ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

RASAUSHADHALU - VIKARALU - HEALTH TIPS


రసౌషధాలు కలిగించే వికారాలను తగ్గించుటకు చిట్కాలు

కొంతమంది ఆయుర్వేద వైద్యులు తమదగ్గరికి వచ్చే రోగులకు రసౌషదాలు ఇవ్వడం సాధారణ విషయం . రసఔషధాలు అనగా పాదరసం మరియు కొన్ని లోహాలను శుద్ధిచేసి తగు మోతాదులో ఇవ్వవలెను. వైద్యుడి ఇచ్చేటువంటి లోహం సరిగ్గా శుద్దిచేయకుండా ఇవ్వడం వలన రోగి శరీరం పైన తీవ్ర ప్రభావం ఉంటుంది. 

కొంతమంది తెలిసో తెలియకో సరిగ్గా శుద్ది చేయనటువంటి ఔషధాలు సేవించినప్పుడు కలిగే విపత్కర పరిస్థితులకు విరుగుళ్లు తెలుసుకొవడం అటు రోగులకు , ఇటు వైద్యులు తెలుసుకొవడం చాలా ఉత్తమం.

ఇప్పుడు మీకు వాటి గురించి వివరంగా తెలియచేస్తాను .

స్వర్ణభస్మ వికార శాంతి. -

దోషయుక్తమ్ అయిన స్వర్ణభస్మం సేవన చేసిన మనిషికి పటికబెల్లం మరియు కరక్కాయ సమముగా చూర్ణం చేసి మూడుదినములు సేవించిన స్వర్ణభస్మం సేవన వలన కలిగే వికార శాంతులు అన్నియు నిర్మూలించబడును.

తామ్రభస్మ వికారశాంతి -

అడివి ధాన్యముల బియ్యము , కలకండ వీనిని సమానంగా తీసుకుని నీటితో నూరి మూడు దినములు ప్రాతఃకాలం నందు సేవించిన దోషయుక్తమ్ అగు తామ్రభస్మం సేవించుట వలన కలుగు వికారములు నశించును.

నాగభస్మ వికారశాంతి -

వస , కరక్కాయలు , కలకండ వీటిని సమంగా చూర్ణం చేసి మూడుదినములు సేవించిన దోషయుక్తం అగు సీసభస్మం సేవించడం వలన కలుగు వికారములు నివృత్తి అగును.

వంగభస్మ వికారశాంతి -

మద్దివేరు పట్ట , కలకండ వీనిని సమముగా చూర్ణం చేసి మూడు దినములు సేవించిన దోషయుక్తం అగు వంగభస్మ సేవన వలన కలిగెడు వికారాలు అన్నియు నివృత్తి అగును.

త్రిధాతు భస్మ వికార శాంతి -

దోషయుక్తం అగు త్రివంగభస్మం సేవించిన నరుడు కృశించును. అటువంటి మనిషి త్రిఫలచూర్ణం సేవించవలెను .

లోహభస్మ వికారశాంతి -

సైంధవ లవణం , తెల్లతెగడ వీటిని సమబాగాలుగా చూర్ణం చేసి అందు ఉష్ణోదకమ్ కలిపి సేవించిన లోహాభస్మం సేవన వలన కలిగెడి వికారాలు అన్నియు తొలగిపోవును.

మండూర వికార శాంతి -

కరక్కాయల చూర్ణం నకు సమముగా తేనే కలిపి సేవించిన మండూర వికారం శాంతించును.

ఇనుప భస్మ వికారశాంతి -

తెల్లగరిక రసం నకు సమానంగా కలకండ చూర్ణంను కలిపి సేవించిన దోషయుక్తం అగు ఇనుపభస్మం వలన కలిగెడు సమస్యలు అన్నియు నివారణ అగును.

హరితాళకం వికారశాంతి -

దానిమ్మ విత్తుల రసమును లొపలికి సేవించుట వలన కలిగెడు వికారాలు నశించును.

పాదరస వికారశాంతి -

సరిగ్గా శుద్ది చేయనటువంటి పాదరసం తీసుకొవడం వలన చాలా భయకంర రోగాలు కలుగుతాయి . అటువంటి సమయములో శుద్ది చేసిన గంధకము సేవించవలను. రెండు మాషముల ప్రమాణం కలిగిన శుద్ధ గంధకమును తమలపాకులో నుంచి దోషయుక్తం అగు పాదరసం చేత కలిగిన వికారం పోవును .

మరియొక పద్ధతి -

ద్రాక్షాపండు , బూడిద గుమ్మడి బద్దలు , తులసి సొంపు, లవంగాలు , నాగకేసరములు వీటిని సమముగా చూర్ణం చేసి వాటిని సమముగా శుద్ది చేసిన గందకము గ్రహించి పాలలొ రెండుతులములు ప్రతిదానిని వేసి కాచి ప్రాతఃకాలం నందు సేవించుచున్న దోషయుక్తం అగు పాదరస సేవన వలన కలిగెడి వికారశాంతి నివృత్తి అగును. అదే విదముగా తమలపాకు రసము , గుంటల గర ఆకు రసం , తులసి ఆకు రసం , మేకపాలు వీనిని ఒకొక్క ప్రస్థము చొప్పున కలిపి సర్వగములకు రెండు జాముల వరకు మర్దన చేయవలెను . తరువాత చల్లటి నీటితో స్నానం చేయవలెను . ఇలా మూడు దినములు చేసిన దోషయుక్తం అగు పాదరస సేవన వలన కలిగెడి వికారం నివృత్తి అగును.


************** కాళహస్తి వెంకటేశ్వరరావు **************