ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

PRAWNS PICKLE - CHIL CHIL HOT PICKLE


రొయ్యల పచ్చడి (ప్రాన్స్ పికిల్ )

చికెన్ తో ఎలా చేస్తామో అలాగే మటన్,రొయ్యలు,ఫిష్ వీటితో కూడా 

పచ్చళ్ళు పెట్టేయ్యొచ్చు.అయితే తప్పనిసరిగా ఫ్రిజ్ లోనే స్టోర్ 

చేసుకోవాలి.లేకపోతే నిలువ ఉండవు.అదొక్క జాగ్రత్త తీసుకుంటే ఎంతో 

రుచిగా ఉండే నాన్ వెజ్ పచ్చళ్ళు ఇంట్లోనే చేసుకుని వాడుకోవచ్చు.







కావలసిన  పదార్ధాలు : 


రొయ్యలు                                        కేజీ

అల్లంవెల్లుల్లి ముద్ద                     రెండు  టీ స్పూన్లు

కారం                                      నాలుగు టీ స్పూన్లు

ఉప్పు                                      నాలుగు టీ స్పూన్లు

పసుపు                                   పావు టీ స్పూన్ 

నూనె                                      పావు కిలో 

నిమ్మకాయలు                            నాలుగు 

కరివేపాకు                                 రెండు రెమ్మలు 

ఆవాలు                                     కొంచెం


మసాలాకు

లవంగాలు                               పది

చెక్క                                     రెండు పెద్ద ముక్కలు

జీలకర్ర                                  రెండు టీ స్పూన్లు

ధనియాలు                             రెండు టేబుల్ స్పూన్లు

గసగసాలు                              రెండు  టేబుల్ స్పూన్లు

ఎండుకొబ్బరి                           పావు చిప్ప


తయారు చేసే విధానం ;


ముందుగ రొయ్యలను శుభ్రంచేసి  కడిగి నీరు పోయేలా జల్లెడలో వేసి 

ఉంచుకోవాలి.


నూనె వేడిచేసి ఆవాలు, కరివేపాకు వేసి వేగాక రొయ్యలు వేయాలి.

నీరంతా ఇగిరిపోయి రొయ్యలు ఉడికి నూనె తేలేవరకు మధ్యమధ్యలో 

కలుపుతూ ఉడకనివ్వాలి.దీనికి షుమారుగా పావుగంట పడుతుంది.


ఈలోగా అల్లంవెల్లుల్లిని తడి తగలకుండా మెత్తగా ముద్ద చేసుకోవాలి.


మసాలాకు  రాసిన దినుసుల్ని మెత్తగా పొడి చేసుకోవాలి.


రొయ్యలు ఉడికి  నూనె తేలిన తరువాత పసుపు,అల్లంవెల్లుల్లి ముద్ద 

వేసి బాగా కలిపి పచ్చిదనం పోయేవరకూ వేయించాలి.


మసాలాపొడి,ఉప్పు వేసి కలిపి సన్నని సెగపై ఈ మిశ్రమం మొత్తం వేగి 

నూనె తేలేవరకు వేయించాలి. 


చివరిగా కారం వేసి స్టవ్ ఆఫ్ చేసి బాగా కలపాలి .


చల్లారిన తరువాత నిమ్మరసం పోసి కలిపితే రుచికరమైన రొయ్యల 

పచ్చడి రెడీ అవుతుంది.


ఒక బాటిల్ లో పెట్టుకుని ఫ్రిజ్ లో ఉంచుకుని తడి తగలకుండా 

వాడుకోవాలి.


నోట్:  ఎవరి రుచికి తగ్గట్టు ఉప్పు,కారం,మసాలాలు,నిమ్మరసం 

ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు.

అలాగే కొందరు ముందు రొయ్యలు ఉడకపెట్టి వాటిని నూనెలో వండి 

చేస్తారు.అలా కూడా చెయ్యొచ్చు కానీ ముక్క గట్టిగా అయిపోతుంది.

అందుకని నేను ఈ పధ్ధతి ఫాలో అవుతాను.