ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

CONTROL HIGH BLOOD PRESSURE - B.P WITH THE FOLLOWING FRUITS AND VEGETABLES


హై బీపీ ఉందా… అయితే ఈ 9 ప‌దార్థాల‌ను ఖ‌చ్చితంగా తింటూ ఉండండి.!!

హై బీపీ… నేడు ప్ర‌పంచ వ్యాప్తంగా అధిక శాతం మంది ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల్లో ఇది కూడా ఒక‌టి. నిత్యం వివిధ సందర్భాల్లో ఎదుర్కొనే ఒత్తిడి, ఆందోళన, పనిభారం, ఇతరత్రా అనేక సమస్యల కారణంగా నేడు చాలా మంది హై బీపీ బారిన పడుతున్నారు. దీంతో అది గుండె జబ్బుల వంటి ఇతర అనారోగ్యాలకు దారి తీస్తోంది. అయితే రోజూ వ్యాయామం చేయడంతోపాటు కింద ఇచ్చిన పలు ఆహార పదార్థాలను తీసుకుంటే దాంతో హై బీపీ బారి నుంచి బయట పడవచ్చు. తద్వారా మెరుగైన ఆరోగ్యం పొందవచ్చు. ఆ ఆహార పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

high-bp-1
ద్రాక్ష… 
ద్రాక్ష పండ్లలో పొటాషియం, పాస్ఫరస్ ఎక్కువగా ఉంటాయి. ఇవి హై బీపీని ఇట్టే తగ్గిస్తాయి. పొటాషియం సహజ సిద్ధమైన డై యురెటిక్ అవడం వల్ల కిడ్నీల నుంచి వ్యర్థ పదార్థాలు వెళ్లిపోతాయి. ప్రధానంగా సోడియం తొలగింపబడుతుంది. దీంతో కిడ్నీలు ఆరోగ్యంగా ఉండడమే కాదు, హైబీపీ కూడా తగ్గుతుంది.
అరటి పండ్లు… 
పొటాషియం అధికంగా ఉండే పదార్థాల్లో అరటి పండు మొదటి స్థానంలో నిలుస్తుంది. హై బీపీ ఉంటే ఒక అరటి పండు తిన్నా చాలు, వెంటనే బీపీ అదుపులోకి వచ్చేస్తుంది. దీంతోపాటు అరటి పండ్లలో విటమిన్ బి6, విటమిన్ సి, మెగ్నిషియం కూడా సమృద్ధిగానే ఉంటాయి. అందువల్ల బీపీ నియంత్రణలో ఉంటుంది.


ఉల్లిపాయలు… 
హై బీపీని అదుపు చేయడంలో ఉల్లిపాయలు అమోఘంగా పనిచేస్తాయి. వీటిలో అడినోసిన్ అనే మజిల్ రిలాక్సంట్ ఉంటుంది. ఇది బీపీని కూడా అదుపులోకి తెస్తుంది. నిత్యం ఒక పచ్చి ఉల్లిపాయను అలాగే తింటున్నా లేదంటే దాన్ని జ్యూస్ తీసుకుని తాగినా రెండు వారాల్లో హై బీపీ తగ్గుముఖం పడుతుంది.
వెల్లుల్లి… 
రక్త నాళాల్లో పేరుకుపోయిన కొవ్వును తొలగించి రక్త సరఫరాను మెరుగు పరిచే గుణాలు వెల్లుల్లిలో ఉన్నాయి. దీని వల్ల బీపీ కూడా అదుపులోకి వస్తుంది. నిత్యం రెండు వెల్లుల్లి రెబ్బల్ని తింటుంటే చాలు, హై బీపీ తగ్గుముఖం పడుతుంది. లేదంటే వాటిని జ్యూస్ తీసుకుని అయినా తాగవచ్చు. దీంతో శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ కూడా పోతుంది. గుండె సమస్యలు రావు.
high-bp-2
కొబ్బరినీళ్లు… 
సోడియం, కాల్షియం, విటమిన్ సి వంటి అనేక పోషకాలతోపాటు కొబ్బరి నీటిలో పొటాషియం కూడా పుష్కలంగానే ఉంటుంది. ఇది హై బీపీని వెంటనే అదుపులోకి తెస్తుంది. కొన్ని కొబ్బరి నీళ్లు తాగితే చాలు, బీపీ నియంత్రణలోకి వస్తుంది.
పుచ్చకాయ… 
పుచ్చకాయల్లో అర్గినైన్ అనే అమైనో యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఇది హై బీపీని కంట్రోల్ చేస్తుంది. కొద్దిగా పుచ్చకాయ తిన్నా లేదంటే దాని జ్యూస్ తాగినా చాలు, బీపీ అదుపులోకి వస్తుంది. అంతేకాదు రక్త గడ్డకుండా చూసే గుణాలు పుచ్చకాయలో ఉన్నాయి. దీని వల్ల రక్త సరఫరా మెరుగు పడుతుంది.
కొత్తిమీర… 
యాంటీ మైక్రోబియల్, యాంటీ డిప్రెసెంట్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు కొత్తిమీరలో ఉన్నాయి. ఇవి బ్లడ్ షుగర్, కొలెస్ట్రాల్, బీపీలను తగ్గిస్తాయి.
పుదీనా… 
పుదీనాలోని ఔషధ గుణాలు రక్త నాళాల్లో పేరుకుపోయిన కొవ్వును తొలగిస్తాయి. దీంతో రక్త సరఫరా మెరుగుపడి బీపీ అదుపులోకి వస్తుంది.
నిమ్మకాయ… 
హై బీపీ ఉంటే కొంత నిమ్మరసం తాగినా చాలు వెంటనే బీపీ అదుపులోకి వస్తుంది. ఇందులో విటమిన్ సితోపాటు మరెన్నో పోషకాలు ఉండడం వల్ల రక్త సరఫరా కూడా మెరుగు పడుతుంది.