ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

HEALTH BENEFITS WITH AMUDHAM OIL


ఆముదం నూనెతో మర్దన చేస్తే ఫలితాలు ఏమిటి…?

- లేత పసుపు రంగులో ఉండే ఆముదం విరేచనకారిగా, లూబ్రికెంట్‌గా నూనెతో కూడిన ఉత్పత్తుల తయారీలో ఉపయోగపడుతూ ఉంటుంది. ఆముదం విత్తనాల నుంచి తీసే ఈ నూనె చిక్కగా, ఘాటుగా ఉంటుంది. దీనికి బ్యాక్టీరియాను చంపే గుణం కూడా ఉంటుంది. సౌందర్య సాధనాల తయారీతో పాటు ఔషధాల తయారీలో కూడా ఉపయోగించే ఆముదం ప్రయోజనాలు బోలెడన్ని. నులి పురుగులు, మలబద్ధకం నివారణ కోసం ఆముదాన్ని విరివిగా వాడతారు.

- 4 టీ స్ఫూన్ల కొబ్బరి నూనెతో 2 టీ స్ఫూన్ల ఆముదం కలిపి పొట్ట మీద పట్టు వేసి రాత్రంతా ఉంచాలి. ఇలా చేస్తే ఉదయానికి నులిపురుగులు పోతాయి. ఆముదంతో మర్దన చేస్తే కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. ఆముదంలో ముంచిన వస్త్రాన్ని కీళ్ళ మీద ఉంచి ప్లాస్టిక్ పేపరుతో కట్టి, దాని మీద వేడి నీళ్ల బాటిల్ గంట పాటు ఉంచితే కీళ్ల నొప్పులు తగ్గుతాయి.