ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

GODDESS SARASWATHI MATHA PRAYERS FOR GOOD EDUCATION TO STUDENTS


రోజూ ఈ నామాలు ఉచ్ఛరిస్తే పరీక్షల్లో విజయం ఖాయం!

హిందూ పురాణాల ప్రకారం సరస్వతిని విద్యకు అధిదేవతగా పేర్కొంటారు. జ్ఞానం, తెలివితేటలు, జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, మనస్సులోని రెండు ముఖ్యమైన భాగాలు ఆమె అధీనంలోనే ఉంటాయి. వేదకాలం నాటి జ్యోతిషం ప్రకారం బుధ గ్రహానికి సరస్వతిని అధిదేవతగా పేర్కొంటారు. అంతే కాదు సృష్టి సమయంలో బ్రహ్మ ఏకాగ్రతకు భంగం కలగకుండా నిరంతరం వీణ వాయిస్తునే ఉంటుంది.

వాగ్దేవి ద్వాదశ నామాలను రోజూ ఉచ్ఛరిస్తే విద్యలో విజయం సాధిస్తారు. కేవలం విజయం సాధించడమే కాదు తలపెట్టిన కార్యాలు సానుకూలంగా నెరవేరతాయి. శారదదేవి 12 నామాలను జపించడం వల్ల పోటీ పరీక్షల్లో విజయం సాధించవచ్చు. కేవలం విద్య పరంగానే కాకుండా వ్యక్తిత్వంలోనూ మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ మంత్రోచ్ఛారణ వల్ల సానుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. ఉదయాన్నే స్నానం చేసి మీ అభిరుచిని కాగితంపై రాసి ఈ పన్నెండు నామాలను ఉచ్ఛరిస్తే ఫలితం ఉంటుంది.

1. ఓం భారతి నమ:

2. ఓం సరస్వతి నమ:

3. ఓం శారదే నమ:

4. ఓం హంసవాహినియే నమ:

5. ఓం జగతే నమ:

6. ఓం వాగేశ్వరి నమ:

7. ఓం కుముదినే నమ:

8. ఓం బ్రహ్మచారిణే నమ:

9. ఓం బుద్ధిదాత్రే నమ:

10. ఓం చంద్రకాంతే నమ:

11. ఓం వార్దాయని నమ:

12. ఓం భువనేశ్వరి నమ: