ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

OKA CHANDAMAMA KATHA


చందమామ కధ.!
.
పూర్వం విష్ణు శర్మ అనే ఒక రాజుండే వాడు.అతడికి విపరీత మయిన కథల పిచ్చి.తన ఆస్థానం లో వున్న వారి నందరినీ కథలు చెప్పమని సతాయించేవాడు.అందరికీ విసుగై పోయింది. మంత్రి రాజుతో సంప్రదించి రాజుకు కథలు చెప్పడానికి ఎవరైనా రావచ్చుననీ తగిన బహుమానం యివ్వ బడుతుందనీ టముకు వేయించాడు.
ఎంతమందో వచ్చి ఆయనకు ఎన్నో కథలు వినిపించేవారు.ఎన్ని చెప్పినా ఆయన యింకా చెప్పమని అడిగే వాడు.అతనికి విసుగే వుండేది కాదు.ఎంత మంది వచ్చినా రాజును తృప్తి పరచ లేక పోయారు.నాకు కథలు చెప్పి తృప్తి పరిస్తే సగం రాజ్యమిస్తాను లేకుంటే మరణ శిక్ష అని ప్రకటించాడు.కొంత మంది యువకులుసగం రాజ్యం ఆశతోవచ్చారు ఆ యనను సంతృప్తి పరచలేక మరణించారు.ఆఖరుకు మరణ భయం తో ఎవరూ రావడం లేదు.రాజు మంత్రిని పదే పదే ఈ విషయం గురించి 
సతాయించే వాడు.

ఒకనాడు ఒక బీద బ్రాహ్మణుడు నేను మీకు కథ చెప్తానని వచ్చాడు.సరే నని రాజు కూర్చున్నాడు.ఆ బ్రాహ్మణుడు కథ చెప్పడం మొదులు పెట్టాడు.ఒక వూరిలో ఒక రైతు ఉండేవాడు అతను తనపొలం లో జొన్నలు పండించాడు.ఆ సారి వర్షాలు బాగా పడి విపరీత మైన పంట పండింది.ఆ రైతు ఒక పెద్ద గోదాము కట్టించి వంద పుట్ల జొన్నలను అందులో వుంచాడు.దాన్నిఅన్ని పక్కలనుంచీ మూసివేసినా ఒక మూల చిన్న కంత వుండి పోయింది.అది ఒక పిట్ట చూసింది.ఆ కంత లోనుంచి లోపలి పోయి తనముక్కున ఒక గింజ కరుచుకొని పోయింది మళ్ళీ వచ్చి ఒక గింజ ముక్కున కరుచుకొని పోయింది యిది చూసి మిగతా పిట్టలు కూడా వచ్చి ఒక్కో గింజా ముక్కున కరుచుకొని పోతూ వున్నాయి.ఒక పిట్టా ఒక గింజ,ఒకపిట్టా 
ఒకగింజ అంటూ అదే మాట చెప్తూ వచ్చాడు దినాలు గడుస్తున్నా అదే చెప్తూ వున్నాడు.రాజుకు విసుగు పుట్టింది తరువాతి కథ చెప్పకుండా యిదేమిటి?అని విసుక్కున్నాడు.అందుకు అతను మహారాజా!మరి అన్ని పుట్ల ధాన్యం అయిపోవాలికదా! ఆ తరువాతే మిగతా కథ అని మరీ ఒక పిట్టా ఒక గింజ అని మొదులు పెట్టాడు..రాజుగారికి తల బొప్పి కట్టింది.యింక చాలించు మహా ప్రభూ అన్నాడు.అందుకు వాడు 
ఎలా చాలించేది ప్రభూ!చాలిస్తే నా చావు తప్పదు కదా! అని మరీ మొదులు పెట్టాడు.రాజుకు విసుగు పుట్టి 
యిక మీదట కథలు చెప్పమని అడగను నీకు అర్ధ రాజ్యం యిస్తాను దయచేసి యింక చాలించు అన్నాడు.
అప్పుడు ఆ బ్రాహ్మణుడు అలా అన్నారు బాగుంది.యింకేప్పుడూ కథలు చెప్పమని ఎవరినీ యిబ్బంది పెట్టకండి.అని అర్ధ రాజ్యం నాకేమీ వద్దు కొంత ధనం యిప్పించండి చాలు అన్నాడు.అప్పుడు రాజు అతనికి 
జీవితానికి సరి పడా ధనం యిచ్చి పంపించాడు.అందరూ ఈ కథల పీడ వదిలించి నందుకు ఆ బ్రాహ్మడిని అభినందించి ఊపిరి పీల్చు కున్నారు..అప్పటి నుండీ ఆ రాజు బుద్ధి తెచ్చుకొని ప్రజానురంజకంగా పరిపాలించాడు.

అధికారం చేతిలో వుంది కదా! అని ఎవరు కూడా ప్రజలను,తనక్రింది అధికారులనూ సతాయించ కూడదు.ఏ విషయం లోనైనా సరే.