ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

DASARA FESTIVAL AVATHARS - SRI BALATHRIPURA SUNDHARI DEVI - 02-10-2016


శరన్నవరాత్రుల ఉత్సవాల్లో రెండవ రోజు దుర్గమ్మ బాలాత్రిపురసుందరిగా దర్శనము ఇస్తుంది. అమ్మవారిని ఈనాడు బాల త్రిపుర సుందరి అలంకారంతో పూజిస్తారు. త్రిపురుని భార్య త్రిపుర సుందరీ దేవి, అంటే ఈశ్వరుడి భార్య అయిన గౌరి దేవి అని అర్ధం. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం బాలా త్రిపుర సుందరిదేవి ఆధీనంలో ఉంటాయి. అభయ హస్త ముద్రతో, అక్షమాల ధరించిన ఈమెను ఆరాధిస్తే మనో వికారాలు తొలగిపోతాయి. నిత్య సంతోషం కలుగుతుంది.
త్రిపుర సుందరిదేవి శ్రీ చక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత. షొడస విద్యకు ఈమే అధిష్టాన దేవత.కాబట్టి ఉపాసకులు త్రిపుర సుందరి దేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు.
త్రిపుర సుందరి అని అమ్మని పిలవడములో ఒక రహస్యము ఉంది. అమ్మ, అయ్య వారి దాంపత్యం భలే గమ్మత్తుగా ఉంటుంది. ఇవిడేమో త్రిపుర సుందరి దేవి.....అయ్య వారు ఎమో త్రిపురాంతకుడు...ఆది దంపతులు...వారి తత్వము కూడా అటువంటిది.
త్రిపుర సుందరి అంటే " మనలోని ముడు అవస్థలూ...జాగృత్త్ , స్వప్న , సుషుప్తి!
ఈ ముడు అవస్థలు ...లేద పురములకు బాల అధిష్ఠాన దేవత! 
ఈ ముడు పురములను శరీరముగా చేసుకొని, ఈ జగత్తు అంతటిని అనుభవింప చేస్తు ...."బాలగా.."....అమ్మవారు వినొదిస్తుంది. మానవుడు ఎన్ని జన్మలు ఎత్తినా సరే..
, ఈ ముడు అవస్థలులోనే తిరుగుతు ఉంటాడు. కేవలం ఉపాధులు మాత్రమే మారుతాయి.
అటువంటి తల్లి ఈ రూపములో మనలోనే ఉంది....ఆవిడ ఆత్మ స్వరూపురాలు....ఆవిడను పూజిస్తే....ఙ్ఞానము కలిగి .. ...తానె శివ స్వరూపము తో...చైతన్యము ప్రసాదించి...మోక్షమునకు...అనగా పరబ్రహ్మ తత్వం వైపు నడిపిస్తుంది...ఈ కరుణా మయి..
సత్సంతానాన్ని అనుగ్రహించే దేవతగా త్రిపుర సుందరిదేవి భక్తుల పూజలు అందుకుంటోంది. 
ఈ రోజు రెండు నుండి పది సంవత్సరములు లోపు కలిగిన బాలికలను అమ్మవారి స్వరూపముగా పూజ చేసి కొత్త బట్టలు పెట్టాలి. 

శ్రీ మాత్రే నమః