ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

GANESH PUJA SPECIAL ARTICLE - PANCHA PATRAMULU


పంచ పత్రములు .....!!!

1. తులసి. 2. బిల్వము. 3.శమీపత్రము. 4. మాచీ పత్రము. 5. రుద్రజడ
బిల్వముల తో శివుని, నారాయణనుని తులసితోను, ఉసిరి తోను , శ్రీకృష్ణ డుకి నీ దళములతో పూజించిన వారికిశుభము కలుగును. తులసి ఒకసారి గణపతి ని ప్రార్ధన చేయగా గణపతి నిరాకరించెను. అప్పుడు తులసి కోపముతో " నీకు వివాహమగునా?" అనెను. 'విఘ్నేశ్వరుని పెళ్ళికి అన్నీ విఘ్నములే ' అని నానుడి వచ్చినది. 

గణపతి తులసిని "నీవు భూలోకములో రాక్షసునకు భార్య అయ్యి తదుపరి వృక్షము జీవించెదవు గాక అని శాపము ఇచ్చెను. దానికి తులసి గణపతిని వేడుకోగా ఓ తులసి నీవు పుష్పము లన్నిటిలో సారభూతవు. హరికి ప్రియమైన దానివి అవుతావు. నీవు నాకు మాత్రము ఎన్నడును పనికిరావు అని అనెను అందుచేత గణపతిని తులసి తో పూజించరు. తులసి కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున అవతరించుటవలన ఆరోజున విశేషముగా పూజచేయవలెను.

" యన్మూలె సర్వ తీర్థాన్ని యన్మధ్యే సర్వ దేవతా
యద్దాగ్రే సర్వ వేదాశ్చ తులసీత్వం నమామ్యహం "

అను మంత్రముతో ప్రతి రోజు తులసిని పూజించినచో స్త్రీలకు ఐదవ తనము మరియు లక్ష్మీ ప్రధము.