవారికి ఇవెంతో మేలుచేస్తాయి. వేడినీళ్లు తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత కొద్దిగా పెరుగుతుంది. దాంతో జీవక్రియారేటూ ఇనుమడిస్తుంది.

* వేడి నీళ్లూ అధిక ఆకలిని అదుపులో ఉంచుతాయి. ఇవన్నీ బరువుని అదుపులో ఉంచేందుకు ఉపయోగపడతాయి.

* శరీరాన్ని తాజాగా కనిపించేలా చేయడంతోపాటు యాక్నె వంటి సమస్యలకు వీటితో చుక్కపెట్టొచ్చు. వీటితో చర్మం సాగేతత్వం పెరుగుతుంది. ముడతలు, పొడిచర్మం, నల్లటి వలయాలు వంటివన్నీ అదుపులో ఉంటాయి. వేడి నీళ్లకు కాస్త తేనె, నిమ్మరసం కలిపి తీసుకోవడం వల్ల వ్యాధినిరోధక శక్తీ పెరుగుతుంది.

* వేడినీళ్లు మీ శరీరంలోని చెడువ్యర్థాలని తొలగిస్తాయి. రాత్రిపూట ఆహారంతోపాటూ గోరువెచ్చని నీళ్లను తీసుకోవడం మంచిది. మసాలా పదార్థాలు ఎక్కువగా తీసుకున్నప్పుడు గ్లాసు గోరువెచ్చని నీళ్లు తాగితే చక్కగా జీర్ణమవుతుంది. మలబద్ధకం అదుపులోకి వస్తుంది.

* జలుబు, దగ్గు వంటి సమస్యలకు పరిష్కారంగానూ వేడినీటిని తీసుకోవచ్చు. శ్వాసకోశ ఇబ్బందుల నుంచి ఉపశమనం ఉంటుంది. ఒళ్లు నొప్పులుగా అనిపించినప్పుడు వేడినీళ్లు తీసుకుంటే రక్తప్రసరణ సక్రమంగా జరిగి ఉపశమనం లభిస్తుంది.